BigTV English

Telangana Debts: కేసీఆర్ చేసిన అప్పులు ఇవే.. ఆర్బీఐ రిపోర్ట్‌లో ఏముంది..?

Telangana Debts: కేసీఆర్ చేసిన అప్పులు ఇవే.. ఆర్బీఐ రిపోర్ట్‌లో ఏముంది..?

Telangana Debts: అసలు తెలంగాణ రాష్ట్ర అప్పులు ఎంత? బీఆర్ఎస్ గత పదేళ్లలో చేసిందేంటి? ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో చేసిన అప్పులెంత? ఇప్పుడు దీని చుట్టూ డిబేట్ పెరుగుతోంది. మరి కాంగ్రెస్ అన్నట్లుగా 7 లక్షల కోట్లు అప్పు నిజమా? కాదు కాదు ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం 3 లక్షల 89 వేల కోట్లు మాత్రమే ఉందా? అంటే ఇందులో సామాన్యులకు కూడా అర్థమయ్యే విషయాలను డీకోడ్ చేద్దాం. ఆర్బీఐ రిపోర్ట్ ను అడ్డం పెట్టుకుని గులాబీ బ్యాచ్ ఎలా డీల్ చేస్తుందో చూస్తే అందరి మతి పోవడం ఖాయం.


చేసిన అప్పుల చుట్టూ పొలిటికల్ యుద్ధం

నువ్ చేసిన అప్పెంత? మేం చేసిందెంత.. తేల్చుకుందామా.. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఈ అప్పుల రాజకీయం చుట్టూ పెద్ద డిబేటే నడుస్తోంది. ఓవైపు కేసీఆర్ సర్కార్ 7 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టి దిగిపోయిందని రేవంత్ ప్రభుత్వం రోజూ విరుచుకుపడుతోంది. అయితే అంతా తూచ్.. మేము అంత అప్పు ఎక్కడ చేశాం.. సంపద సృష్టించాం.. దగ్గరుండి అందరి జీవన ప్రమాణాలు పెంచాం.. కావాలంటే ఆర్బీఐ రిపోర్ట్ చూసుకోండి అంటూ గులాబీ బ్యాచ్ ఒకటే ఊదరగొడుతోంది. ఓవైపు అప్పుల లెక్కలు క్లియర్ గా ఉన్నా.. ఆర్బీఐ రిపోర్ట్ అంటూ హడావుడి చేస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు. మరి నిజం ఏంటి? అబద్ధం ఏంటి? తేల్చేద్దాం.


రూ.3.89 లక్షల కోట్లు అప్పు ఉందన్న ఆర్బీఐ

హ్యాండ్‌ బుక్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ఆన్‌ ఇండియన్‌ స్టేట్స్‌ 2023-24లో ఆర్బీఐ.. ఏ రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో చెప్పింది. తెలంగాణ ఏర్పడే నాటికి సమైక్య రాష్ట్రంలో ఉన్న అప్పుల వాటా కింద 72 వేల కోట్ల రుణభారం వచ్చింది. 2023 నాటికి మొత్తం అప్పు 3.89 లక్షల కోట్లకు పెరిగిందని ఆర్బీఐ వెల్లడించింది. సో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ రిలీజ్ చేసిన ఈ లెక్కలను పట్టుకుని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ ఒకటే పరేషాన్ అవుతున్నారు. మాటి మాటికీ 7 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లారని బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని, అందుకే ఆర్ధిక మంత్రిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నామన్నారు.

