Satyabhama Today Episode December 17 th : నిన్నటి ఎపిసోడ్ లో.. అప్పుల బాధ తీరింది అనుకుంది అనుకునే లోపు మరో సమస్య వచ్చి పడుతుంది. ఇంటిని కొలవడానికి ఇద్దరు మనుషులు వస్తారు. మా ఇల్లు ని వాదన పెట్టుకుంటారు. ఇది శేషు గారిని ఇంట్లో వాళ్ళు ఖాళీ చేశారని ఇంటిని కూల్చడానికి ఎంత సమయం పడుతుందో అని కనుక్కోమని పంపించారు అయినా బుల్డోజర్ తీసుకొని వస్తారు అప్పుడు మీరు ఆయనతో మాట్లాడుకోండి అనేసి వాళ్ళు చెప్తారు. ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోరు.. ఇక సత్య మాత్రం మొండిగా ప్రవర్తిస్తుంది. నందిని మా బాపుకి కాల్ చేసి ఈ విషయాన్ని చెప్తానని అంటుంది. వీటన్నిటికీ కారణం మీ బాపునే వదిన నువ్వు కాల్ చేయొద్దు అనేసి అంటుంది. ఈ ఇంట్లో వస్తున్నా సమస్యలకు అసలు కారణం మీ బాపునే అని సత్య నిజాన్ని కుండలు బద్దలు కొడుతుంది. నందిని పుట్టింటికి వచ్చి మహాదేవయ్యను నీలదీస్తుంది. ఇక్కడ తండ్రి డ్రామాలు విని నందిని కరిగిపోతుంది. ఇంటికి వెళ్లి బాపు కొత్త ఇల్లు ఇస్తాడు అని చెప్తుంది. సత్య వాదిస్తుంది. ఇంటిని కూలగొట్టాలని ఆ శేషు ఇంటికి వస్తాడు. ఎంత చెప్పినా అతను వినకుండా ఇంటిని కూలగొడతానని చెప్తాడు. విశ్వనాథం అతని కాళ్లు పట్టుకొని ఈ ఇల్లు నా కలల ఆస్తి మీరు దాన్ని కూలగొట్టదు బాబు అనేసి అడుగుతాడు. మహదేవయ్య ఇంటికి వస్తాడు. ఇక శేషు తో మాట్లాడతాడు. ఇక మహదేవయ్య ఆ శేషు తో మాట్లాడటం చూసి ఇంట్లో వాళ్ళందరూ ఆయన మంచోడని నమ్ముతారు.. ఇక సంధ్య కూడా సత్యదే తప్పు అనేసి అంటుంది. ఇక క్రిష్ ఏమో ఇంట్లో సమస్యలను తీరిపోయాయి కదా ఇక మా ఇంటికి వెళ్దామా అనగానే లేదు నేను తర్వాత వస్తాను నువ్వు వెళ్ళు అనేసి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్య కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. విశ్వనాథం అక్కడికి వచ్చి ఎందుకమ్మా నీకి తండ్రి అంటే అంత ఇష్టం అనేసి అంటాడు. దానికి సత్య తండ్రి అంటే ఇష్టం కాదు నాన్న ప్రాణం. మీరు ఇంటిని దూరం చేసుకోలేక ఎంత నరకాన్ని అనుభవించారు నేను అర్థం చేసుకోగలను నాన్న. మీ గుండె ముక్కలు అయిపోయిందని నాకు అర్థమైంది అందుకే నేను మీకు తోడుగా ఉన్నాను ఎవరేమన్నా కూడా నేను మీ వెనకాలే ఉంటాను అనేసి అంటుంది. ఇక విశ్వనాథం నా ఇంటికి కష్టాలు వస్తున్నాయి ఏంటి అది మీ మామయ్య వల్లే అని నేను అర్థం చేసుకోగలను అమ్మ. నిజం చెప్పలేక నువ్వు ఏదో దాస్తున్నావు నాకు అర్థం అయిపోయింది. నువ్వు పులితో సవారీ చేస్తున్నామన్న విషయం అర్థం చేసుకో కొంచెం జాగ్రత్తగా ఉండు అనేసి విశ్వనాథం సత్యకు సలహా ఇస్తాడు..
