Nindu Noorella Saavasam Serial Today Episode: షాపింగ్ మాల్‌లో మనోహరి పార్థును చంపే అవకాశం మిస్ అయినందుకు బాధపడుతుంది. పార్థు తీసుకున్న బట్టలకు అమర్ వాళ్లు వెళ్లిపోయాక రామ్మూర్తి బిల్లు పే చేసి పార్థును తీసుకుని ఇంటికి వెళ్లిపోతాడు.
తర్వాత అమర్ పిల్లల కోసం టపాసులు తీసుకుని ఇంటికి వెళ్తాడు. అప్పటికే అమర్ కోసం వెయిట్ చేస్తున్న పిల్లలు అమర్‌ను తమ కోసం టపాసులు తీసుకొచ్చారా డాడీ అని అడుగుతారు. తీసుకొచ్చానని రాథోడ్ కారు డిక్కీలో ఉన్న బాణాసంచా బయటకు తీసుకురా అంటాడు. రాథోడ్ వెళ్లి బాణాసంచా బయటకు తీస్తుంటే.. ఆనంద్, ఆకాష్ తలా ఒక బాక్స్ పట్టుకుంటారు. పిల్లలు ఎవరికి కావాల్సినవి వాళ్లు తీసుకోండి అని అమర్ చెప్పగానే.. బుజ్జమ్మ తనకు చిచ్చుబుడ్లు, భూ చక్రాలు కావాలని చెప్తుంది. ఆనంద్, ఆకాష్ లు తమకు వంకాయ బాంబులు, లక్ష్మీ బాంబులు, థౌజెండ్ వాలా కావాలని చెప్తారు.
అందుకు అంజు కోపంగా అన్ని మీరే తీసుకుంటే నేనేం తీసుకోవాలి అని అడుగుతుంది. నువ్వు పాము బిల్లలు తీసుకో అంజుపాప అఏ నీకు సెట్ అవుతాయని రాథోడ్ చెబితే.. అంజు కోపంగా రాథోడ్‌ను చూస్తూ.. తానేం ఇంకా చిన్నపిల్లను కాదని చెప్తుంది. అంజు మాటలకు అమర్ నవ్వుతూ.. చిన్న పిల్లవి కాక పెద్ద దానివా..? అందరూ కేర్‌ఫుల్ గా టపాసులు కాల్చాలి. ఎవ్వరూ చేతులు కాల్చుకోరాదు.. చేతులకు దగ్గరగా కాల్చకూడదు. ముఖ్యంగా మేము అంటే రాథోడ్ కానీ, భాగీ కానీ నేను కానీ లేకుండా ఎవ్వరూ ఏదీ కాల్చకూడదు అంటూ అమర్ జాగ్రత్తలు చెప్తుంటే.. అంజు ఎక్స్‌ట్రా చేస్తుంది. పిల్లలు డాడీ చెప్పింది అందరూ వింటున్నారు కదా జాగ్రత్తగా ఉండాలి అంటే.. అమర్ తాను చెప్పేది అంజుకేనని నువ్వు జాగ్రత్తగా ఉంటే అందరూ జాగ్రత్తగా ఉంటారని చెప్పి లోపలికి వెళ్లిపోతాడు అమర్.
రూంలో మిస్సమ్మ రెడీ అవుతుంటే అమర్ వెళ్లి ఏంటి ఇంకా రెడీ అవుతూనే ఉన్నావు.. నేను వెళ్లినప్పటి నుంచి రెడీ అవుతూనే ఉన్నావు.. పూజకు టైం అవుతుంది అంటాడు. మిస్సమ్మ మాత్రం సైలెంట్‌గా అమర్ వైపు రొమాంటిక్ గా చూస్తూ.. తలలో పూలు పెట్టుకోబోయి కావాలనే జారవిడుస్తుంది. అమర్ పూలను పట్టుకుంటాడు ఇవ్వమని మిస్సమ్మ సైగ చేస్తే తానే తలలో పెడతానిన సైగ చేస్తాడు అమర్. సరే అంటూ మిస్సమ్మ తిరిగితే అమర్ పూలు తలలో పెట్టి మిస్సమ్మను రొమాంటిక్‌గా చూస్తుంటాడు.
మిస్సమ్మ ఏంటలా చూస్తున్నారు అని అడిగితే.. ముద్దు కావాలని అమర్ అంటాడు. ఇప్పుడు వద్దు పూజ ఉంది కదా పూజ అయిపోయాకే అంటుంది మిస్సమ్మ. ఇక్కడ ఈ పతిదేవుడి పూజ చేసుకో తర్వాత ఆ పూజ చేసుకో అంటూ అమర్ చెబితే.. అక్కడ పూజ అయిపోయాకే ఈ పతిదేవుడి గురించి ఆలోచిస్తాను అంటుంది మిస్సమ్మ. రాథోడ్ గట్టిగా మిస్సమ్మను పిలుస్తూ రూంలోకి వస్తాడు. పంతులు వచ్చాడని పూజకు టైం అవుతుందని మీరు త్వరగా రావాలని చెప్తాడు. అమర్, మిస్సమ్మ బయటకు వెళ్లిపోతారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.