E-Paper
Advertisement

జగపతిబాబు షోలో పూజా హెగ్డేకి బన్నీ స్పెషల్ సర్ప్రైజ్!

జగపతిబాబు షోలో పూజా హెగ్డేకి బన్నీ స్పెషల్ సర్ప్రైజ్!
Advertisement

Jagapathi Babu:తెలుగు ప్రేక్షకులు ‘బుట్టబొమ్మ’ అని ముద్దుగా పిలుచుకునే పూజా హెగ్డే (Pooja hegde) మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. తమిళ సినిమాలతో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ, చాలా రోజుల తర్వాత తెలుగు టెలివిజన్‌పై కనిపించబోతున్నారు. జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాపులర్ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్ము రా’ సీజన్ 2లో పూజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇచ్చిన స్పెషల్ సర్‌ప్రైజ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

జగపతి బాబు-పూజా హెగ్డే రీ-యూనియన్:

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటించగా, జగపతి బాబు పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత వీరిద్దరూ ‘జయమ్ము నిశ్చయమ్ము రా’ షో వేదికగా ఒకరినొకరు కలుసుకున్నారు. ఇక ఈ స్పెషల్ చిట్ చాట్‌లో పూజా హెగ్డే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించిన పలు ఆసక్తికరమైన రహస్యాలను షేర్ చేసుకున్నారు.

వేదికపై హరీష్ శంకర్ గ్రాండ్ ఎంట్రీ:

Advertisement

ఈ షోలో పూజా హెగ్డేకి ఒక ఊహించని సర్ప్రైజ్ లభించింది. బ్లౌక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ హఠాత్తుగా ఈ ఎపిసోడ్‌లోకి అతిథిగా అడుగుపెట్టి పూజను ఆశ్చర్యపరిచారు. ఇక అల్లు అర్జున్-పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన ‘దువ్వాడ జగన్నాథమ్’ మూవీను హరీష్ శంకరే తెరకెక్కించిన విషయం తెలిసిందే. షోలో ఆయన పాల్గొని పూజతో ఉన్న షూటింగ్ జ్ఞాపకాలను, ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

ఫోన్ లైన్లో బన్నీ.. ‘మేడమ్ సార్ మేడమ్ అంతే’:

అంతటితో సర్ప్రైజ్ ఆగలేదు.. షో మధ్యలో జగపతి బాబు నేరుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఫోన్ కాల్ చేశారు. ఫోన్లో మాట్లాడిన బన్నీ.. పూజా హెగ్డేని ఎంతో ఆప్యాయంగా ‘బుట్ట బొమ్మ’ అని పిలిచి విష్ చేశారు. అంతేకాకుండా, వారి కాంబినేషన్లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ఫేమస్ డైలాగ్ “మేడమ్ సార్ మేడమ్ అంతే..” అని లైవ్‌లో పూజా కోసం చెప్పడంతో సెట్ అంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది.

Advertisement

also read:గేమ్ ఛేంజర్ అసలు స్టోరీ ఇదేనా..ఇన్నాళ్ళకు బయటపెట్టిన డైరెక్టర్ కార్తీక్!

స్ట్రీమింగ్ అండ్ టెలికాస్ట్ డేట్స్ ఇవే:

అల్లు అర్జున్ స్వీట్ వాయిస్, హరీష్ శంకర్ ఫన్నీ కామెంట్స్, జగపతి బాబు మార్కు హోస్టింగ్‌తో సాగిన ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ ఎపిసోడ్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 లో అక్టోబర్ 30 నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. అలాగే బుల్లితెర వీక్షకుల కోసం జీ తెలుగు ఛానల్‌లో నవంబర్ 1వ తేదీ సాయంత్రం 7:30 గంటలకు ప్రసారం కానుంది.

ఇక మొత్తానికి చూస్తే, చాలా రోజుల తర్వాత పూజా హెగ్డే తెలుగు టాక్ షోలో కనిపించడం, దానికి తోడు బన్నీ ఫోన్ కాల్ సర్ప్రైజ్ ఇవ్వడంతో ఈ ‘జయమ్ము నిశ్చయమ్ము రా’ ఎపిసోడ్‌పై భారీ బజ్ ఏర్పడింది. ఇక ఈ స్పెషల్ షో బుల్లితెర వీక్షకులతో పాటు ఓటీటీ ఆడియన్స్‌కు ఖచ్చితంగా మంచి వినోదాన్ని పంచబోతోందని చెప్పవచ్చు..

Related News

వర్షిణి బ్లాక్ మెయిల్.. ఆట మొదలెట్టిన త్రిగుణ్.. బిగ్ బాస్ ఏం జరుగుతోంది?

ఏం సాంగ్ భయ్యా ఇది.. మైండ్ పోతుంది ! అప్పుడే పది లక్షల వ్యూస్

రామ్ ప్రసాద్ ని లాగిపెట్టి కొట్టిన త్రిగుణ్.. రోహిత్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యిందా?

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్.. అక్టోబర్ నెల హైలెట్స్..

Bigg Boss Telugu 10: నామినేషన్లో 8 మంది.. ఎలిమినేట్ ఎవరంటే..?

Intinti Ramayanam Meenaakshi : మీనాక్షి ఒక్కరోజు రెమ్యూనరేషన్ అంతా..?

Ye Devi Varamo Neevu: అంజలి నెలకు అంత సంపాదిస్తుందా..?

Big Stories

Advertisement
×