Brahmamudi serial today Episode: లోపలికి వచ్చిన రుద్రాణి మీరంతా ఇంత సంతోషంగా ఉన్నారు. మరో సమస్య రాదని గ్యారంటీ ఉందా..? అని అడుగుతుంది. ఇంట్లో ఇంత ఆనందం చూస్తుంటే నాకు భయమేస్తుంది. ఆ రోజు రాత్రంతా బాగా పార్టీ చేసుకున్నాం. తెల్లారితే కారులో శవం దొరికింది అంటుంది రుద్రాణి.. దీంతో ప్రకాష్ కోపంగా ఆ నోటి నుంచి ఒక్కసారైనా మంచి మాట రాదా..? అంటాడు. అపర్ణ కూడా కోపంగా ఇంక చాలు నువ్వు నోరు తెరవొద్దు అంటుంది. దీంతో రుద్రాణి బాగుంది వదిన ఆస్థులు పోవడానికి నేను కారణం అయ్యానా..? మా నాన్న కారణం అయ్యాడు. అప్పుల పాలు అవ్వడానికి నేను కారణం అయ్యానా..? ఈ రాజ్, కావ్యలు కారణం అయ్యారు. ఇప్పుడు రాజ్ అరెస్ట్ అవ్వడానికి నేను కారణం అయ్యానా..? ఆ అనామిక చేయించింది. జరిగినదానికి జాగ్రత్త పడమంటుంటే నేను చెడ్డ దాన్ని అయ్యానా..? చూస్తూ ఉండండి.. ఈ సంతోషం ఎక్కువ కాలం నిలబడదు అంటుంది. దీంతో అపర్ణ కోపంగా ఎలాంటి సమస్యలు ఎదురైనా.. నా కొడుకు కోడలు చూస్తూ ఊరుకోరు.. వాటిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉంటారు. అని చెప్పగానే.. ఏమో వదిన ఈ సారి ఎవరి చేతుల్లో లేనిదే జరుగుతుందేమో అంటుంది రుద్రాణి.
ఫారిన్ నుంచి వచ్చిన యామిని వాళ్ల అమ్మా నాన్నల దగ్గరకు వెళ్లి తనకు రాజ్ తో పెళ్లి ఫిక్స్ చేయమని అడుగుతుంది. అయితే వెళ్లి వాళ్ల అమ్మా నాన్నలతో మాట్లాడతామని చెప్తారు. దీంతో యామిని వాళ్ల అమ్మా నాన్నలతో కాదు మాట్లాడాల్సింది. రాజ్ భార్యతో మాట్లాడాలని చెప్తుంది. యామిని పేరెంట్స్ షాక్ అవుతారు. పెళ్లయినవాడిని ఎలా చేసుకుంటావని నిలదీస్తారు. రాజ్‌ను తన భార్యతో విడదీస్తే సరిపోతుంది అని చెప్పి వెళ్లిపోతుంది. దీంతో వైదేహి బాధపడుతుంది. ఏంటండి ఇది అమ్మాయి పూర్తిగా మారిపోయింది. అని సంతోషించే లోపే ఇలా చేసిందేంటి అని భయపడుతుంది.
రూంలో బట్టలు మార్చుకుంటున్న రాజ్, యామిని గురించి ఆలోచిస్తుంటాడు. నేను చూసింది యామినియేనా అసలు యామిని అక్కడకు ఎందుకు వస్తుంది. అసలు ఏం జరుగుతుంది అని మనసులో ఆలోచిస్తుంటే.. ఇంతలో కావ్య వస్తుంది. ఏంటి కొత్త మర్డర్‌కు ఏమైనా ఆలోచిస్తున్నారా..? బట్టలు మార్చుకోవడానికి ఇంతలా ఆలోచిస్తుంటే.. జైలును మిస్ అవుతున్నారేమో అనిపిస్తుంది. దీంతో రాజ్ వెటకారంగా ఏం మిస్ అయితే నువ్వు నన్న మళ్లీ పోలీస్ స్టేషన్‌కు పంపిస్తావా..? అంటాడు. వెళ్లాలని ఆశగా ఉంటే చెప్పండి అనామికతో మాట్లాడతాను అంటుంది కావ్య. దీంతో రాజ్ అబ్బో వద్దు తల్లి ఇన్ని రోజులు ఈ నాలుగు గోడల మధ్య ఉంటూ నీతో ఉంటూ.. ఇదే పెద్ద జైలులా ఫీలయ్యేవాణ్ని ఇప్పుడు అక్కడికి వెళ్లాక ఆ వాతావరణం చూశాక వాళ్లకంటే నీవే బెటర్ అనిపిస్తుంది.
నాకు మళ్లీ ఆ పోలీస్ స్టేషన్ గుర్తు చేయకమ్మా.. అంటాడు రాజ్. దీంతో కావ్య నాలుగు రోజులు పోలీస్ స్టేషన్‌లో ఉండి వస్తే.. ఈ భార్య విలువ తెలిసొచ్చిందన్నమాట అంటుంది. బుద్దుడికి బోధి చెట్టు కింద జ్ఞానం వచ్చినట్టు భర్తలకు పోలీస్ స్టేషన్‌లో జ్ఞానం వచ్చిందేమో అంటూ వెళ్లిపోతుంటే.. రాజ్ రొమాంటిక్‌గా చూస్తూ.. కావ్యను చేయి పట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు. దీంతో కావ్య ఏవండి ఇది రాత్రి కాదు పగలు.. ఎవరైనా వస్తారేమో అంటుంది. ఈ గదిలోకి ఎవ్వరూ రారు.. మన మధ్యకు అసలు రారు అంటాడు రాజ్. దీంతో కావ్య ఒకవేళ వస్తే.. అని అడుగుతుంది. రాజ్ అలా వస్తే నువ్వు ఊరుకోవు కదా..? అలా వస్తే.. యముడినైనా ఎదిరించి నీ భర్తను తెచ్చుకునే లేడీవి కదా నువ్వు అంటాడు రాజ్.
యామిని వాళ్ల అమ్మా నాన్నలు డాక్టర్ ను కలుస్తారు. మా బేబీ పూర్తిగా మారిపోయింది అని చెప్పారు. కానీ ఇంతకు ముందు లాగే మాట్లాడుతుంది అని అడుగుతారు. దీంతో డాక్టర్ మీ అమ్మాయి గురించి మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. అంటూ యామిని గురించి పూర్తిగా చెప్తాడు డాక్టర్. తను అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగిస్తుందని చెప్తుంటాడు. మరోవైపు లోపల యామిని కావ్య ఫోటో తీసుకుని కాల్చేస్తుంది. తర్వాత రాజ్‌కు వాయిస్ మెసేజ్ చేస్తుంది. మెసేజ్ ఓపెన్ చేసి విన్న రాజ్ షాక్ అవుతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?