E-Paper
Advertisement

రామ్ ప్రసాద్ ని లాగిపెట్టి కొట్టిన త్రిగుణ్.. రోహిత్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యిందా?

రామ్ ప్రసాద్ ని లాగిపెట్టి కొట్టిన త్రిగుణ్.. రోహిత్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యిందా?
Advertisement

Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో మునుపెన్నడూ లేని విధంగా రోజుకో టాస్క్, ఊహించని ట్విస్ట్ లు, ఆడియన్స్ లో సరికొత్త క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా నిన్న మొన్నటివరకు గోట్, అల్టిమేట్ గోట్ అంటూ టాస్కులు నిర్వహించగా.. ఇటు నామినేషన్లు ఆడియన్స్ లో ఆసక్తిని కలిగించాయి. అయితే ఇప్పుడు తాజాగా 52వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో బిగ్ బాస్ ఇచ్చిన మరో టాస్క్ నవ్వులతో పాటు కాస్త టెన్షన్ కూడా క్రియేట్ చేసింది. ముఖ్యంగా రామ్ ప్రసాద్ ను త్రిగుణ్ చెంపకేసి కొట్టడం, అటు రోహిత్ మాస్టర్ ప్లాన్ వర్క్ అవుట్ అవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి తాజా ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం..

హోటల్ గా మారిన బిగ్ బాస్ హౌస్..

బిగ్ బాస్ మాట్లాడుతూ బిగ్ బాస్ ఇల్లు కాస్త ఇప్పుడు బిగ్ బాస్ హోటల్ గా మారింది. మూడు లెవెల్స్ లో ఉన్న సభ్యులు మూడు రకాల పాత్రలు పోషించాల్సి ఉంటుంది. రెడ్ లెవెల్ లో ఉన్న సభ్యులు హోటల్ వర్కర్స్ గా పనిచేస్తారు. హోటల్ వర్కర్స్ అందించే సేవలు నచ్చితే వారికి టిప్పు రూపంలో డబ్బు ఇవ్వచ్చు. అలాగే ఎల్లో లెవెల్ లో ఉన్న సభ్యులు హోటల్ ఓనర్స్ గా ఉంటారు.. హోటల్ ఓనర్స్ అందించే ఆతిథ్యం నచ్చితే.. గెస్టులు తమ దగ్గర ఉన్న స్టార్స్ ను వారికి ఎప్పుడైనా బహుమతిగా ఇవ్వవచ్చు. అంటూ టాస్క్ నిర్వహించారు . అలా ఎవరికి వారు తమ లెవెల్ కి తగ్గట్టుగా డ్రెస్ కోడ్ ధరించి టాస్క్ మొదలుపెట్టారు. అందులో మొదట హోటల్ మేనేజర్ గా ఉన్న నరేష్ వర్కర్స్ తో కామెడీ పండించాడు.

రాంప్రసాద్ ను కొట్టిన త్రిగుణ్..

Advertisement

ఇక తర్వాత త్రిగుణ్ రామ్ ప్రసాద్ తో మాట్లాడుతూ .. మెడలో ఉన్న గొలుసు కొట్టేయాలి అంటే ఒక స్కెచ్ వేయాలి అంటూ తన ప్లాన్ వివరిస్తాడు.. దీనికి రాంప్రసాద్ మాట్లాడుతూ దానికి స్కెచ్ వేయడం ఎందుకు? మెడలో ఉన్న గొలుసును ఇలా పట్టుకొని వెళ్తే సరిపోతుంది కదా అంటూ త్రిగుణ్ మెడలో ఉండే గొలుసును తీసుకునే ప్రయత్నం చేస్తాడు. వెంటనే త్రిగుణ్ రాంప్రసాద్ ను రెండు మూడు సార్లు చెంపకేసి కొడతాడు. ఇక వీరు చేసిన స్కిట్ కాస్త నవ్వులు పూయించింది. ఇక తర్వాత వర్షిని ముఖేష్ దగ్గర స్టార్స్ పొందే ప్రయత్నం చేస్తుండగా.. దేబ్జానీ మధ్యలో వచ్చి నువ్వు నా మొగుడు అంటూ కామెంట్ చేస్తుంది.

also read: ఫౌజీ టీజర్ వివాదం.. కేంద్రమంత్రికి లేఖ!

రోహిత్ మాస్టర్ ప్లాన్ వర్క్ అవుట్..

Advertisement

అయితే రోహిత్ కి ఒక ఫోటో దొరుకుతుంది. ఇక ఈ ఫోటోని అడ్డుపెట్టుకొని గెస్ట్లుగా ఉన్న వారి దగ్గర డబ్బులు లాక్కునే ప్రయత్నం చేస్తాడు. ఈ ఫోటో కావాలంటే 600 కావాలి అని ఎవరికి ఆ ఫోటో కావాలంటే వాళ్ళు 600 ఇవ్వాలి అంటూ మాస్టర్ గేమ్ మొదలు పెడతాడు. అలా అందరి దగ్గర డబ్బులు తీసుకొని చివరికి ఆ ఫోటో వర్షినికి ఇచ్చేస్తారు. ఇక ఆ ఫోటోలో ఉన్నది చూసి ముఖేష్ ఆశ్చర్యపోతాడు . అయితే ఆ ఫోటోలో ఏముంది అన్న విషయం మాత్రం చూపించలేదు. మొత్తానికి అయితే మాస్టర్ ప్లాన్ తో ఆ ఫోటో చూపించి గట్టిగానే డబ్బులు లాగేసుకున్నారు రోహిత్ . ప్రస్తుతం ఇందుకు సంబంధించి ప్రోమో వైరల్గా మారుతోంది.

Related News

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్.. అక్టోబర్ నెల హైలెట్స్..

Bigg Boss Telugu 10: నామినేషన్లో 8 మంది.. ఎలిమినేట్ ఎవరంటే..?

Intinti Ramayanam Meenaakshi : మీనాక్షి ఒక్కరోజు రెమ్యూనరేషన్ అంతా..?

Ye Devi Varamo Neevu: అంజలి నెలకు అంత సంపాదిస్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: బాలుకు దిమ్మతిరిగే షాక్.. శోభా, చింతామణి కలిసిపోయారు.. గుణ అవుట్..

Karthika Deepam 2 Serial Today Episode October 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ రూంలోకి వెళ్లిన జ్యోత్స్న షాక్ అవ్వడానికి కారణం ఏంటి..? 

Podarillu Today Episode : కన్నాపై మహా సీరియస్.. పాపం మనీష.. నిజం తెలిసిపోతుందా..?

Big Stories

Advertisement
×