OTT Movie : థియేటర్లలో కంటే డిజిటల్ స్ట్రీమింగ్ లో హారర్ సినిమాలని ఎక్కువగా వాచ్ చేస్తున్నారు ఆడియన్స్. హారర్ సినిమాలను భాషతో ప్రమేయం లేకుండా కంటెంట్ నే చూస్తున్నారు. ఇక ఇండియన్ సినిమాలలో మరాఠా సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఇక్కడి నుంచి కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హారర్ సినిమాలో ఆత్మలు గర్భిణీలను టార్గెట్ చేస్తుంటాయి. గర్భంలోనే పిల్లలను చంపేస్తుంటాయి. క్లైమాక్స్ వరకు ఒళ్ళు జడిపించే సీన్స్ ఉంటాయి. ఈ సినిమా హారర్ ప్రియులకు మస్ట్ వాచ్ మూవీ. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
‘లపచ్ఛపి’ (Lapachhapi) 2017లో విడుదలైన మరాఠీ హారర్ ఫిల్మ్. దీన్ని విశాల్ డైరెక్టర్ చేశాడు. జితేంద్ర పాటిల్ నిర్మించాడు. సినిమా 2 గంటలు 10 నిమిషాలు ఉంటుంది. ఇందులో పూజా సావంత్ (నెహా), ఉషా నాయక్ (అమ్మ), విక్రమ్ గైక్వాడ్ (సుధీర్), అనిల్ గావాస్ (సుధీర్ అత్త) నటించారు. ఈ సినిమా 2017 జూలై 14న థియేటర్స్‌లో విడుదలైంది. జీ 5 ఓటీటీలో అందుబాటులో ఉంది. ఐయండిబిలో దీనికి 7.6/10 రేటింగ్ ఉంది.
ఈ సినిమా మొదలవుతూనే ఒక 8 నెలల గర్భవతి మహిళ అడవిలో భయంగా పరుగెత్తుతూ ఉంటుంది. ఆమె వెంట ఒక ఆత్మ వచ్చి, ఆమె గర్భంలోని బిడ్డను హత్య చేస్తుంది. ఇప్పుడు కథ ప్రజెంట్ కి వస్తుంది. నెహా, రాహుల్ అనే యంగ్ కపుల్, ఉద్యోగ రీత్యా చెరకు ఫీల్డ్స్ మధ్య పాత ఇంటికి మారతారు. నెహా 8 నెలల గర్భవతి, గ్రామస్తులు ఆ ఇల్లు ఆత్మలతో ఉన్నదని వార్న్ చేస్తారు. కానీ వాళ్లు ఆ మాటలను పట్టించుకోరు. ఇంటికి వచ్చిన తొలి రోజు నుండి వింత శబ్దాలు, నవ్వులు వినిపిస్తాయి. నెహాకు డ్రీమ్స్‌లో చిన్న అమ్మాయి ఆత్మలు కనిపిస్తాయి. ఆమె గర్భాన్ని టార్గెట్ చేసినట్లు ఆమె కల గని ఉలిక్కి పడుతుంది.
ఫ్లాష్ బ్యాక్ లో ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఈ ఇల్లు పాతకాలంలో బాలికల భ్రూణ హత్యలు జరిగిన చోటు అని, ఆ ఆత్మలు రివెంజ్ కోసం చూస్తున్నాయని తెలుస్తుంది. క్లైమాక్స్‌లో నెహా డెలివరీ సమయం వస్తుంది. ఆత్మలు బలంగా నేహా పై దాడి చేస్తాయి. ఈ దాడిలో నేహా తన బిడ్డని కోల్పోతుందా ? లేక కాపాడుకుంటుందా ? అక్కడ ఆత్మలు ఎందుకు గర్భిణీలను టార్గెట్ చేస్తున్నాయి ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.