ఇక సత్య తన అత్తింటికి వచ్చేస్తుంది. వచ్చి రాగానే భైరవి కోపంతో రగిలిపోతూ సత్యను మాటలతో బాధపెడుతుంది. నీకు కొంచెం కూడా బుద్ధి లేదు మామయ్యని డబ్బులు కావాలంటే కొంగు జాసే అడుక్కోవాలి కానీ ఇలా క్రిష్ గానే అడ్డుపెట్టుకొని బెదిరించడం ఏంది అనేసి భైరవి అడుగుతుంది. ఇంత జరిగినా నీకు పొగరు మాత్రం అనగలేదు అని సత్యను అరుస్తుంది. చాలా అలసిపోయిన అత్తయ్య మీ కాళ్లు పట్టుకోమంటావా నాదే తప్పు మీరు రమ్మన్నప్పుడు రాలేదు మీరు వెళ్ళమన్నప్పుడు వెళ్లాను అనేసి అడుగుతుంది. ఇదే తగ్గించుకుంటే మంచిదని భైరవి సత్యం అంటుంది. భైరవిని సత్య కూడా తన మాటలతో అంటుంది. ఇక అప్పుడే మహదేవయ్య అక్కడికోస్తాడు.. పైపైకి నవ్వుతూ కనిపిస్తూ బైరవి అంటుంటే మురిసిపోతుంటాడు..
పైకి నవ్వుతున్నాడు గాని ఆ మనిషిని మీరు ఎంత ఇబ్బంది పెట్టారు అని భైరవి అంటుంది.. మొన్నేమో చిన్నగా అడ్డుపెట్టుకొని పార్టీకి లక్షలు తీసుకున్నారు నిన్నేమో ఆడు ఎవరికో కోటిన్నర ఇచ్చి మీ ఇంటి పత్రాలను తీసిచ్చాడు. ఇంట్లో దోచుపెట్టడానికి నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా అనేసి బైరవి సత్యం అంటుంది. అక్కడికి వచ్చిన మహదేవయ్య కోడలికి ఎలా చెప్పాలో అలా నేను చెప్తాలే నువ్వు వెళ్లి లోపలికి అనేసి అంటాడు. మర్యాదగా చెప్తే వినే రకం కాదు ఇది.. అసలు మనకు మర్యాద ఇచ్చేదే మానేసింది అనేసి బైరవి మహదేవయ్యతో అంటుంది.. ఇక మహదేవయ్య కోడలతో నేను మాట్లాడతాను. ఇక బైరవి లోపలికి వెళ్తుంది. మహదేవయ్యా చూసావా కోడలు గాని కోడలా నీ పౌరుషంతో ఎంతవరకు తీసుకొచ్చావో.. పుట్టింటి వాళ్లకి ఎన్ని కష్టాలు వచ్చాయో చూసావుగా అనేసి అంటాడు. ఇకనైనా బుద్ధిగా ఉండి నీ పని నువ్వు చేసుకో నా దారికి వచ్చావంటే నీ ప్రయత్నం మానుకోకుండా నన్ను అడ్డుపడ్డావంటే మంచిగా ఉండదు అనేసి వార్నింగ్ ఇస్తాడు. నీ పుట్టింటి వాళ్లందరి మొహాల్లో కన్నీళ్లు వచ్చేలా చేశాను ఇంకా నీకు అర్థం కావట్లేదా నేనేంటో మహాదేవయ్య అంటే ఇది అనేసి అంటాడు.. ఒకసారి నా జోలికొస్తే నీకు ఇక ఏం చేస్తాను అది చేస్తాను ఆఖరికి నువ్వు అడ్రస్ లేకుండా పోతావు అనేసి సత్యకు వార్నింగ్ ఇస్తాడు. కానీ సత్య మాత్రం అస్సలు తగ్గకుండా మహదేవయ్యను ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది..
క్రిష్ కి అసలు తండ్రి ఏదో చెప్తారా అనేసి అడుగుతుంది. ఇది తగ్గించుకుంటే మంచిదని చెబుతున్న కోడలా అనేసి మహాదేవయ్య కౌంటర్ ఇస్తాడు. నువ్వు నన్ను ఏం చేయలేవు ఇప్పుడు మహదేవయ్య గానే నీకు తెలుసు రేపు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక రాజకీయ నాయకుడిగా నన్ను చూస్తావు అనేసి విర్రవీగుతాడు.. నువ్వు ఏ రాజకీయాన్ని అయితే చూసుకుంటున్నావో అదే రాజకీయాన్ని నీకు దూరం చేస్తాను అనేసి సత్య ఛాలెంజ్ చేస్తుంది. ఎమ్మెల్యే టికెట్ ఆల్రెడీ నాకు కన్ఫర్మ్ అయిపోయింది కోట్లు పెట్టి టికెట్ కొనుక్కున్నాను. నువ్వెలా పోటీ చేస్తావనేసి అడుగుతాడు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను నీపై గెలుస్తాను అనేసి సత్య మహదేవయ్యకు వార్నింగ్ ఇస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..