Shobha shetty: బుల్లితెర నటిగా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న వారిలో కార్తీకదీపం సీరియల్ నటి శోభా శెట్టి(Shobha Shetty) ఒకరు. ఈమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగులో కార్తీకదీపం సీరియల్ లో మోనిత అనే విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతోమంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా కార్తీకదీపం సీరియల్ తరువాత శోభా శెట్టి తదుపరి ఎలాంటి సీరియల్స్ ప్రకటించలేదు కానీ బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు. అలాగే ఇటీవల ఈమె శోభాశెట్టి డిజైనర్ స్టూడియోస్ అంటూ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
ఇలా ఈమె కెరియర్ పక్కనపట్టి వ్యక్తి వ్యక్తిగత విషయానికి వస్తే.. శోభాశెట్టి మరో బుల్లితెర నటుడు యశ్వంత్ రెడ్డి (Yaswanth Reddy)అనే వ్యక్తిని ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా తన ప్రేమ విషయాన్ని తెలియజేయడమే కాకుండా కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఇలా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పిన ఈ జంట ఎవరికి తెలియకుండా రహస్యంగా పెళ్లి పీటలు ఎక్కినట్టు తెలుస్తుంది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోని శోభా తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.
ఇలా శోభ యశ్వంత్ పెళ్లికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది నిజమేనని చాలామంది భావిస్తున్నారు కానీ ఒక జ్యువెలరీ యాడ్ కి సంబంధించిన వీడియోలో భాగంగా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు నటించారు. జోయాస్ జ్యువెలరీకి సంబంధించిన ప్రమోషనల్ యాడ్ లో భాగంగా శోభా శెట్టి యశ్వంత్ వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపగా మరి కొంతమంది రియల్ గా ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
వచ్చే ఏడాది వివాహం..
పెళ్లి దుస్తులలో ఈ జంట ఎంతో చూడముచ్చటగా ఉంది అంటూ మరి కొంతమంది కామెంట్ లు పెడుతున్నారు. గత ఏడాది ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న శోభా శెట్టి యశ్వంత్ పలు కారణాల వల్ల పెళ్లిని వాయిదా వేసుకున్నారు. అయితే వచ్చే ఏడాదిలో వీరి వివాహం జరగబోతుందని శోభ శెట్టి వెల్లడించారు. ఇక నటుడు యశ్వంత్ సైతం పలు బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. యశ్వంత్ కూడా కార్తీకదీపం సీరియల్ లో హీరో కార్తీక్ తమ్ముడి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సీరియల్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైందని శోభా శెట్టి పలు సందర్భాలలో తమ ప్రేమ గురించి తెలియజేశారు.
Also Read: Sreeleela: కిస్సిక్ సాంగ్ లేకపోతే అవకాశాలు లేవు.. అసలు విషయం చెప్పిన శ్రీ లీల!