Gundeninda Gudigantalu : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో హీరో హీరోయిన్ల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో తెగ వెతికిస్తూ ఉంటారు. స్టార్ మాలో ప్రసారం అవుతున్న కొన్ని సీరియల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. అందులో గుండెనిండా గుడిగంటలు సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మధ్యతరగతి కుటుంబంలోకి వచ్చిన కోడలను అత్తగారు ఎలా సాధిస్తారు అన్నది ఈ సీరియల్లో నటిస్తారు. ఈ సీరియల్లో మెయిన్ క్యారెక్టర్ లో బాలు నటించారు.. బాలు రియల్ లైఫ్ గురించి చాలామందికి తెలియదు.. ఇతని లవ్ స్టోరీ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
గుండెనిండా గుడిగంటలు సీరియల్లో బాలు పాత్రలో నటించిన హీరో పేరు విష్ణుకాంత్. ఈయన తెలుగు నటుడు కాదు తమిళ ఇండస్ట్రీలో పలు సీరియల్స్లలో నటించి బాగా ఫేమస్ అయిన యాక్టర్.. తెలుగులో ప్రస్తుతం ఈ సీరియల్ లో నటిస్తున్నారు. ఈయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే సీరియల్ నటినే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొదట తమ కుటుంబంలో సీరియల్ లో నటించే అమ్మాయిని ఒప్పుకోలేదని గతంలో టీవీ షోలో విష్ణుకాంత్ బయటపెట్టారు.. కొన్నేళ్లు ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుని ఆ తర్వాత ఇంట్లో పెద్దలని ఒప్పించారు. ఎన్నో ట్విస్టుల తో వాళ్ళ లవ్ స్టోరీకి పెళ్లితో ఎండ్ కార్డు పడింది. కానీ ఆ ప్రేమ పెళ్లి ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. సీరియల్స్ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో ఇద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. వీరిద్దరూ విడిపోయి చాలాకాలం అయినా సరే విష్ణుకాంత్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా తన తల్లిదండ్రులతోనే గడుపుతున్నాడు.
Also Read :ఈ వారం టీవీ సీరియల్స్ రేటింగ్స్.. టాప్ లో కొత్త సీరియల్..?
విష్ణు కాంత్ ఒక తమిళ నటుడు.. మొదట తమిళ సీరియల్స్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఒక్కో సీరియల్ తో తన నటన తో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. 2008 నుంచి టెలివిజన్ రంగంలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఓవైపు సీరియల్స్ లో నటిస్తూనే మరోవైపు వెండితెరపైనా కూడా పలు చిత్రాల్లో మెరిశారు. ఇక ఈయన సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేసినట్టు తెలుస్తోంది.. అయితే మధ్యతరగతి కుటుంబం కావడం తో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడేవారంట. దీంతో తమ వృత్తి మగ్గం వర్క్ చేసేవాడట. అందుకు సంబంధించిన వీడియోను కూడా విష్ణుకాంతే ఓ సందర్భంలో సోషల్ మీడియా లో షేర్ చేశాడు. ఆ వీడియో వైరల్ అవ్వడంతో ఆయన ఇలాంటి పనిచేశాడా? అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం టాప్ సీరియల్ గుండెనిండా గుడిగంటల్లో నటిస్తూ ప్రేక్షకుల మనసుల్లో బాలుగా చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇకపోతే ఈయన రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే.. ఒక్కో రోజుకు 35 వేల నుంచి 40 వేల వరకు చార్జ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.