Gajulu Gajulu gala gala :గాజులు గాజులు గాజులు గల గల అంటూ దుర్గమ్మ పాటతో ఒక్క రాత్రిలోనే సాలిడ్ క్రేజ్ కొట్టేసింది రాధమ్మ కూతురు ఆలియాస్ దివ్య .ఎంతలా అంటే రాత్రికి రాత్రే మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసేంతగా .ఇక ఇప్పటికీ ఆపాట ఏకంగా 23 మిలియన్లని క్రాస్ చేసి మరింత దూసుకుపోవడం విశేషం .
అయితే పాట కి ఎంత క్రేజ్ వచ్చిందో,ఎన్ని ప్రశంసలు వచ్చాయో అంతకు మించిన వివాదాలూ చుట్టు,ముట్టాయి.ముఖ్యంగా కల్యాణి అమ్మతో మొదలైన ఈ కాంట్రవర్సి నెటిజన్ల ట్రోలింగ్ తో ఇబ్బడి ముబ్బడిగా కంటిన్యు అయిపొయింది.
అయితే వచ్చిన విమర్శలకి జవాబిస్తూనే ఎక్కడా తగ్గకుండా తనదైన శైలిలో పాటలు చేసుకుపోతుంది రాధమ్మ కూతురు.ఇక ఈ క్రమంలోనే తాజాగా మరో ఫోక్ సాంగ్ ని చేసి నెట్టింట్లోకి వదిలింది.
‘ఓ సూరిగా’ అంటూ రాధమ్మ కూతురు రచ్చ
‘ఓ సూరిగా’ అంటూ వచ్చిన ఈ పాటలో వెంకీ,రాధమ్మ కూతురు ,పండు,హేమలత కలిసి నటించారు.ఇక వనీలా గుజ్జేటి అద్భుతమైన పదాలు అందించగా,నర్సింలు తో కలిసి వనీలా గుజ్జెటి కలిసి పాడటం విశేషం,ఇక హానీ గణేష్ మ్యూజిక్ అందించిన ఈ పాటని చింటూ పవర్ తనవైన స్టెప్పులతో నెక్స్ట్ లెవెల్ లో పెట్టాడనే చెప్పాలి.
ఇక ఇప్పటికే ఈ పాట 349k వ్యూస్ ని కొల్లగొట్టింది అంటే ఆడియన్స్ ని ఎంతలా ఆకట్టుకుంటుందో అర్థం అవుతుంది.ఇక ఈ ఫోక్ సాంగ్ కి రాధ నిర్మాతగా కాగా సూపర్ రంజిత్ దర్శకత్వం వహించారు.ఇక అరవింద్ కొంతం సినిమాటోగ్రఫీ,ఎడిటింగ్ సాంగ్ కి బాగా కలిసివచ్చాయనే చెప్పాలి .
అత్తున్న పోతున్న రామచిలుక
ఇక ఇదే ఊపులో అత్తున్న పోతున్న రామచిలుక అనే పాటని కూడా నెట్టింట్లోకి వదిలింది రాధమ్మ కూతురు ఆలియాస్ దివ్య.అమర్ తో కలిసి స్టెప్పులేసిన ఈ పాట ఇప్పటికి 154k వ్యూస్ ని సొంతం చేసుకుని దూసుకుపోతుంది.
రాకేష్ గౌడ్ ,పూజా దొండాడి లిరిక్స్ ఇవ్వడంతో పాటు కలిసి పాడటం విశేషం.ఇక బాబు తారక్ కొరియోగ్రఫీ అందించగా జీయల్ నామదేవ్ పాటకి మ్యూజిక్ తో పాటు సాలిడ్ డీజే బీట్స్ ని యాడ్ చేయడంతో ఇపుడు ఎక్కడ చూసినా ఈ పాటే దర్శనమిస్తుంది.ఇక నాగుల శ్రీకాంత్ నిర్మించిన ఈ పాటకి కత్తెర పాక వేణు సినిమాటోగ్రఫీ తో పాటు ఎడిటింగ్ నిర్వహించారు.
also read:బిందె పాటలకి ఈ క్రేజ్ ఏంటి మావా ..మాధురి రాథోడ్ నుండి యమునా తారక్ దాకా !
అయితే గతంలో గాజులు గల గల పాటకి వచ్చిన ట్రోల్స్ నెట్టింట వైరల్ కాగా రాధమ్మ కూతురు ఆలియాస్ దివ్య చేసిన ఈ పాటలకి పాజిటివ్ టాకే ఎక్కువగా రావడం విశేషం.మొత్తానికి గాజుల గలగలతో సోషల్ మీడియాలో సాలిడ్ క్రేజ్ సొంతం చేసుకున్న రాధమ్మ కూతురు ఇప్పుడిలా జానపదాలతో ఫోక్ ఇండస్ట్రీలో పాగా వేయాలని ఫిక్స్ అయిందన్న మాట. చూడాలి మరి మాధురీరాథోడ్ లా దూసుకుపోవాలని కోరుకుంటున్న ఈ అమ్మడు ఆశలు నెరవేరుతాయో లేదో !