Anasuya: ప్రముఖ టాలీవుడ్ నటిగా, బుల్లితెర యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అనసూయ (Anasuya).. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఏదో ఒక విషయంపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా ఈమెపై కొన్ని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని అవమానించింది అని హిందూ దేవుళ్లను కించపరిచింది అంటూ ఆమెపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే అనసూయ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తన వ్యాఖ్యలని వక్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నారంటూ మండిపడింది.
తాను సనాతన ధర్మాన్ని పాటించే హిందువుని అని, తనకు ధర్మం, విశ్వాసాలపై పూర్తి నమ్మకం ఉందని, తనను వేధించే వాళ్లది ఏ మతమైనా సరే తాను ప్రశ్నిస్తానని, కేవలం ఎడిట్ చేసిన క్లిప్ లతో వాగ్వాదానికి దిగకండి అంటూ కూడా కోరింది. అంతేకాదు తాను హిందువునని చెప్పుకోవడానికి ఎలాంటి సంకోచం లేదు అంటూ కూడా తెలిపిన అనసూయ.. గత కొన్ని రోజులుగా ఇలాంటి వివాదాలకు దూరంగా.. వర్కౌట్స్ చేస్తూ..ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కాలక్షేపం చేస్తోంది. అయితే తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానం చెప్పిన ఈమె.. ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇచ్చింది.
తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా నెటిజన్స్ అడిగిన ప్రశ్నలను తన సమాధానాలను వీడియోల రూపంలో పంచుకుంది అనసూయ. ఈ మేరకు ఒక నెటిజన్ ప్రశ్నిస్తూ..” అక్క ఒకటి చెప్పండి.. మీరు హిందూ దేవుళ్లను ఊరికే తిడతారు. అసలు మీరు ఏ దేవుడిని నిజంగా నమ్ముతారు?” అని ప్రశ్నించారు. దీనికి అనసూయ మాట్లాడుతూ.. “నేను పేరు లేదా డీపీ లేని అకౌంట్స్ కి అసలు రెస్పాండ్ అవ్వకూడదు అనుకుంటాను. కానీ ఇది ఏదైతే ఆరోపణ ఉందో దీనిని చాలామంది అనుకుంటున్నారు కానీ.. ఒక అవకాశం తీసుకొని దీనిపై వివరణ ఇద్దాం అనుకుంటున్నాను. నాకు ఒక విషయం చెప్పండి.. నేను హిందూ గాడ్స్ ని ఊరికే తిట్టానా? నేను హిందూ గాడ్ ని ఎప్పుడు తిట్టలేదు.. నేను హిందూ దేవుణ్ణి నమ్ముతానా? అసలు దీనికి ఎలా సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు.
also read:అరుదైన ఘనత అందుకున్న నయనతార?
నమ్మకాలు అనేవి నిరూపించుకునేవి కావు. నా నమ్మకాలు నావి.. నా అనుకున్న వాళ్లు, నన్ను బాగా ఇష్టపడేవాళ్లు తప్పుగా అర్థం చేసుకోరు కాబట్టి చెబుతున్నాను. అసలు నేను ఏ దేవుడిని ఎప్పుడు తిట్టానో చెప్పండి. నేను దేవుడి పేరు చెబుతూ చండాలాలు చేసే వారిని తిట్టాను తప్ప దేవుడిని ఎప్పుడు తిట్టానో నాకు చూపించాలి మీరు” అంటూ తనదైన శైలిలో ప్రశ్నించింది. మొత్తానికైతే హిందూ దేవుళ్ళను తాను తిట్టలేదని, హిందూ దేవుళ్ళ పేరు చెప్పుకొని మోసం చేస్తున్న వారి గురించి ప్రస్తావిస్తున్నాను అని అనసూయ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా.. ఇలా ఎవరో ఒకరు మళ్ళీ హిందూ దేవుళ్ళ ప్రస్తావన తీసుకురావడం హాట్ టాపిక్ గా మారింది.
https://www.instagram.com/stories/itsme_anasuya/4017787518471691022?utm_source=ig_story_item_share&mdxt=MXBzdzM3ZjFkZ21mYQ==