IT Welcome To Derry on OTT : ఇప్పుడు ఓటీటీలో థ్రిల్లర్ సినిమాల జోరు కొనసాగుతోంది. అందులోనూ హారర్ కంటెంట్ ని చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. అయితే హారర్ మూవీ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సిరీస్ ‘ఇట్:వెల్‌కమ్ టు డెర్రీ సిరీస్’ మొదటి రెండు పార్ట్ లు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వచ్చిన మూడవ సిరీస్ అక్టోబర్ 27 నుంచి మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయింది. ఆడియన్స్ ఈ ఎంట్రీ ఎపిసోడ్ కే బెదిరిపోయారు. మిగతా ఏడు ఎపిసోడ్స్ వారానికి ఒకటి చొప్పున రిలీజ్ కానున్నాయి. ఇందులో జోకర్ దెయ్యం చేసే విన్యాసాలకు, ఎంతటివాడైనా ఉలిక్కిపడాల్సిందే. ఈ సినిమా ఏ ఓటీటీలోకి వచ్చింది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘ఐటీ: వెల్‌కమ్ టు డెర్రీ’ (IT Welcome To Derry) అనేది 2025లో విడుదలైన అమెరికన్ సూపర్‌నాచురల్ హారర్ వెబ్ సిరీస్. ఇది స్టీఫెన్ కింగ్ 1986 నవల ‘ఐటీ’ ఆధారంగా, 2017, 2019 మూవీలకు ప్రీక్వెల్. ఆండీ మస్కియట్టి, బార్బరా మస్కియట్టి, జేసన్ ఫుక్స్ దీనిని రూపొందించారు. జియో హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ అక్టోబర్ 27 నుంచి స్ట్రీమింగ్ లో ఉంది. ఐయండిబిలో దీనికి 7.5/10 రేటింగ్ ని పొందింది.
పిల్లల నుంచి పెద్దల దాకా భయ పెట్టిన ఈ సిరీస్ 1962లో డెర్రీ అనే చిన్న టౌన్‌లో మొదలవుతుంది. లెరాయ్ అనే వ్యక్తి, తన భార్య కొడుకు విల్‌తో కలిసి డెర్రీకి కొత్తగా వస్తారు. లెరాయ్ మిలిటరీ బేస్‌లో పని చేస్తాడు. వాళ్లు వచ్చిన వెంటనే, టౌన్‌లో ఒక చిన్న పిల్లవాడు మాయమవుతాడు. ఈ ఘటనతో టౌన్‌లో భయం మొదలవుతుంది. ఇక్కడ చాలా సంవత్సరాలుగా పిల్లలు మిస్ అవుతుంటారు. ఇంతలో టౌన్‌లో పెన్నీవైజ్ అనే క్లౌన్ కనిపిస్తాడు. అతను పిల్లల భయాలను ఉపయోగించి, షేప్ మార్చుకుని దాడి చేస్తాడు.
Read Also : పిల్ల రూపంలో వచ్చే పిశాచి భయ్యో… డోర్ తీశారో దరువే… ఒంటరిగా చూడకూడని హర్రర్ మూవీ
లెరాయ్ ఫ్యామిలీ డెర్రీలో సెటిల్ అవుతుంటే, టౌన్‌లో మరిన్ని పిల్లలు మాయమవుతారు. ఈ టౌన్‌లో పెన్నీవైజ్ ఎప్పటి నుండో ఉన్నాడని లెరాయ్ ఫ్యామిలీ తెలుసుకుంటుంది. ప్రతి 27 సంవత్సరాలకు పెన్నీవైజ్ వస్తాడని తెలుస్తుంది. ఇక క్లైమాక్స్ లో పెన్నీవైజ్‌తో కొంత మంది పిల్లలు ఫైట్ చేస్తారు. ఈ సీన్స్ చాలా ఇంటెన్స్ గా ఉంటాయి. చివరి ఎపిసోడ్‌లో షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. పెన్నీవైజ్ ఓడిపోయినట్టు కనిపిస్తాడు, కానీ అతను మళ్లీ రిటర్న్ అవుతాడని హింట్ ఇస్తారు.