Bigg Boss 10 Telugu Day 70 Promo 3: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ విజయవంతంగా 10 వ వారం పూర్తి కాబోతుంది. ఇక పదవ వారం మొత్తం ఫ్యామిలీ వీక్ కావడంతో కంటెస్టెంట్ ల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హౌస్ లోకి వెళ్లడంతో ఈ వీక్ అంతా చాలా ఎమోషనల్ గా జరిగిపోయింది. నేడు వీకెండ్ కావడంతో పలువురు బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు. ఇక ఫ్యామిలీ వీక్ అంటే కచ్చితంగా హైపర్ ఆది బిగ్ బాస్ వేదికపై సందడి చేయాల్సిందే. ఇలా హైపర్ ఆది గత కొన్ని సీజన్ల నుంచి బిగ్ బాస్ వేదిక పై సందడి చేస్తున్నారు.
తాజాగా హైపర్ ఆదికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా హైపర్ ఆది ఎప్పటిలాగే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లపై తనదైన సైబీలోనే కౌంటర్లు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ అవుతుంది. ఈ ప్రోమో వీడియోలో భాగంగా హైపర్ ఆది మాట్లాడుతూ.. తాను గత కొన్ని సీజన్లుగా బిగ్ బాస్ వేదిక పైకి వచ్చినప్పటికీ ఏరోజు కూడా హౌస్ లోకి వెళ్లాలని అనిపించలేదు కానీ మొదటిసారి హౌస్ లోకి వెళ్లి ఒక్కరోజైనా ఉండాలనిపిస్తుందని ఆది తెలిపారు..
ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఒక రోజుకే 15 లక్షలు ఇస్తారు అంటూ పరోక్షంగా మిథిలేష్ రెండు రోజులకే 15 లక్షలు తీసుకొని వెళ్లడం గురించి మాట్లాడుతూ సెటైర్లు వేశారు. అదేవిధంగా కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ.. బిగ్ బాస్ ఇచ్చిన స్కూల్ టాస్కులు త్రిగుణ్ స్పైడర్‌లో ఎస్ జే సూర్యలా అనిపించాడు.. వంశీ, సుధీర్ అయితే పిల్లల్ని ఎత్తుకెళ్లేవాళ్లలా ఉన్నారు అని అంటాడు. త్రిగుణ్ గురించి మాట్లాడుతూ…ఒకడు నీకు ఎదురైనా వాడికే రిస్క్.. నువ్వు వాడికి ఎదురైనా వాడికే రిస్క్ అని ఆది తెలిపారు.
ఇక శాలిని, రోహిత్, అపూర్వ గురించి పరోక్షంగా మాట్లాడుతూ అగ్ని పరీక్ష దాటి వస్తే చాలు అని అనుకుంటారు కానీ నువ్వు పెట్టే పరీక్షలు ఉంటాయని బహుశా వాళ్లకు తెలియదని అది కౌంటర్ వేశారు. వర్షిణి, ముకేష్ గురించి కలిపి చెప్తా.. ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్.. ఆటలో పులిహోర కాదు.. ఆటే పులిహోర అని ఇద్దరి మీద కౌంటర్లు వేస్తాడు ఆది.ఇక నరేష్ గురించి మాట్లాడుతూ.. నువ్వు ఇంట్లో నైట్ సుస్సుకి వెళ్లాలంటే మీ నాన్నని నిద్ర లేపుతావ్.. ఇక్కడ సుధీర్, ముకేష్‌లకు మోటివేషన్ ఇస్తున్నావు. పర్ఫామెన్స్ చేయి.. అలా కాకుండా నాగార్జున గారు హైట్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నావు అంటూ ఆది తన మాట పేరుతో అందరినీ నవ్వించారు. ఇంకా మిగిలిన కంటెస్టెంట్ల గురించి అది ఏం మాట్లాడారు అనేది తెలియాలి అంటే ఈరోజు పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు ఎదురు చూడాలి.
Also Read: భార్యాభర్తలమే కానీ వేరుగా ఉంటున్నాం.. రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్!