E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం టీవీ సీరియల్స్ రేటింగ్స్.. టాప్ లో కొత్త సీరియల్..?

Telugu TV Serials: ఈ వారం టీవీ సీరియల్స్ రేటింగ్స్.. టాప్ లో కొత్త సీరియల్..?
Advertisement

Telugu TV Serials TRP Ratings : తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా చూస్తున్నా వాటిలో ఎక్కువ వినోదాన్ని అందించేది సీరియల్స్.. ఒకప్పుడు తెలుగు సీరియల్స్ అంటే బోరింగ్ గా అనిపించేది. కానీ ఈ మధ్య మాత్రం సినిమాలను మించిన ట్విస్టులు సీరియల్స్ లో కనిపించడంతో ఎక్కువ మంది వీటిని చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. ముఖ్యంగా స్టార్ మా లో ప్రసారమవుతున్న కొత్త సీరియల్స్ జనాలను ఎంతగా ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు ఉదాహరణ ఆ సీరియల్స్ కి వస్తున్న టిఆర్పి రేటింగే.. గత వారంతో పోలిస్తే ఈవారం టిఆర్పి రేటింగ్ దారుణంగా పడిపోయింది అని తెలుస్తుంది.. పాత సీరియస్ తో పోలిస్తే కొత్త సీరియల్స్ దూసుకుపోతున్నాయి. మరి ఈవారం ఏ సీరియల్ టాప్ లోకి వచ్చిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

కార్తీక దీపం 2.. 

బుల్లితెర హీరో నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాధ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్లాక్ బస్టర్ సీరియల్ కార్తీకదీపం. ప్రేక్షకుల మనసు దోచుకున్న సీరియల్స్ లో మొదటిగా గుర్తొచ్చే పేరు ఈ సీరియల్. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా కార్తీకదీపం 2 ప్రసారమవుతుంది.  ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఇదే టాప్ పొజిషన్ లో ఉంది. 12.50 రేటింగ్ తో దూసుపోతుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు.. 

Advertisement

స్టార్ మా లో ప్రసారమవుతున్న మరో సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు.. కుటుంబంలోని మనుషుల మధ్య ప్రేమానురాగాలు, ద్వేషాలు ఎలా ఉంటాయో అనేది ఈ సీరియల్ లో చూపించారు. రీసెంట్ గా ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. కార్తీకదీపం 2 తర్వాత ఈ సీరియల్ రెండో స్థానంలో కొనసాగుతుంది.. దీని రేటింగ్ విషయానికొస్తే.. తాజాగా 12.36 రేటింగ్ నమోదైంది.

గుండెనిండా గుడిగంటలు.. 

స్టార్ మా లో ప్రసారం అవుతున్న మరో సక్సెస్ఫుల్ సీరియల్ గుండెనిండా గుడిగంటలు. బాలు మీనాలా ప్రేమ కథ.. డబ్బుల కోసం ప్రభావతి చేస్తున్న ప్రయోగాలు. మధ్యతరగతి కుటుంబానికి కోటీశ్వరులు కావాలని కొందరి ఆలోచనలు కుటుంబంలో తెచ్చే చికాకులను కళ్ళకు కట్టినట్టు చూపించారు.. ఇప్పుడు కాస్త ఈ సీరియల్ మరోసారి ఇంట్రెస్టింగ్గా మారింది. దాంతో రేటింగ్ కూడా బాగానే పెరుగుతూ వస్తుంది. రేటింగ్ విషయానికి వస్తే.. 12.28 ఉందని తెలుస్తుంది.

ఇంటింటి రామాయణం.. 

Advertisement

స్టార్ మా ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా చూస్తున్న కుటుంబ కథా సీరియల్స్లలో ఇంటింటి రామాయణం కూడా ఒకటి.. టైటిల్ కి తగ్గట్లే సీరియల్ లోని పాత్రలు కూడా ఉంటాయి. ఈ సీరియల్ రేటింగ్ లో నాల్గో స్థానంలో కొనసాగుతుంది.. ఆ సీరియల్ కు 11.30 రేటింగ్ వచ్చింది.. అందరు కలిసి పోవడంతో రేటింగ్ కూడా బాగా పెరిగింది..

Also Read : సోమవారం టీవీల్లోకి రాబోతున్న మూవీస్.. అస్సలు మిస్ అవ్వకండి..

కొత్త సీరియల్ ఎక్కువగా టాప్ రేటింగ్ తో దూసుకుపోవడం మామూలు విషయం కాదు.. గత ఏడాదిగా టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న స్టార్ మా సీరియల్ గుండెనిండా గుడిగంటలు సీరియల్ కాస్త పెరిగింది. అలాగే ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా రేటింగ్ పెరిగింది. నిండు మనసులో సీరియల్నినిన్ను మనసులు సీరియల్ ఈమధ్య ప్రసారమవుతుంది. మిగిలిన సీరియల్స్ విషయానికొస్తే.. నిండు మనుసులు 9.2 రేటింగ్ అందుకుంది. తాజా రేటింగ్స్ లో నిన్ను కోరి 8.49తో ఏడో స్థానానికి దూసుకురావడం విశేషం. 6.23 రేటింగ్ తో నువ్వుంటే నా జతగా సీరియల్ 8వ స్థానంలో.. 6.19 తో పలుకే బంగారమాయెనా 9వ స్థానంలో నిలిచింది. ఇకపోతే ఇవే కాదు ఇంకా కొన్ని సీరియల్స్ ఇప్పుడిప్పుడే టిఆర్పి రేటింగ్ ని పెంచుకుంటున్నాయి. కేవలం స్టార్ మా చానల్స్ లో మాత్రమే కాదు అటు జీ తెలుగులో కూడా కొన్ని సీరియల్స్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి..

 

Related News

డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

బిగ్ బాస్ 10లోకి అడుగుపెడుతున్న దేబ్జానీ మోదక్.. ఆమె బ్యాక్ గ్రౌండ్, రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్.. టైమింగ్స్ లో భారీ మార్పు!

Gundeninda Gudigantalu Balu : బిగ్ బాస్ లోకి బాలు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ అంతా..?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి కండీషన్.. మీనా, బాలు హ్యాపీ.. ప్రభకు కొత్త టెన్షన్..

Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో ప్రేమ.. వల్లి మళ్లీ పుల్లేట్టేసింది.. ప్రేమ మారుతుందా..?

Big Stories

Advertisement
×