Satyabhama Today Episode March 4th : నిన్నటి ఎపిసోడ్లో.. సత్య మహదేవయ్య ఇంటికెళ్లి క్రిష్ ను మళ్లీ దారిలోకి తీసుకురావాలని వేడుకుంటుంది. ఆ ఇంట్లో ఒక జయమ్మ తప్ప ఎవరు కూడా క్రిష్ ను అర్థం చేసుకోరు. మీరు గుండెల్లో ఉంచి వదిలేసిన కూడా తను మాత్రం మీరే తనకు దైవమని భావిస్తున్నారు మావయ్య మీరు ఒకసారి ఆయనతో మాట్లాడండి అని సత్య వేడుకుంటుంది కానీ మహదేవయ్య మాత్రం మీ మామ నా కొడుకు నా ఇష్టం అని తీసుకెళ్లాడు కదా ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు ఇకనుంచి వెళ్ళు అనే సత్యను బయటికి పంపించేస్తారు. మీకు చిన్నప్పటినుంచి ఎవరు ఎలాంటి హాని తల పెట్టాలని చూసినా కూడా అడ్డుగా నిలబడి మీ ప్రాణాలకు తన ప్రాణాన్ని అడ్డు పెట్టాడు.. మీరు ఒకసారి మాట్లాడండి మామయ్య అని సత్య బ్రతిమళాడుతుంది.. అటు నందిని కాపురాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్న మైత్రి.. క్రిష్ ను ఓదార్చిన సత్య.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. క్రిష్ సత్య ఎంతగా డైవర్ట్ చేయాలని చూసినా కూడా తన మనసంతా బాపు దగ్గరే ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటాడు. సత్య కృష్ణ తన దారిలోకి తెచ్చుకోవాలని ఎంత ప్రయత్నించినా కూడా క్రిష్ మాత్రం తన బాపు గురించి ఆలోచిస్తూ ఉంటాడు అయితే సత్యం వదిలేసి తన బాబుని ఒక్కసారైనా చూడాలని ఆ ఇంటికి వెళ్తాడు. మహదేవయ్య, భైరవిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు క్రిష్ అయితే క్రిష్ రావడం చూసిన సంజయ్ దొంగ దొంగ అని అరుస్తాడు. అతని మహదేవ మనుషులు పట్టుకుంటారు నువ్వు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు రా అంటే నేను బాబును చూడాలని వచ్చాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు అంటే బాపును చూడాలని వచ్చావో ఇంకా ఏదైనా తీసుకెళ్లాలని వచ్చావు అని భైరవి అంటుంది.
మళ్లీ ఇక్కడికి ఎందుకు వచ్చావురా నీ బాబు ఆయన అని చెప్పినా కూడా నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం తీసుకెళ్దాం అని వచ్చావు ఎందుకు వచ్చావు అని భైరవి అడుగుతుంది. ఎందుకమ్మా నేను అంత పరైవన్నయ్యనా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని క్రిష్ బైరవిని అడుగుతాడు. నీ జ్ఞాపకాలు ఇంకా ఇంట్లో ఉన్నాయని నువ్వు ఫీల్ అయిపోతున్నావా అయితే ఇది నీళ్లు అవుతుందా అది నీళ్లు అతను నీ బాపు అని అంటుంది. ఇక ఇంట్లోంచి క్రిష్ ఫోటోలు తీసుకొచ్చి కాల్చేయమని చెప్తుంది.. ఆ ఫోటోలను చూసి కృషి కన్నీళ్లు పెట్టుకుంటాడు.
సంజయ్ మాత్రం సంతోషంగా ఫీల్ అవుతాడు ఇకనైనా అర్థమైందా బ్రో నువ్వు నా ఒంటి మీద దెబ్బ వేసినప్పుడు నేను ఎంత ఫీల్ అవ్వాలి ఇది నా ఇల్లు ఇది నా ప్రాపర్టీ టు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అతను నీ బాబు అయినా నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా లేదా నువ్వు ఆయన్ని పట్టించుకోవట్లేదా అనే సంజయ్ క్రిష్ ను అంటాడు. నువ్వెందుకు చివరి ఇక్కడికి వీళ్ళు అవమానిస్తే అది చూసి ఏడవడానికి అసలు నిన్ను ఎవరు రమ్మన్నారు రా ఇక్కడికి జయమ్మ బాధపడుతుంది. ఆస్తి కోసం వచ్చాడేమో ఇంకేదైనా కావాలని ఆలోచిస్తున్నాడేమో అని భైరవి అంటుంది ఇక సంజయ్ కూడా నోటికి వచ్చినట్లు అనేస్తాడు.
ఇంకా చూస్తారు ఏంట్రా మెడ పట్టుకుని బయటికి గెంటైందని బైరవి అనగానే సంజయ్ తనని బయటికి తోసేస్తాడు. సత్య వచ్చి క్రిష్ ను పట్టుకుంటుంది. నా భర్తనే కాలు పట్టుకొని బయటికి గెంటేస్తావా నీకు ఎంత ధైర్యం నా భర్త జోలికి వస్తే నేను ఊరుకోను అని సత్య సంజయ్ చంప పగలగొడుతుంది. చూసావా క్రిష్ నేను అందుకే ఇక్కడికి రావద్దు అన్నాను వీళ్ళు మనుషులు కాదు రాక్షసులు అవసరం కోసమే నిన్ను పెంచానని చెప్పారు ఇప్పుడు అవసరం తీరిపోయింది కాబట్టి నేను గెంటేసారు అది నువ్వు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది అని సత్యా క్రిష్ తో అంటుంది.
క్రిష్ ఇద్దరు ఇంటికి వెళ్లి పోతారు. చూసావా క్రిష్ అక్కడికెళ్ళి అవమానాలు పడడం ఎందుకు అని నేను అక్కడికి వెళ్ళద్దని చెప్పాను కానీ నా మాటంటే కనీసం ఎంత కూడా లెక్కలేకుండా నువ్వు అక్కడికి వెళ్లావు. ఇప్పుడు ఏం జరిగిందో చూసావుగా అనేసి సత్యం బాధపడుతుంది. ఉదయం లేవగానే జయమ్మ బ్యాగు తీసుకుని బయటకు వస్తుంది. ఏమైందమ్మా నిన్ను ఎవరైనా అన్నారా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావ్ అంటే నేను వెళ్ళిపోతున్నాను నా మనవడు దగ్గరికి నేను వెళ్ళిపోతాను మళ్ళీ ఇక్కడికి రాను అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో క్రిష్ మారిపోతాడు. మెకానిక్ షాప్ పెట్టాలని అనుకుంటాడు. ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూడాలి..