INDW vs AUSW: వన్డే మహిళల ప్రపంచకప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా ఆట తీరు రోజురోజుకు దిగజారుతోంది. సరైన బ్యాటింగ్, బౌలింగ్ ముఖ్యంగా కెప్టెన్సీ తీరు అత్యంత దారుణంగా ఉంది. దీంతో వరుసగా రెండు ఓటములను మూటగట్టుకుంది టీమిండియా. ముఖ్యంగా నిన్న ఆస్ట్రేలియా జట్టు పైన 330 పరుగులు చేసిన టీమిండియా దారుణంగా ఓడిపోయింది. దీంతో టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పై ( Harmanpreet Kaur) దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు. ఈవిడకు ఏదీ చేతకావడం లేదని మండిపడుతున్నారు. ఆ స్థాయిలో పరుగులు చేసిన టీమిండియాను గెలిపించే ప్రయత్నం చేయలేదని ఫైర్ అవుతున్నారు.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య నిన్న కీలక మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. విశాఖపట్నంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టీం ఇండియాకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఇందులో గెలిచిన ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానానికి వెళ్లగా, టీమిండియా మాత్రం మూడో స్థానంలోనే నిలిచిపోయింది. ఇవాళ ఇతర జట్ల మధ్య మ్యాచ్ జరిగితే ఖచ్చితంగా టీమిండియా స్థానం మరింత కిందికి దిగజారే ప్రమాదం ఉంది. అయితే నిన్న టీమిండియా ఓడిపోయిన నేపథ్యంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ను ఉద్దేశించి జనాలు ఫైర్ అవుతున్నారు. కెప్టెన్సీ క్వాలిటీ ఒక్కటి కూడా హర్మన్‌ప్రీత్ కౌర్ లో కనిపించడం లేదని విమర్శలు చేస్తున్నారు.
బ్యాటింగ్ సరిగ్గా చేయడం లేదని నిప్పులు చెరుగుతున్నారు. బ్యాటింగ్ సరిగ్గా చేయకపోయినా పర్వాలేదు కానీ కెప్టెన్సీ అయినా చేయాలి కదా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. 330 పరుగుల టార్గెట్ ప్రత్యర్థి ఆసీస్ ముందు ఉంచి, కాపాడుకోలేకపోయిందని చురకలు అంటిస్తున్నారు. సరైన సమయానికి బౌలింగ్ ఎవరికి ఇవ్వాలి ? క్రిటికల్ సిచువేషన్ లో ఎలా కెప్టెన్సీ చేయాలి? ప్రత్యర్థిని ఎలా కట్టడి చేయాలి అనే విషయంలో ఎత్తుగడలు వేయలేకపోతున్నారు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్. అందరూ బాగా రాణిస్తే కెప్టెన్ మాత్రం తన చెత్త నిర్ణయాల వల్ల టీమిండియన్ ఓడిస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే టీమిండియా వరల్డ్ కప్ గెలవడం కలగానే మిగులుతుందని ఫైర్ అవుతున్నారు. లేకపోతే హర్మన్‌ప్రీత్ కౌర్ ను తొలగించి వేరే వాళ్లకు కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ( Harmanpreet Kaur) ఈ వన్డే వరల్డ్ కప్ 2025 లో బ్యాటింగ్ లోనూ విఫలమయ్యారు. ఇప్పటి వరకు టీమిండియా 4 మ్యాచ్ లు ఆడింది. ఈ మ్యాచ్ లలో కేవలం 71 పరుగులు మాత్రమే చేసింది హర్మన్‌ప్రీత్ కౌర్. ఇందులో హైయెస్ట్ స్కోర్ 22 పరుగులు మాత్రమే.
– Can't bat properly on a batting pitch
– Can't lead the team when it matters the most
– Can't take a tactical decision & win the match when Australia is already 7 wickets down .
What she's actually doing in the team ? pic.twitter.com/GEuHrIaBgu
— Sohel. (@SohelVkf) October 12, 2025