Intinti Ramayanam Today Episode November 18th : గుడికొచ్చిన అవని వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా కమల్ కి పూజ చేయించాలి అని అనుకుంటారు. అయితే అప్పుడే రమ్య కూడా అక్కడ కనిపించడంతో రమ్య నువ్వా ఇక్కడ కనిపించడం చాలా సంతోషంగా ఉంది అని అవని అంటుంది. అవని అక్క అంటూ రమ్య పిలవడంతో వాళ్ళ అన్నయ్య ఎవరు అని అడుగుతారు. నాకు తెలిసిన వాళ్ళ అన్నయ్య అని వాళ్ళ అన్నయ్య కూడా పరిచయం చేస్తుంది. అయితే నిజం ఈ అమ్మాయి చాలా మంచిది కదా మనం ఆరోజు ఎంతగా ఆలోచించినా కూడా పల్లవి చేసిన దానికి ఎవరైనా సీరియస్ అవుతారు. కానీ ఈ అమ్మాయి మాత్రం చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి నవ్వుతో మాట్లాడుతుంది అని అందరూ రమ్యను పొగిడిస్తూ ఉంటారు. రమ్య కి సారీ కూడా ఎప్పుడో చెప్పేసాను అని చెప్పడంతో నిజంగానే చాలా గ్రేట్ ఈ అమ్మాయి అంటూ అందరూ పొగిడేస్తారు..
ఇక రమ్యను పెళ్లికూతురుగా రెడీ ఎగిరి రమ్మని అబద్ధం చెప్పి వాళ్ళ అన్నయ్య పూజ పేరుతో ఆమెను మోసం చేయాలని చూస్తాడు. అయితే అక్కడ పెళ్ళికొడుకు సారథి దూరంగా ఉండి రమ్య రెడీ అవుతుందా లేదా అని చూస్తూ ఉంటాడు. మొత్తానికి రమ్యని బురిడీ కొట్టించి మరి పెళ్లికూతురుగా రెడీ అయ్యేలా చేస్తారు. అయితే పంతులుగారు ముందుగా నేను ఈ దొంగ పెళ్ళికి చెయ్యను అమ్మాయికి నిజం చెప్పాలని ఎంత చెప్తున్నా సరే అసలు వినకుండా పెళ్లి కొడుకు నీకు ఇంకా డబ్బులు ఇస్తాను ఈ పెళ్లి ముందు జరిపించండి అని అంటారు.. ఇది రమ్య అలా వెళుతూ ఉండగా చూసిన కమల్ రమ్య అని పిలుస్తాడు దాంతో ఆమె వెనక్కి తిరిగి పడిపోతుండగా పట్టుకుంటాడు అయితే ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా రమ్య వాళ్ళ అన్నయ్య వచ్చి మా చెల్లెలి మీద నీకు ఆ ఫీలింగ్ ఉంటే వెంటనే మార్చుకొని అంటాడు.. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు అని అనగానే సరి ఇకమీదట వెళ్ళిపో అని అంటాడు. కానీ రమ్యకు మాత్రం అనుమానం వస్తుంది.. అక్కడ పెళ్లికి సిద్ధం చేయడంతో అక్కడ అదంతా చూసి కాస్త అనుమాన పడుతుంది.
రమ్య అక్కడ పూజ కోసం అని అక్కడికి వచ్చి ఉంటుంది. అయితే అక్కడ వాతావరణం చూసి తనకి ఏదో అనుమానం కలుగుతుంది. నిజంగానే ఇక్కడ ఏదో జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. నేనొక్కదాన్నే పూజ చేయాలి కదా మరి ఇక్కడ ఏంటి కలిసి పూజ చేయాలి అని అంటున్నారు అని చాలా బాధపడిపోతూ భయపడిపోతూ ఉంటుంది. నీకు అంత తెలిసింది కాబట్టి నిజం చెప్తాను అని రమ్య వాళ్ళ అన్నయ్య రమ్యకు జరగబోయే పెళ్లి గురించి చెప్తాడు. నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావో నేను అసలు ఊహించలేదు ఇలా నువ్వు ఎందుకు చేస్తున్నావు నాకు అర్థం కావడం లేదు అని రమ్య చాలా బాధపడిపోదు భయపడిపోతూ ఉంటుంది. ఇక అక్కడికి సారధి రావడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది.
