Kissik Talks:జబర్దస్త్ కామెడీ షోలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న బాబు (Jabardasth Babu) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్న ఈయన ఇటీవల డైరెక్టర్గా మారి మొదటి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈటీవీ విన్ నిర్మాణం లో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిరీస్ ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. వైవా హర్ష , హైపర్ ఆది, శ్రీవిద్య తదితరులు కీలక పాత్రల్లో వచ్చిన ఈ సిరీస్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సిరీస్ సక్సెస్ అందుకోవడంతో ప్రస్తుతం శ్రీవిద్య, బాబు వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు అందులో భాగంగానే బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik talks) కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేసి ఎన్నో విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ చేస్తున్న సమయంలో శ్రీవిద్య ఎంపికపై వచ్చిన విమర్శలు, ఆ తర్వాత తనను షో కి వస్తానని అడిగితే నీకు క్రేజ్ లేదు కదా ఎందుకు అని అవమానించిన రోజులను అన్నింటిని గుర్తు చేసుకున్నారు.
ఇకపోతే తాజా ఎపిసోడ్ లో భాగంగా బాబు మాట్లాడుతూ.. ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతానని ఎన్నోసార్లు అడిగాను. కానీ క్రేజ్ లేదు కదా అని పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు మళ్లీ ఇంటర్వ్యూలకు నన్ను పిలుస్తున్నారు అంటే నేను ఓడిన చోటే నెగ్గాను కదా అంటూ తాను అందుకున్న సక్సెస్ ను గర్వంగా చెప్పుకున్నారు. ఇకపోతే శ్రీవిద్య ఎంపిక గురించి మాట్లాడుతూ.. శ్రీ విద్యాను ఎంపిక చేయడాని కంటే ముందు చాలామంది అమ్మాయిలను ఆడిషన్స్ తీసుకున్నాము. అయితే ఆది పక్కన నటించడానికి చాలామంది అమ్మాయిలు వెనుకడుగు వేశారు.
ఇక శ్రీవిద్య పర్ఫామెన్స్ నాకు నచ్చలేదు కానీ ఈమె పెర్ఫార్మెన్స్ వీడియోలను ఈటీవీ విన్ నిర్వాహకులకు చూపిస్తే ఇలాంటి వాళ్లు కదా మనకు కావాలి అన్నారు. అయితే శ్రీ విద్యతో షూటింగ్ చేస్తున్న సమయంలో సెట్ లో ఒక ఆయన నా దగ్గరకు వచ్చి ఎందుకయ్యా ఇలాంటి వాళ్లకు అవకాశాలు ఇస్తారు. ఇలాంటి వాళ్లతో పెట్టి తీస్తే వెబ్ సిరీస్ హిట్ అవుతుందా అంటూ అవమానకరంగా మాట్లాడారు కానీ సరిగ్గా వారం తిరిగాక శ్రీవిద్య పర్ఫామెన్స్ చూసి వాళ్లే నీది మంచి నిర్ణయం.. ఆమె చాలా అద్భుతంగా నటిస్తోంది. ముఖ్యంగా ఈ పాత్రలో ఆమె తప్ప మరొకరు నటించలేరు అంటూ చెప్పినట్లు తెలిపారు. ఏది ఏమైనా శ్రీవిద్య ఈ ఒక్క వెబ్ సిరీస్ తో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుందని చెప్పాలి.
also read:లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆషికా రంగనాథ్!
ఇదే ఎపిసోడ్లో శ్రీవిద్య, బాబు మధ్య సాగిన కామెడీ డైలాగ్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ముఖ్యంగా నీకు ఇంత మంచి పేరు ఇచ్చిన బాబుకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావ్ అని హోస్ట్ వర్ష శ్రీవిద్యతో అడగగా.. నేను ఎన్ని చేసినా అన్న రుణం తీర్చుకోలేను. కాకపోతే నీ నెక్స్ట్ సినిమాలో కూడా నాకు చాన్స్ ఇవ్వన్నా అంటూ అడిగింది. చూసావా ఇక్కడ కూడా అడుక్కుంటుంది అని బాబు అనగా.. కనీసం అసిస్టెంట్ డైరెక్టర్ గా నైనా అవకాశం ఇవ్వు అని అడిగింది శ్రీవిద్య. అయితే తాను ఫ్లాప్ సినిమా తీయాలనుకున్నప్పుడు కచ్చితంగా నిన్ను పెట్టుకుంటానని చెప్పి నవ్వించాడు బాబు.