Bigg Boss 10: బిగ్ బాస్ సీజన్ 10 ఎనిమిదవ వారంలో బిగ్ బాస్ హోటల్ అనే ఒక టాస్క్ జరుగుతున్న విషయం తెలిసిందే. మూడు లెవెల్స్ లో ఉన్న సభ్యులు వర్కర్స్ గా, హోటల్ మేనేజర్స్ గా, గెస్ట్లుగా వ్యవహరిస్తున్నారు. హోటల్ మేనేజర్ దగ్గర మెప్పు పొంది, వర్కర్స్ క్యాష్ తీసుకోవాలని, గెస్ట్‌లు తమకు నచ్చిన వారికి .. తమ దగ్గర ఉన్న స్టార్స్ ను బహుమతిగా ఇవ్వచ్చు అంటూ ఒక టాస్క్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఉదయం నిర్వహించిన టాస్క్ లో రోహిత్ తన మాస్టర్ గేమ్‌తో మేనేజర్స్ అలాగే గెస్ట్ ల దగ్గర క్యాష్ తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే ఇప్పుడు తాజాగా విడుదల చేసిన రెండవ ప్రోమోలో రోహిత్ అసలైన ఆట మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ కూడా వర్షిణి బ్లాక్మెయిల్ చేయడం మరోవైపు త్రిగుణ్ తన మాస్టర్ ప్లాన్ వర్కౌట్ చేయడం చూసాము. మరి తాజాగా విడుదల చేసిన ఈ రెండవ ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం
ప్రోమో మొదలవగానే ముఖేష్, వర్షిణి ఒకరికొకరు కౌగిలించుకున్నట్లు డిస్ప్లేలో రెండు ఫోటోలు పెట్టారు. అయితే త్రిగుణ్ తో మాట్లాడుతున్న దేబ్ జానీ ఒక్కసారిగా ఈ ఫోటోలు చూసి షాక్ అయింది. దేబ్జానీ ముఖేష్ దగ్గరకు వచ్చి.. ఏంటిది ? అని ప్రశ్నించగా.. తను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఇక్కడ పని చేస్తోందని నాకు తెలియదు. అంటూ ముఖేష్ అమాయకంగా చెబుతాడు. ఇక దెబ్జానీ తన సీరియల్ యాక్టింగ్ మొదలుపెట్టింది. ఎలా చేస్తావు ఇలా అంటూ ఒక రేంజ్ లో తన నటనను ప్రారంభించింది . “ఆ అమ్మాయిలో ఏముంది? నాలో ఏం లేదు ? అని అడగగా.. ముఖేష్ ఒక్కసారిగా బుర్ర లేదు అంటూ కౌంటర్ ఇచ్చాడు. తర్వాత వర్షిణి అమన్ తో మాట్లాడుతూ..” నా ప్రేమ నీ దగ్గరే ఉంది. ఇదంతా ఫేక్ అంటూ అమన్ ను నమ్మించే ప్రయత్నం చేసింది. అలా సరదాగా వచ్చిన ఈ ఫోటో ఆడియన్స్ లో నవ్వులు పూయించింది.
ఇక శివ, రాంప్రసాద్ లతో త్రిగుణ్ మాట్లాడుతూ.. డీల్ కుదిరింది. 4000 తక్కువగా ఉంది అంటూ క్యాష్ పంచుకున్నారు. ఆ తర్వాత అమన్ తన దగ్గర ఉన్న స్టార్ ను రాంప్రసాద్ కి ఇచ్చి స్టార్ అవ్వాలని కోరుకో అంటూ చెప్పాడు. త్రిగుణ్ వర్షినితో మాట్లాడుతూ..” నేను స్టార్ ఎవరికి ఇస్తున్నానో నీకు చెప్పే ఇస్తాను” అంటూ చెప్పాడు. అయితే వర్షిణి మాత్రం నాకే ఇస్తానని చెప్పు అని అడుగుతుంది. దానికి త్రిగుణ్ నేను కమిట్మెంట్ ఇవ్వలేను అంటూ చెబుతాడు. ఇక్కడైనా కన్సిడర్ చేయరా అంటూ తన ఫ్రెండ్షిప్ ని బయట పెట్టింది. అయితే త్రిగుణ్ మాత్రం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకు వర్షిని అంటూ చెప్పాడు. అటు నీతూ కూడా రాంప్రసాద్ కి ఒక స్టార్ ఫ్రీగా ఇచ్చింది.
also read: జగపతిబాబు షోలో పూజా హెగ్డేకి బన్నీ స్పెషల్ సర్ప్రైజ్!
ఆ తర్వాత త్రిగుణ్ రామకృష్ణతో మాట్లాడుతూ.. అక్కడ స్టార్స్ అన్నింటిని పంచింది నేనేలే అంటూ రామకృష్ణకు జలక్ ఇచ్చాడు. గేమ్ మొత్తం మీ నుంచే కదిలిందని నాకు తెలుసు అంటూ రామకృష్ణ చెప్పాడు. మొత్తానికి తాజా ప్రోమో ను బట్టి చూస్తే.. ఆట మొత్తం త్రిగుణ్ చేతిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇది చూసిన నెటిజన్స్ బిగ్ బాస్.. అసలు హౌస్ లో ఏం జరుగుతోంది? నువ్వు గేమ్ ప్లాన్ చేస్తున్నావా? లేక త్రిగుణ్ గేమ్ నడిపిస్తున్నాడా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరొకరు అయితే ఇది త్రిగుణ్ గాడి రూల్ అంటూ పోస్ట్‌లు పెడుతూ ఉండడం గమనార్హం.