E-Paper
Advertisement

ఏం సాంగ్ భయ్యా ఇది.. మైండ్ పోతుంది ! అప్పుడే పది లక్షల వ్యూస్

ఏం సాంగ్ భయ్యా ఇది.. మైండ్ పోతుంది ! అప్పుడే పది లక్షల వ్యూస్
Advertisement

Samsaari Song:ఫోక్ సాంగ్స్ కి ఆడియన్స్ లో ఎంతటి క్రేజ్ ఉందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.అయితే గతంలోనూ ఆ క్రేజ్ ఉన్నప్పటికీ సోషల్ మీడియా జమానా వచ్చాక మరింత పెరిగిపోయింది.మరీ ముఖ్యంగా మారు మూల పల్లెటూర్లలో ఉన్న టాలెంట్ బయటికి వచ్చి నెట్టింట్లో సాలిడ్ గా సత్తా చాటుతుంది.ఇక ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో పాటలు సోషల్ మీడియాని షేక్ చేస్తూ మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టగా తాజాగా అదే బాటలో నడుస్తూ ఆడియన్స్ తో పాటు ఫోక్ లవర్స్ ని ఫిదా చేస్తుంది.అదే సంసారి అనే సరికొత్త జాన పదం.

సాంగ్ ని నెక్స్ట్ లెవెల్ లో పెట్టేసిన యాక్టర్స్ 

Advertisement

కిర్రాక్ నాని నటించడమే కాకుండా ఈ పాటకి కాన్సెప్ట్ ఇచ్చి ఎడిటింగ్ తో పాటు దర్శకత్వ బాధ్యతలని కూడా నిర్వర్తించడం నిజంగా మెచ్చుకోతగ్గ విషయం.ఇక ఇందులో నానికి జోడీగా జాను భూపతి కాలు కదిపి అదరగొట్టింది.మరో వైపు అడపాదడపా సినిమాలలో కనిపించే మణి భామతో పాటు ఆది నారాయణ కూడా లీడ్ రోల్స్ లో కనిపించి మెప్పించారు.

ఇక ఈ పాట ఆడియన్స్ కి ఇంతలా కనెక్ట్ అయిందంటే ఇందులో అటు నాని,జాను భూపతి ల మధ్య కెమిస్ట్రీతో పాటు ఇటు మణి భామ, ఆది నారాయణ ల కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయిందని చెప్పాలి.మరీ ముఖ్యంగా ఇందులో జై రాజ్ తాదుర్రి రాసిన లిరిక్స్ కి తగ్గట్టుగా ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.ఇక నర్సింలు ,ఉష అక్కలు పాడిన ఈ జానపదానికి నవీన్ జె మ్యూజిక్ చేయగా శిశాంత్ కొరియోగ్రఫీ చేసి సాంగ్ ని నెక్స్ట్ లెవెల్ లో పెట్టేశారు.

Advertisement

ప్రతీదీ సరిగ్గా కుదరడంతో

ఇక ఈ పాట పూర్తిగా తెలంగాణా పదాలతో నిండిపోవడం,పాటలో మట్టి పరిమళాలు ఉట్టిపడటం, అలాగే పాటకి తగ్గ ట్యూన్ ,విజువల్స్,ప్రొడక్షన్ వాల్యూస్ ..ఇలా ప్రతీదీ సరిగ్గా కుదరడంతో పాట రేంజ్ వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది. మరీ ముఖ్యంగా నాని,జాను భూపతి లతో పాటు వయసు మీద పడినప్పటికీ మణి భామ, ఆది నారాయణ లు కూడా పాట మొత్తం ఎక్కడా ఎనర్జీ లూజ్ అవకుండా పాటని హుషారుగా తీసికెళ్ళడం నిజంగా మెచ్చుకోతగ్గ విషయం.

ఆరు రోజుల్లోనే ఏకంగా వన్ మిలియన్ వ్యూస్

అలా అన్నీ సరిగ్గా కుదిరిన ఈ పాట వచ్చిన ఆరు రోజుల్లోనే ఏకంగా వన్ మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడంతో ఇపుడు ఎక్కడ చూసినా సంసారి అనే పాటనే తెగ చక్కర్లు కొడుతుంది.మంచి క్రేజ్ అండ్ కాస్టింగ్ కుదిరిన చాలా పాటలు కూడా మిలియన్ వ్యూస్ క్రాస్ అవడానికి ఆపసోపాలు పడుతుంటే సైలెంట్ గా వచ్చిన ఈ పాట అప్పుడే 1 మిలియన్ వ్యూస్ ని వెనకేసిందంటే పాట ఆడియన్స్ ని ఎంతలా ఆకట్టుకుందో అర్థం అవుతుంది.

ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో

ఇక ఈ పాట బాగా కనెక్ట్ అవడంతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫోక్ లవర్స్.ఈ ఫోక్ సాంగ్ ఇప్పటి వరకు వచ్చిన వాటిలో ది బెస్ట్ అని కొంతమంది అంటే ఇదేం పాట భయ్యా చూస్తుంటే మతి పోతుంది అని మరికొంతమంది ఆకాశానికి ఎత్తేస్తున్నారు.ఇక ఇంకొంతమంది అయితే నీ యమ్మ తెలంగాణా 90s సరదా బ్రతుకు చిత్రం ఒకే పాటలో ఏం కయ్యి కట్టారు రా నాయన, సూపర్ సాంగ్ ,సోపర్ కాన్సెప్ట్ ,టోటల్ సూపర్ ,అదిరిపోయింది అంటే మరికొంతమంది తెలంగాణ జానపదానికి ఈ పాట పట్టాభిషేకం చేసింది,పాట మంచి జోరుమీదుంది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఏది ఏమైనా కవిత ఫోక్స్ చానెల్ లో వచ్చిన ఈ పాట ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి !

Tags

Related News

సుడిగాలి సుధీర్‌కు అంత క్రేజ్ రావడానికి కారణం ఇదేనా?

వర్షిణి బ్లాక్ మెయిల్.. ఆట మొదలెట్టిన త్రిగుణ్.. బిగ్ బాస్ ఏం జరుగుతోంది?

జగపతిబాబు షోలో పూజా హెగ్డేకి బన్నీ స్పెషల్ సర్ప్రైజ్!

రామ్ ప్రసాద్ ని లాగిపెట్టి కొట్టిన త్రిగుణ్.. రోహిత్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యిందా?

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్.. అక్టోబర్ నెల హైలెట్స్..

Bigg Boss Telugu 10: నామినేషన్లో 8 మంది.. ఎలిమినేట్ ఎవరంటే..?

Intinti Ramayanam Meenaakshi : మీనాక్షి ఒక్కరోజు రెమ్యూనరేషన్ అంతా..?

Big Stories

Advertisement
×