పరోక్షంగా తీసుకున్న అప్పుల సంగతేంటన్న ప్రశ్న

వెరీ గుడ్.. రిజర్వ్ బ్యాంక్ చెప్పిందేంటి.. మీరు ఎంచుకున్న తాళమేంటి అన్న ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి. ఆర్బీఐ కేవలం స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ గా తీసుకున్న అప్పుల లెక్కలనే వెల్లడిస్తుంది. అంటే ప్రత్యక్షంగా తీసుకున్న లోన్ల గురించే. మరి పరోక్షంగా తీసుకున్న వాటి సంగతేంటి? రాష్ట్ర ప్రభుత్వమే స్పెషల్ పర్పస్ వెహికిల్స్ సృష్టించి, కార్పొరేషన్లను సృష్టించి.. వాటికి బ్యాంకు గ్యారెంటీలను దగ్గరుండి ఇచ్చి.. వాళ్లు కట్టకపోతే ప్రభుత్వమే కడుతుందని సంతకాలు పెట్టి తీసుకున్న బాకీలు ఎవరి ఖాతాలోకి వెళ్తాయి. టెక్నికల్ గా డైరెక్ట్ గా ఈ అప్పులు తాము తీసుకోలేదని తప్పించుకుంటే కుదిరే పనేనా అసలు? ఏ రూపంలో అయితే ఏంటి..  ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చి అప్పులు తీసుకున్నది అని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ నేతలు ఎందుకంత భయపడుతున్నారో ఇప్పుడు అర్థం కాని పరిస్థితి.

ఎలక్షన్లకు ముందు ఖజానా పిప్పి పిప్పి..

బీఆర్ఎస్ హయాంలో ఆర్థికంగా జరిగిన దారుణాలు చూస్తే ఎకానమిస్టులు కూడా నోరెళ్లబెట్టే పరిస్థితి. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందైతే కేసీఆర్ ప్రభుత్వం ఖజానాతో ఓ ఆట ఆడేసింది. మళ్లీ అధికారంలోకి రాము అని తాము చేసుకున్న సర్వేల ద్వారా సమాచారం అందిందో మరేంటో గానీ.. ప్రభుత్వ ఖజానాను మొత్తం పీల్చి పిప్పి చేసేశారు. చెప్పాలంటే కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి కాలు చేతు ఆడకుండా చేశారు. అది ఎలాగో ఓసారి బ్రీఫ్ గా చూడండి.. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ను ఏకంగా 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేశారు.

ఇషారాజ్యంగా ప్రభుత్వ భూముల అమ్మకాలు

ఆ డబ్బుల్ని ముందే గుంజేశారు. ఓట్లు పడబోవని చెప్పి రుణమాఫీకోసం వాటిని హడావుడిగా వాడేశారు. అటు వైన్స్ టెండర్ల టైం కంటే ముందే వేసేసి.. ఆ డబ్బులూ లాగేశారు. కొత్త అప్పులు పుట్టనివ్వలేదు. సిటీలో ఉన్న కాస్ట్ లీ ప్రభుత్వ భూముల్ని అమ్మేసి సొమ్ము చేశారు. యూపీతో పోటీ పడి అప్పులు చేశారు. సివిల్ సప్లైస్, విద్యుత్ సంస్థలను నిండా ముంచేశారు. ఎలక్షన్లకు ముందు 12 నెలల కాలంలో తీసుకోవాల్సిన అప్పులను 8 నెలల్లోనే తీసుకుని బీఆర్ఎస్ ఎంత పెద్ద తప్పు చేసిందన్న విషయాలను ప్రజల ముందు పెడుతోంది హస్తం పార్టీ.

అన్ని రకాల అప్పులు రూ. 7 లక్షల కోట్లకు పైనే: భట్టి

నిజానికి 7 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లారని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ను అంటోంది కానీ.. అన్నీ తవ్వితే అంతకంటే ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే సర్కార్ అప్పులు, కార్పొరేషన్ అప్పులు, కాంట్రాక్టర్లు, ఉద్యోగులకు వివిధ సంస్థలకు పెట్టిన పెండింగ్ బిల్స్ ఇవన్నీ కలిపితే 7 లక్షల కోట్లు దాటిపోతున్నాయి. మరి వీటికి సమాధానం ఇచ్చేదెవరు? ఒక్క ఆర్బీఐ రిపోర్ట్ ను పట్టుకుని ఇంత హంగామా చేస్తున్న గులాబీ లీడర్లు.. కార్పొరేషన్ అప్పులతో సంబంధం లేదు, పెండింగ్ బిల్స్ తో సంబంధం లేదు అని చెబితే నమ్మడానికి తెలంగాణ ప్రజలు రెడీగా లేరు. మరి కేసీఆర్ హయాంలో చేసిన ఈ వ్యవహారాలకు అసలు, కిస్తీలు కట్టేదెవరు?

