BigTV English

CM Progress Report: విశాఖలో గూగుల్ ఉద్యోగులకు దీపావళి కానుక

CM Progress Report: విశాఖలో గూగుల్ ఉద్యోగులకు దీపావళి కానుక
Advertisement

CM Progress Report: విశాఖలో గూగుల్‌ ఏఐ సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏపీ పర్యటన.. అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు.. దీపావళి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. ఇలా ఏపీ ప్రభుత్వంలో ఎన్నో విశేషాలు ఈ వారంలో జరిగాయి.


13-10-2025 (సోమవారం)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. కర్నూలులో నిర్వహించే సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి మోడీని ఆహ్వానించారు సీఎం చంద్రబాబు.

13-10-2025 (సోమవారం)
విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో ఏర్పాటు చేస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పార్టనర్షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఈసారి సీఐఐ సదస్సు టెక్నాలజీ, ట్రస్ట్, ట్రేడ్-నావిగేటింగ్ ది జియోఎకనామిక్ ఆర్డర్ థీమ్‌తో మొత్తం 13 సెషన్లుగా జరగనుంది. 29 మంది వాణిజ్య మంత్రులు, 80 మంది దేశ, విదేశీ సీఈవోలు, 40 దేశాల నుంచి ప్రతినిధులు, అలాగే 13మంది కేంద్ర మంత్రులు ఈ సదస్సుకు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. జీ20 దేశాలు, మిడిల్ ఈస్ట్, యూరప్, ఆసియా, పశ్చిమాసియా తదితర ప్రాంతాల నుంచి ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది.


13-10-2025 (సోమవారం)
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందుడుగు పడింది. రాజధానిలో CRDA కార్యాలయ భవనాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ భవనం ప్రారంభం కేవలం ఆరంభం మాత్రమేనని, అమరావతి అభివృద్ధి ప్రస్థానం ఇప్పుడే మొదలైందన్నారు సీఎం. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులపై ప్రశంసల వర్షం కురిపించారు. వారి త్యాగాలను ఎప్పటికీ మరువలేనని, వారికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

13-10-2025 (సోమవారం)
G+7 భవనంతో పాటు మరో నాలుగు పీఈబీ భవనాలను నిర్మించింది ప్రభుత్వం. CRDA, ఏడీసీఎల్‌తో పాటు మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట నుంచి కార్యకలాపాలు నిర్వహించేలా నిర్మాణం చేపట్టారు. భవనం ప్రారంభానికి ముందు భూములిచ్చిన రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. రైతులు భూములిచ్చి రాజధాని నిర్మాణానికి సహకరించారని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.

14-10-2025 (మంగళవారం)
విశాఖపట్నంలో 1 గిగావాట్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు, అలాగే ఏఐ హబ్ కు సంబంధించి ప్రభుత్వం ఢిల్లీలో గూగుల్‌తో హిస్టారికల్ డీల్ కుదర్చుకుంది. ఢిల్లీ తాజ్‌మాన్‌సింగ్‌ హోటల్‌లో భారత్ ఏఐ శక్తి పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నది. ఈ ఏఐ డేటా సెంటర్ వైద్యారోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో సేవలు అందించనున్నది. ఆసియాలో ఆ సంస్థ ఏర్పాటు చేస్తున్న అతి పెద్ద ప్రాజెక్టు కూడా ఇదే కాబోతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2028-2032 మధ్య ఏపీ స్థూల ఉత్పత్తికి ఏటా 10,518 కోట్లు సమకూరుతుందని, 1,88,220 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడుతుందని అంచనా. గూగుల్‌ క్లౌడ్‌ బేస్డ్ ప్రోగ్రామ్స్, సర్వీసెస్ ద్వారా ఏటా 9,553 కోట్ల చొప్పున ఐదేళ్లలో 47,720 కోట్ల వాల్యూ అవుట్ పుట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

14-10-2025 (మంగళవారం)
గూగుల్‌ డేటా సెంటర్ పై అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం అమరావతి చేరుకున్న సీఎం చంద్రబాబుకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, నేతలు ఘనస్వాగతం పలికారు. థాంక్యూ సీఎం సార్, గూగుల్ కమ్స్ టు ఏపీ నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మార్చే గూగుల్ సంస్థతో అవగాహనా ఒప్పందం కుదిరినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

15-10-2025 (బుధవారం)
రాజధాని అమరావతిలో నిర్మించనున్న 58 అడుగుల ఎత్తు అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహ నమూనాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. రాజధాని ప్రాంతంలోని శాఖమూరులో ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ పొట్టిశ్రీరాములు స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి 16న పొట్టి శ్రీరాములు 125వ జయంతి నాటికి ఈ స్మృతివనంలో 58 అడుగుల విగ్రహాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విగ్రహ డిజైన్లను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైజ్‌గా నామకరణం చేశారు.

15-10-2025 (బుధవారం)
ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, కార్యక్రమాల అమలు తీరు తెలుసుకునేందుకు నవంబరు నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానన్నారు సీఎం చంద్రబాబు. ప్రతీ పౌరుడికీ సంక్షేమ ఫలాలు ఎలా అందుతున్నాయో అనే అంశాన్ని తనిఖీ చేస్తానని అన్నారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ప్రభుత్వ సేవల్లో సంతృప్తి స్థాయి సహా రియల్ టైమ్ గవర్నెన్స్‌ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు కలిగిన ప్రయోజనాలు తదితర అంశాలపై వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. నిత్యావసరాలు, ఇతర ఉత్పత్తులపై పన్నులు తగ్గిన అంశంపై గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. దీపావళి తర్వాత కూడా ప్రజల్లోకి పన్ను తగ్గింపు అంశాన్ని తీసుకెళ్లాలని ఆదేశించారు.

16-10-2025 (గురువారం) ( నమో నామస్మరణ )
కర్నూలు జిల్లాతో పాటు ఏపీ మొత్తం నమో నామస్మరణతో మారుమోగింది. ఉదయం కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు సీఎం చంద్రబాబు. అనంతరం మోడీతో కలిసి శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ప్రధాని మోడీ, చంద్రబాబుకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్ల దర్శనం ముగిసిన తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని మోడీతో కలిసి సీఎం చంద్రబాబు సందర్శించారు. అక్కడున్న శివాజీ దర్బార్‌ హాల్, ధ్యాన మందిరాలను పరిశీలించి, ఛత్రపతి శివాజీ విగ్రహానికి నివాళులర్పించారు.

16-10-2025 (గురువారం) ( అభివృద్ధి పనులకు శంకుస్థాపన )
దర్శనాల అనంతరం కర్నూలు జిల్లాలోని నన్నూరులో నిర్వహింంచిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్‌ బహిరంగసభలో ప్రధాని మోడీతో కలిసి పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఈ సభలో వర్చువల్‌గా ఏపీలో 13 వేల 429 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మోడీ. ఏపీలో చంద్రబాబు, పవన్‌ల విజనరీ నాయకత్వం ఉందని.. ఢిల్లీ, అమరావతి కలిసి పనిచేస్తున్నాయన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు సహాకారంతో ఏపీ ప్రగతిలో దూసుకెళ్తోందని మోడీ చెప్పారు.

16-10-2025 (గురువారం) ( అన్‌స్టాపబుల్ మోడీ )
జీఎస్టీ 2.0 సంస్కరణలతో దేశ ప్రగతి వేగాన్ని పెంచటంలో ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు సీఎం చంద్రబాబు. సరైన సమయంలో సరైన చోట సరైన నేతగా ప్రధాని స్థానంలో మోడీ ఉన్నారని… ఆయన 21 వ శతాబ్దపు నేత అన్నారు. 11 ఏళ్ల క్రితం 11వ స్థానంలో ఉన్న భారతదేశం ప్రధాని మోడీ సంకల్పంతో ఇప్పుడు 4వ స్థానానికి చేరిందని… వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా 2047కు దేశం సూపర్ పవర్ గా మారుతుందన్నారు సీఎం చంద్రబాబు.

16-10-2025 (గురువారం) ( మరువం మీ సాయం )
ఏపీ అభివృద్ధికి ప్రధాని మోడీ ఎంతో సాయం చేశారన్నారు సీఎం చంద్రబాబు. పరిశ్రమలు, విద్యుత్, రోడ్లు, రైల్వేలు, రక్షణ రంగ ఉత్పత్తులతో పాటు పెట్రోలియం, సహజ వాయువు వంటి కీలక రంగాలను బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు ఉన్నాయన్నారు.

17-10-2025 (శుక్రవారం) ( పనితీరుపై ప్రశంసలు )
ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు, వివిధ శాఖల అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని ఏపీలో నాలుగోసారి జరిపిన పర్యటనలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. కర్నూలులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని.. ఈ సభ మంచి మెసేజ్ ఇచ్చిందన్నారు సీఎం చంద్రబాబు. అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేశాయని.. ప్రధాని సైతం పర్యటనను ఎంతో ఆస్వాదించారని అభినందించారు. శ్రీశైలం మల్లన్న ఆలయం దర్శనంపై ప్రధాని మోడీ ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారన్నారు. నెల రోజుల పాటు చేసిన కార్యక్రమాలపై సమగ్రంగా ఒక పుస్తకాన్ని ప్రచురించాలని సూచించారు సీఎం నారా చంద్రబాబు.

