BigTV English

Sukumar : టాలీవుడ్ ఇండస్ట్రీకి సుక్కు గుడ్ బై..? బాలీవుడ్ స్టార్ తో యాక్షన్ మూవీ..?

Sukumar : టాలీవుడ్ ఇండస్ట్రీకి సుక్కు గుడ్ బై..? బాలీవుడ్ స్టార్ తో యాక్షన్ మూవీ..?

Sukumar : టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సినిమాల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. గతంలో పుష్ప మూవీ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఆ మూవీ సీక్వెల్ గా గత ఏడాది పుష్ప 2 తెరకేక్కించి మరో రికార్డును బ్రేక్ చేశాడు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే సుకుమార్ రికార్డ్ ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో రంగస్థలం మూవీ వచ్చింది. అలాంటి కథతో మరో మూవీ రాబోతుంది. అయితే ఇప్పడేమో బాలీవుడ్ లో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. సుకుమార్ ‌, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రంగస్థలం, పుష్ప, పుష్ప 2 చిత్రాలతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా క్రేజ్ సొంతం చేసుకున్న సుకుమార్‌తో కలిసి పనిచేసేందుకు షారుఖ్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..


సుకుమార్, షారుఖ్ కాంబోలో మూవీ..

సుకుమార్, షారుఖ్ కాంబోలో మూవీ పై గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని వార్తలొచ్చాయి. ఇకపోతే ఈ మధ్య షారుక్‌తో సుకుమార్ భేటీ కావడంతో ఈ ప్రాజెక్టుపై ఊహాగానాలు మరింత పెరిగాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ నిర్మిస్తోందని టాక్. దాదాపుగా రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ బడ్జెట్ లో సుకుమార్ రెమ్యూనరేషన్ కాస్త ఎక్కువగానే ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి.


Also Read:ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ మూడు మస్ట్ వాచ్..

సక్సెస్ అయితే టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేస్తాడా..? 

పుష్ప లాంటి క్రేజీ మూవీని ప్రేక్షకులకు అందించాడు సుక్కు.. గతంలో ఆయన ఖాతాలో బోలెడు హిట్ సినిమాలు ఉన్నాయి. కానీ అల్లు అర్జున్ తో చేసిన పుష్ప సినిమా తర్వాత అతని రేంజ్ ఎక్కడి కో వెళ్లిపోయింది. ప్రస్తుతం రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమా స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత పుష్ప 3 చెయ్యనున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత శారుఖ్ తో మూవీ చేసే అవకాశాలు ఉన్నాయి.. అయితే బాలీవుడ్ లో సక్సెస్ అయితే తెలుగు లో సినిమాలు తియ్యడా? ఇలాంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. షారుఖ్ తో సినిమా ఫైనల్ కావాలంటే మరో రెండేళ్లయినా పట్టొచ్చు. అప్పటికీ వీరు కొత్త ప్రాజెక్టులు ఫైనల్ చేయకపోతే కలిసి పనిచేసే అవకాశముంటుంది.. ఏది ఏమైన వీరిద్దరి కాంబోలో సినిమా ప్రకటన ఇస్తే గానీ క్లారిటీ రాదు. చూడాలి ఈ వార్తల పై సుక్కు ఎలా రియాక్ట్ అవుతారో..

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×