ఇక గుడిలో నుంచి అందరూ పూజ చేసిన తర్వాత బయటికి వస్తూ ఉండగా.. వాళ్ళని చూసిన రమ్య కమల్ గారు, అవని అక్క అంటూ గట్టిగా కేకలు వేస్తుంది. కానీ అప్పుడు అక్కడికి పల్లవి రావడంతో వాళ్ళు రమ్య మాటనే వినిపించుకోరు. ఇక పల్లవి బావ పుట్టినరోజు కదా నీకోసం గుడిలో అర్చన చేయించాలని వచ్చారు. పద బావ వెళ్దామని బలవంతంగా లోపలికి తీసుకుని వెళుతుంది. అక్కడున్న పంతులుగారు ఆల్రెడీ నేను ఆయన పేరు మీద పూజ చేసే రమ్మని ఎంత చెప్తున్నా సరే.. పల్లవి మాత్రం అస్సలు వినకుండా మళ్ళీ చేయకూడదని రూల్ లేదు కదా.. అవన్నీ పేరు తప్ప మిగిలిన వాళ్ళందరి పేర్లు మీద అర్చన చేయించాలి అని చెప్తుంది. కానీ ఎవ్వరూ అవని పేరు మీద చేయకుండా ఉంటే మాకు వద్దు అని అంటారు. దానితో పంతులుగారు అవన్నీ పేరు మీద కూడా మరోసారి అర్చన చేస్తాడు..
చూసావా బావా నేనంటే నీకు ఇష్టం ఉంది కాబట్టే నేను అర్చన చేస్తే నువ్వు చేయించుకున్నావు అని కమల్ తో పల్లవి అంటుంది. అయితే ఆ మాట విన్న తర్వాత కమ్మలు చాలా సీరియస్ అవుతాడు. నేను నీ మీద ప్రేమతో చేయించుకోలేదు దేవుడికి ఇలాంటివి నచ్చవు దేవుడు కాబట్టే అర్చన చేయించుకున్నాను అని చెప్పగానే.. పల్లవి కాస్త షాక్ అయినా కూడా నాకు మాట విన్నాడు అని సంతోషపడుతుంది. ఇక అదేంటి బావా వెళ్ళిపోతున్నావు ప్రసాదం తీసుకోకుండా అని పల్లవి అంటుంది. ఇక పల్లవి ప్రసాదంను ఇస్తూ ఉండగా వాళ్ళని చూసిన రమ్య పిలుస్తుంది అయితే అక్కడ ఏదో జరుగుతుంది అని అందరూ పరిగెత్తుకుంటూ వెళ్లిపోతారు.
రమ్య ఏంటి నువ్వు ఇలా ఉన్నావు ఏమైంది అని అవని వాళ్ళందరూ కంగారుపడుతూ అడుగుతారు. మా అన్నయ్య నాకు బలవంతంగా ఇష్టం లేని పెళ్లి చేస్తున్నాడు అండి అని రమ్య చెప్పగానే వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఇష్టం లేని పెళ్లి చేయడం తప్పు అని నీకు తెలియదా అని ఎంత చెప్తున్నా సరే వాళ్ళ అన్నయ్య మాత్రం నా చెల్లెలు నా ఇష్టం అడగడానికి మీరు ఎవరు అంటూ మాట్లాడడంతో ఇక అవని అలాగే శ్రీకర్ కమల్ ఆ పెళ్లి కొడుకుని వాళ్ళ అన్నయ్యకి దిమ్మ తిరిగిపోయిన షాక్ ఇస్తారు పోలీసులకు పిలిపిస్తామని అంటారు. ఇక వాళ్ళు భయపడి ఎక్కడి నుంచి వెళ్లిపోతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :పూజా హెగ్డే ఒక్కనెలకు అంత సంపాదిస్తుందా..? సినిమా కన్నా ఎక్కువ..