17-10-2025 (శుక్రవారం) ( విజేతలతో సీఎం భేటీ)
జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థినీ విద్యార్థులను సీఎం చంద్రబాబు కలిశారు. విజేతలను అభినందించి వారికి ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా కాసేపు వారితో ముచ్చటించారు. సంస్కరణలను ఇప్పుడు అమలుచేస్తే కొన్నిరోజుల తర్వాత ఆ ఫలితాలు ప్రజలకు అందుతాయని సీఎం వారికి తెలిపారు. జీఎస్టీ లాంటి సంస్కరణలను అర్థం చేసుకుని వాటిపై పోటీల్లో పాల్గొనడం.. విజేతలుగా నిలవడం బాగుందన్నారు.

17-10-2025 (శుక్రవారం) ( గనులశాఖపై సమీక్ష)
గనులశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానంపైనా చర్చించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గనుల శాఖ ద్వారా 3 వేల 320 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గతం కంటే 34 శాతం మేర అదనంగా గనులశాఖ నుంచి ఆదాయం వస్తోందన్నారు. మాంగనీస్‌ లాంటి మేజర్‌ ఖనిజాలతో 72 శాతానికి పైగా అదనపు ఆదాయం వస్తోందని సీఎంకు వివరించారు. ఒడిశా లాంటి రాష్ట్రాల్లో వాల్యూ ఎడిషన్ ద్వారా ఎక్కువగా ఆదాయాన్ని పొందుతున్నారని 50 వేల కోట్ల ఆదాయం ఖనిజాల నుంచే వస్తోందని తెలిపారు. ఏపీలోనూ అందుకు తగిన విజన్ ప్లాన్ తయారుచేసి విలువ జోడిస్తే 20 నుంచి 30 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు.

18-10-2025 (శనివారం) (ఉద్యోగులకు దీపావళి కానుక )
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఉద్యోగులకు ఒక విడత డీఏ రిలీజ్ చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు క్లియర్ చేయాలని ఆదేశించారు. 4వ తరగతి ఉద్యోగుల గౌరవాన్ని మరింత పెంచేలా రీ డెసిగ్నేట్ చేస్తామన్నారు.180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామన్నారు సీఎం చంద్రబాబు.

18-10-2025 (శనివారం) ( సీఎంకు ఆహ్వానం )
కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు రావాలని సీఎం చంద్రబాబును ఆహ్వానించారు హజ్రత్ కేఎస్ఎస్ హరిఫుల్లా హుస్సేనీ. ఈ ఉర్సు మహోత్సవాలు వచ్చే నెల 5 నుంచి 10 వరకు జరగనున్నాయి.

19-10-2025 (ఆదివారం) ( సీఎం వీడియో కాన్ఫరెన్స్ )
విశాఖలో నవంబరు 14,15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన విశాఖ భాగస్వామ్య సదస్సు నిర్వహణపై సమావేశంలో చర్చించారు. ఈ సదస్సుపై ఇప్పటికే దేశ విదేశాల్లోని వివిధ నగరాల్లో రోడ్ షోలు నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. విశాఖ పెట్టుబడుల సదస్సుకు హాజరు కావాలని పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం పలికారు. కేవలం రాష్ట్రానికి పెట్టుబడుల కోసమే కాకుండా నాలెడ్జ్ షేరింగ్, లాజిస్టిక్స్, టెక్నాలజీ లాంటి రంగాల్లో విధానాలపై ఉన్నత స్థాయి చర్చలకు సదస్సు వేదిక కావాలన్నారు సీఎం చంద్రబాబు.

19-10-2025 (ఆదివారం) ( దీపావళి వేడుకల్లో సీఎం)
దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. సొసైటీ ఫర్‌ వైబ్రెంట్‌ విజయవాడ ఆధ్వర్యంలో పున్నమిఘాట్‌ వద్ద దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రజలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఈ దీపావళి అందరి జీవితాల్లో చీకటిని పారద్రోలి వెలుగులు నింపాలన్నారు సీఎం.

Story By Vamshi Krishna, Bigtv

Related News

AP CM Chandrababu: చిరు వ్యాపారులను కలిసిన సీఎం చంద్రబాబు.. జీఎస్టీ సంస్కరణ ఫలితాలపై ఆరా

AP Heavy Rains: ఈ నెల 21నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు

CM Chandrababu: దీపావళి వేళ మరో గుడ్‌న్యూస్ చెప్పిన.. ఏపీ సీఎం చంద్రబాబు

Jogi Ramesh: నన్ను జైలుకు పంపాలని టార్గెట్.. బాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు

Target Pavan: టార్గెట్ పవన్.. జనసేనను బలహీన పరిచే కుట్ర..!

Nara Lokesh Australia Visit: ఏపీ క్లస్టర్‌లలో ఆస్ట్రేలియా పెట్టుబడుల కోసం.. మంత్రి లోకేష్ విజ్ఞప్తి

Digital Arrest Scam: ఎమ్మెల్యేకే బురిడీ..! రూ.1.07 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

Big Stories

×