పెండింగ్ బిల్స్ అప్పు కిందికి రాదంటే నమ్ముతారా?

బీఆర్ఎస్ తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందన్నది నిజం. ఓవైపు ఇంత బర్డెన్ ఉన్నా.. గత ప్రభుత్వం అన్ని ఆదాయ వనరులను ముందే లాగేసి పెట్టినా.. గ్యారెంటీల అమలు, రుణమాఫీ విషయంలో పెద్దగా అప్పుల జోలికి వెళ్లకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం సక్సస్ అయింది. ఇవన్నీ అధికారిక లెక్కలు చెబుతున్న విషయమే. ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, హాస్పిటల్స్, మిడ్ డే మీల్స్, ఉద్యోగుల జీతాలు.. ఇలాంటి వాటన్నిటిలో గులాబీ బాపు అప్పుగా పెట్టిన డబ్బును ఎవరు కట్టాలి? 2014 నాటికి ఇవేమీ లేవు. కేసీఆర్ దిగిపోయేనాటికి బండను నెత్తిపై పెట్టివెళ్లారు. అదీ మ్యాటర్.

అప్పుల కుప్ప నెత్తిన పెట్టి దిగిపోయిన కేసీఆర్

మేమేం అప్పులు చేయలేదు.. మాకేం తెల్వదు అంటే ఇప్పుడు కుదురుతుందా? ఆర్బీఐ చిన్న ఎమౌంట్ చెప్పిందని తప్పించుకుంటే.. ఎస్పీవీలు, కార్పొరేషన్లు పెట్టించి.. సంతకాలు పెట్టించి.. ప్రభుత్వ గ్యారెంటీలు, షూరిటీలు ఇప్పించి తెప్పించిన బాకీలకు మిత్తీలు కట్టేదెవరు? దాంతో మాకు సంబంధం లేదు అంటే వినడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారా? ఇది నమ్మే మాటేనా?

గ్యారెంటీలు, షూరిటీలు ఇచ్చి తెచ్చిన అప్పు సంగతేంది?

సరే.. కాసేపు రిజర్వ్ బ్యాంక్ చెప్పిన అప్పే ఫైనల్ అనుకుందాం. 3 లక్షల 89 వేల కోట్లే ఉంది అనుకుందాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కడుతున్న మిత్తీల లెక్క చూసినా అసలు అప్పు ఎంత ఉందో ఈజీగా తెలుస్తుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం కడుతున్న వడ్డీలు కేవలం 3 లక్షల 89 వేల కోట్లకే కాదు.. గ్యారెంటీలు, షూరిటీలు ఇచ్చి తెప్పించిన వాటికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కట్టాల్సిందే కదా. మరి వీటికి జవాబిచ్చేదెవరు? మరి ఇంత చేసి తెచ్చిన అప్పులతో గత పదేళ్లు ఏదైనా చేశారా అంటే అదీ లేదు. కాళేశ్వరం కూలింది. కార్పొరేషన్లు అప్పుల ఊబిలో ఉన్నాయి.

కేసీఆర్ హయాంలో ఆర్థిక క్రమశిక్షణ ఏది?

ప్రభుత్వ ఖజానా అంటే ప్లే గ్రౌండ్ కాదు. ఎవరికి ఇష్టం వచ్చిన ఆట ఆడుదామంటే. మన జేబులో నుంచి కట్టేది ఉండదు.. ఎంతైనా అప్పులు తెద్దాం.. వడ్డీ ఎంతైనా పర్వాలేదనుకుంటే కుదురుతుందా. ఇది ప్రజలు నమ్మకంతో అప్పగించిన బాధ్యత. ప్రతి రూపాయికి ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆర్థిక క్రమశిక్షణ అన్న మాటే మర్చిపోయింది గత కేసీఆర్ సర్కారు. యెడా పెడా అప్పులు తేవడం, మిత్తీ ఎంత ఉందో కూడా చూసుకోకపోవడం ఇదే జరిగింది. సాధారణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా FRMB పరిధికి లోబడి బాకీలు తెచ్చుకోవాలి. ఫిస్కర్ రెస్పాన్సిబులిటీ అండ్ బడ్జెట్ మేనేజ్ మెంట్ అన్నది ఒకటి ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించేలా గీత గీసి పెడుతుంది. కానీ ఏం లాభం? గత గులాబీ సర్కార్ ఈ గీతను ఎప్పుడో దాటేసింది. కాకపోతే పరోక్షంగా.

