ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐఫోన్ లవర్స్ ఎంతగానో ఇష్టపడే స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 17 ప్రో మాక్స్. సుమారు లక్షన్నర ధర ఉన్నప్పటికీ.. చాలా మంది ఇష్టపడి ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త తరహా స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సీల్ దెబ్బతినకుండా ఐఫోన్ 17 ప్రో మాక్స్ బాక్స్ ఓపెన్ చేస్తున్నట్లు ఇందులో చూపించారు. ఈ వైరల్ వీడియో స్మార్ట్ ఫోన్ మోసం గురించి తీవ్రమైన ఆందోళనలను రేకెత్తించింది. ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ ప్రామాణికతకు కీలకమైన మార్కర్ గా పరిగణించబడే ఈ సీల్ సాధారణంగా ట్యాంపర్ ప్రూఫ్ గా ఉంటుంది. అయితే, ఆపిల్ లాంటి టాప్ బ్రాండ్‌లు కూడా నకిలీ, రీసేల్ మోసాలకు గురయ్యే అవకాశం ఉందని వీడియో సూచిస్తుంది.
తాజాగా ఈ స్మార్ట్ ఫోన్ అన్ బాక్సింగ్ కు సంబంధించిన వీడియోను ఎక్స్ వేదికగా సారా అనే యువతి షేర్ చేసింది. “ఈ వైరల్ వీడియో కొత్త ఫోన్లతో ప్రజలను ఎలా మోసం చేస్తారో చూపిస్తుంది” క్యాప్షన్ తో పోస్టు చేసింది. క్షణాల్లో ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఇప్పటికే 10 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ వీడియోలోని వ్యక్తి, సంఘటన జరిగిన ప్రదేశం తెలియకపోయినా, చిన్న సీజర్, హీటర్ ను ఉపయోగించి ఐ ఫోన్ ను అన్ బాక్స్ చేయడానికి ఉపయోగించిన పద్ధతి మాత్రం ఆందోళనకు గురి చేస్తోంది. వినియోగదారులు తరచుగా ఆపిల్, శామ్ సంగ్ లాంటి బ్రాండ్ లకు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లిస్తారు. సీల్డ్ ప్యాకేజింగ్, నాణ్యతకు హామీకి ఇస్తారు. ఇలాంటి వీడియోలు వైరల్ అవుతున్నందు నేపథ్యంలో ఆయా బ్రాండ్ల సీల్ మీదే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మార్కెట్లో ఇలాంటి మోసపూరిత స్మాప్ట్ ఫోన్లు ఎన్ని ఉన్నాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా బ్రాండ్ లు ప్యాకేజింగ్ ప్రమాణాలను బలోపేతం చేయాలని, సీల్ ట్యాంపరింగ్ జరగకుండా ఉండేందుకు మరిన్ని సెక్యూరిటీ ఫీచర్లను యాడ్ చేయాలని కోరుతున్నారు. ఓ నెటిజన్ తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకునే ప్రయత్నం చేశాడు. “నేను కూడా దీని గురించి ఆలోచిస్తున్నాను. అమెజాన్ నుంచి బ్రాండ్ న్యూ, సీల్డ్ పిక్సెల్ ను కొనుగోలు చేసాను. కానీ, అది తాజా ఆండ్రాయిడ్ వెర్షన్ తో ప్రీ లోడ్ చేయబడింది. దాని ఏజ్ ఆధారంగా అది కలిగి ఉండాల్సిన దానికంటే నాలుగు వెర్షన్లు ముందు ఉంది. నేను దానిని ఫోటో ప్రూఫ్ తో మోసంగా అమెజాన్ కు రిపోర్ట్ చేశాను” అని వెల్లడించాడు. అటు ఈ వీడియోను చూపించడం వల్ల మరింత నష్టం జరిగే అవకాశం ఉందని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ఇలాంటి పద్దతుల వల్ల స్మార్ట్ ఫోన్ల భద్రత మీదే అనుమానాలు వ్యక్తం అయ్యే అవకాశం ఉందని మరో వ్యక్తి వివరించాడు. మొత్తంగా ఈ వీడియో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో వినియోగదారులలో అనుమానాలు పెంచుతోంది.
This viral video shows how do people commit fraud with new phones?
© Reddit (gautammobile01) pic.twitter.com/3FCefgvclV
— Sarahh (@Sarahhuniverse) October 27, 2025
Read Also: బంగారం పెట్టుకుంటే భారీ జరిమానా.. ఉత్తరాఖండ్ గ్రామంలో వింత రూల్!