Telugu TV Serials: సీరియల్స్ ప్రతిరోజు ఆకట్టుకుంటూ వస్తున్నాయి. సినిమాలతో పోలిస్తే ఈ మధ్య డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. ప్రతిరోజు కూడా కొత్త కొత్త సీరియల్ ప్రసారంతో అవ్వడంతో జనాలు ఎక్కువగా వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు కేవలం సినిమాలు కొన్న డిమాండ్ ఇప్పుడు సీరియల్స్ కి కూడా పెరగడంతో ఎక్కువమంది వీటిని చూసి ఎంజాయ్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.. దాంతో ఈ మధ్య టీవీ చానల్స్ కొత్త కొత్త స్టోరీలతో సీరియల్స్ ని ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. గత కొద్దిరోజులుగా సీరియల్స్ స్టోరీలలో ట్విస్టులు కూడా ఏర్పడడంతో ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది. మరి ఈ మధ్యకాలంలో సీరియల్స్ టిఆర్పి రేటింగ్ కూడా భారీగానే పెరుగుతూ వచ్చిందని అర్థమవుతుంది. మరి గత వారంతో పోలిస్తే ఈ వారం ఏ సీరియల్ టిఆర్పి రేటింగ్ పెరిగింది ఏ సీరియల్కు డౌన్ అయింది అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..
ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. వీటిల్లో వచ్చిన సీరియల్స్ కి డిమాండ్ కూడా పెరగడంతో ఈమధ్య రేటింగ్ కూడా భారీగా నమోదు అవుతూ వస్తుంది. అయితే స్టార్ మా లో ప్రసారమయ్యే సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతోపాటుగా డిఫరెంట్ స్టోరీలతో రావడంతో వీటికి టిఆర్పి రేటింగ్ కూడా భారీగా పెరుగుతూ వస్తుంది. ఒకవైపు టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ ఉండగా కూడా మరోవైపు సీరియల్స్ కి డిమాండ్ పెరగడం మామూలు విషయం కాదు. అయితే ఇప్పుడు గత వారంతో పోలిస్తే ఈవారం కార్తీకదీపం 2 సీరియల్ మళ్లీ టాప్లోకి వచ్చేసింది. అదేవిధంగా గుండెనిన గుడి గంటలు సీరియల్ కాస్త డౌన్ అయ్యి సెకండ్ పొజిషన్లోకి వచ్చేసింది మొత్తానికి మొదటి విధంగానే ఈ సీరియల్స్ పోటీ పడుతున్నాయి.
టీవీల్లోకి ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్ డిఫరెంట్ కథతో ఉండటంతో వీటి మధ్య పోటీ ఎప్పటికీ ఉంటుంది.. కార్తీక దీపం 2 మొదటి స్థానంలో ఉంది. ఇక ఈ సీరియల్ రేటింగు 13.03 గా ఉంది.. రెండవ స్థానంలో గుండెనిండా గుడిగంటలు సీరియల్ ఉంటుంది.. ఇక రేటింగ్ విషయానికొస్తే .. 12.80 ఉంది. పొదరిల్లు 11. 85, ఇంటింటి రామాయణం 11.64, ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.87, నువ్వులేక నేను లేను10.70, నిండు మనసులు 9.70, చిన్ని 8.73, బ్రహ్మముడి 8.57.. అయితే ఇప్పటివరకు ఈ సీరియల్స్ మంచి రేటింగ్ను నమోదు చేసుకున్నాయి. ఇంటింటి రామాయణం, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్స్ కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త మంచి టీఆర్పి రేటు నమోదు చేసుకొని దూసుకుపోతున్నాయి.. ఈవారం రేటింగ్ కాస్త పెరిగింది. ఇక వచ్చేవారం ఏ సీరియల్ కు రేటింగ్ఎంత పెరుగుతుందో చూడాలి.. వచ్చేవారం కొత్త సీరియల్స్ కూడా ప్రసారం కావడంతో ఈ సీరియల్కు ఎలాంటి స్పందన వస్తుందన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
Also Read : సోమవారం మూవీ లవర్స్ కు పండగే.. ఆ రెండు వెరీ స్పెషల్..