ఆర్థిక క్రమశిక్షణ కోసం FRBM లిమిట్

రాష్ట్రాలు ఇష్టారాజ్యంగా దొరికిన కాడ అప్పులు చేసేసి.. చేతులు ఎత్తేయకుండా FRBM లిమిట్ పెట్టింది కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని బట్టే అప్పులు తెచ్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ప్రజల డబ్బుకు జవాబుదారీ తనం తీసుకొచ్చేలా దీన్ని తెచ్చింది. అయితే కేసీఆర్ సర్కార్ ఈ FRMB లిమిట్ ను నమ్ముకుంటే కుదరని పని అని చెప్పి కార్పొరేషన్ల ద్వారా రుణాలు సేకరించింది. అటు కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల కోసం స్పెషల్ పర్పస్ వెహికిల్స్ అంటే SPVలను క్రియేట్ చేయించింది. వాటికి రాష్ట్ర ప్రభుత్వమే గ్యారెంటీలు ఇచ్చి బ్యాంకుల దగ్గర లోన్లు తెచ్చుకునేలా చేసింది. ఇవి ఒకటి కాదు రెండు కాదు ఆర్థిక మంత్రి చెబుతున్న దాని ప్రకారం 95 వేల కోట్లపైమాటే. అవి కార్పొరేషన్లే కట్టవు. ఫైనల్ గా ప్రభుత్వమే కట్టాలి. మరి వీటికి జవాబిచ్చేదెవరు?

ఈ SPVల ద్వారా రూ.95 వేల కోట్ల అప్పులు

మేం చేసిన అప్పుడు 3 లక్షల 89 వేల కోట్లే అని అరిగిపోయిన టేప్ మాదిరి ఎన్నిసార్లు వినిపించినా మిగితా లెక్కలకూ జవాబులు చెప్పక తప్పదంటున్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టుల కోసం ఆయా కార్పొరేషన్ల పేరు మీద ప్రభుత్వం గ్యారంటీగా ఉండి తీసుకున్న వివరాలు వెల్లడించలేదని కాగ్ పలుమార్లు తన వార్షిక రిపోర్ట్ లో చెబుతూనే వస్తోంది. అంటే దీనర్థం ఏంటి? ప్రభుత్వం ఈ అప్పులపై గప్ చుప్ గా ఉన్నా.. అడిగే సంస్థలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గతంలో 90 వేల కోట్లు అప్పు తీసుకొచ్చారు. గతేడాది నాటికి ఈ అప్పు అవుట్ స్టాండింగ్ అమౌంట్.. 74,590 కోట్లుగా ఉంది. ఆంధ్రాబ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బరోడా బ్యాంకు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా తీసుకుంది గత కేసీఆర్ సర్కార్.

2035 ఆగస్టుకల్లా వడ్డీ సహా అసలు కట్టాల్సిన పరిస్థితి

వీటిని 2035 ఆగస్టుకల్లా వడ్డీతో సహా అసలు చెల్లించాల్సి ఉంది. లిఫ్టుల వినియోగానికి అయిన విద్యుత్ బిల్లుల చెల్లింపు కూడా దాదాపు 9,200 కోట్లు డిస్కంలకు బకాయి పడింది రాష్ట్ర ప్రభుత్వం. కాళేశ్వరం అప్పులను 9.69 శాతం వడ్డీ రేటుతో తెచ్చారు. ఇదొక్కటే కాదు ఇతర కార్పొరేషన్లు, SPV ల ద్వారా తీసుకున్న లోన్లన్నీ అధిక మిత్తీలకు తెచ్చినవే. ఇలా ఎందుకు చేశారన్న ప్రశ్నలకు జవాబు లేదు. కనీసం తక్కువ వడ్డీ ఎక్కడ వస్తుందో కూడా కనుక్కోలేదు. ఎక్కువ లోన్ ఇస్తే చాలు.. వడ్డీ ఎంత ఉందో కూడా చూసుకోలేదు. పోయేది మన జేబులో సొమ్ము కాదనుకున్నారా? అన్న ప్రశ్నలకు జవాబు ఉందా? పైగా కాళేశ్వరానికి పెట్టిన డబ్బులు రైతులు పంటలు పండించడం ద్వారా తిరిగి ఎప్పుడో వచ్చేశాయ్ అని దిక్కుమాలిన లాజిక్ ఒకటి వినిపించి వదిలేశారు. ఇంత అన్యాయమా అన్నది కాంగ్రెస్ నేతల ప్రశ్న.

