E-Paper
Advertisement

సుడిగాలి సుధీర్‌కు అంత క్రేజ్ రావడానికి కారణం ఇదేనా?

సుడిగాలి సుధీర్‌కు అంత క్రేజ్ రావడానికి కారణం ఇదేనా?
Advertisement

Sudigali Sudheer:సుడిగాలి సుధీర్ ..పరిచయం అక్కర్లేని పేరు.జబర్దస్త్ షో తో ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ కొట్టేసిన ఈ మల్టీ టాలెంటెడ్ ఒకపక్క డాన్స్ షోస్ ,మరో పక్క టీవీ ప్రోగ్రామ్స్ తో ఎంటర్ టైన్ చేస్తూనే మరోపక్క సినిమాలలో హీరోగా తన సత్తా చాటాలని గట్టిగానే ట్రై చేస్తున్నాడు.ఇదిలా ఉంటే సుదీర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇలా తన అభిమానుల గురించి తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు .

సుదీర్ మాట్లాడుతూ.. సినిమాలలో మాస్‌గా కనిపించినా బయట మాత్రం తాను చాలా సైలెంట్‌గా ఉంటానని బాగా తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర మాత్రమే ఫ్రీగా ఉంటానని, కొత్తగా పరిచయమైన వాళ్ళ వద్ద కాస్త రిజర్వ్ గా ఉంటానని తెలిపాడు. అయితే సందర్భాన్ని బట్టి నడుచుకోవడం తనకు అలవాటని అసలు విషయం చెప్పాడు.

Advertisement

ఇక తన అభిమానుల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయాడు ఈ మల్టీ టాలెంటెడ్. ఫ్యాన్స్ ని కేవలం అభిమానులుగా కాకుండా తన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ భావిస్తానని చెప్పాడు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ తనను ఆప్యాయంగా పలకరిస్తారని, వారి ప్రేమ, ఆశీస్సులే తనకు అసలైన బలమని తెలిపాడు. తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రేమిస్తూ అండగా నిలిచే సొంత మనుషుల లాగే అభిమానులు కూడా ఉంటారని ఆనందాన్ని బయట పెట్టాడు.దీంతో ఇది విన్న అభిమానులు నీకు ఇంతటి క్రేజ్ రావడానికి కారణం ఈ మంచి మనసే అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ఇక ఈ సందర్భంగా లడఖ్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని గుర్తు చేసుకున్నాడు సుధీర్. ఒక పాట షూటింగ్ కోసం లడఖ్ వెళ్లినప్పుడు పుణే, నాందేడ్ ప్రాంతాలకు చెందిన కొందరు తనను గుర్తుపట్టి, తాను చేసిన టీవీ షోల గురించి మాట్లాడారని చెప్పాడు. తెలుగు సరిగ్గా రాని ప్రాంతాల్లో కూడా తనను గుర్తించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, అక్కడ పనిచేస్తున్న తెలుగు సైనికులు వచ్చి పలకరించడం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని గర్వంగా చెప్పాడు.

Advertisement

ఇక తన సినీ జర్న గురించి చెప్తూ.. మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ రజినీకాంత్, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపాడు. ముఖ్యంగా చిరంజీవి సినిమాలు చూసే తాను ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్నట్లు చెప్పడం విశేషం.ఇక ఇప్పటివరకు వచ్చిన సక్సెస్ తో హ్యాపీగా ఉన్నప్పటికీ, జీవితంలో సాధించాల్సింది ఇంకా చాలా ఉందన్నాడు .తన తల్లిదండ్రులు సంతోషంగా ఉండటమే తనకు ముఖ్యమని, తన వల్ల చుట్టూ ఉన్నవాళ్లు ఆనందంగా ఉండాలని కోరుకుంటానని చెప్పాడు. కష్టపడే ప్రతీ ఒక్కరికీ విజయం దక్కాలని, అందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకోవడం నిజంగా మెచ్చుకో తగ్గ విషయం.

ALSO READ :ఏం సాంగ్ భయ్యా ఇది.. మైండ్ పోతుంది ! అప్పుడే పది లక్షల వ్యూస్

Tags

Related News

హిందూ దేవుళ్ళపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన అనసూయ.. వీడియో వైరల్!

వర్షిణి బ్లాక్ మెయిల్.. ఆట మొదలెట్టిన త్రిగుణ్.. బిగ్ బాస్ ఏం జరుగుతోంది?

ఏం సాంగ్ భయ్యా ఇది.. మైండ్ పోతుంది ! అప్పుడే పది లక్షల వ్యూస్

జగపతిబాబు షోలో పూజా హెగ్డేకి బన్నీ స్పెషల్ సర్ప్రైజ్!

రామ్ ప్రసాద్ ని లాగిపెట్టి కొట్టిన త్రిగుణ్.. రోహిత్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యిందా?

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్.. అక్టోబర్ నెల హైలెట్స్..

Bigg Boss Telugu 10: నామినేషన్లో 8 మంది.. ఎలిమినేట్ ఎవరంటే..?

Big Stories

Advertisement
×