20,200 కోట్లు ఇంకా అవుట్ స్టాండింగ్ లోన్

ఈ బాకీలన్నీ తీర్చేదెవరు.. ఇవి మీ ఖాతాలో రావా అని అడుగుతోంది కాంగ్రెస్. పోనీ కాళేశ్వరానికి ఇంత ఖర్చు చేసి కడితే దక్కిందేంటి. మేడిగడ్డ కుంగింది. అన్నారం సుందిళ్లలో బుంగలు పడ్డాయి. NDSA ఆదేశాలతో అన్నీ గేట్లూ ఖుల్లా పెట్టారు. అయినా సరే రైతులు రికార్డు స్థాయిలో ధాన్యం పడించారు. మరి తెచ్చిన అప్పులు, వాటి వడ్డీల భారాన్ని జనంపై ఎందుకు రుద్దినట్లు? మిషన్ భగీరథకు ఖర్చు చేసిన దాంట్లో దాదాపు 90% రుణం రూపంలో తీసుకున్నదే.

గతేడాది డిసెంబర్ నాటికి 20 వేల 200 కోట్లు అవుట్ స్టాండింగ్ లోన్ అలాగే ఉంది. తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అవుట్ స్టాండింగ్ లోన్ 14 వేల 60 కోట్లు అలాగే ఉంది. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లోన్ 6470 కోట్లు ఉంది. తెలంగాణ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లోన్ 2951 కోట్లుగా ఉంది. ఇవన్నీ అధిక వడ్డీలకు తెచ్చిన లోన్లే. ఇక బిల్లులు చెల్లించాల్సిన వాటిలో తమ వారు అనుకున్న కాంట్రాక్టర్లకే క్లియర్ చేశారు చాలా మందికి అలాగే పెండింగ్ పెట్టి వెళ్లారు. ఇప్పుడు వారికి బిల్లులు క్లియర్ చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.

రూ.3.89 లక్షల కోట్లతోనే ఇదంతా సాధ్యమైందా?

తెచ్చిన అప్పులతో రోడ్లు వేశామని, రిజర్వాయర్లు పూర్తి చేశామని, FRBM పరిధికి లోబడే తెచ్చామని, విద్యుత్ సరఫరా మెరుగు పరిచామని, సంపద సృష్టించామని, రైతుల ఆదాయం పెంచామని, సౌకర్యాలు కల్పించామని, సంక్షేమం అందించామని చెప్పుకుంటున్న గులాబీ లీడర్లు.. ఇదంతా కేవలం 3 లక్షల 89 వేల కోట్ల అప్పుతోనే చేశామని గుండెలపై చేయి వేసుకుని చెప్పగలరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కానే కాదు ఎందుకంటే కాళేశ్వరం కోసం తెచ్చిన అప్పు ఇందులో లేదు.

మిషన్ భగీరథ అప్పు ఇందులో లేదు. ఇంకెన్నో ఇందులో లేవు. కానీ రిజల్ట్ మాత్రం కావాలి. ఇదేనా రాజకీయం అని అడుగుతున్నారు హస్తం పార్టీ నేతలు. ఏదేదో మార్చేశాం అని గులాబీ నేతలు చేసుకుంటున్న ప్రచారం చూస్తే ఏదీ మారలేదని అర్థమవుతోంది. ఫైనల్ గా కేసీఆర్ మోపిన అప్పుల కుప్ప కొత్త ప్రభుత్వంపై కాదు.. సగటు జనంపైనే. ఇదే నిజం.

 

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×