E-Paper
Advertisement

వేణుమాధవ్ తో నాకున్న బంధం అదే.. ఆఖరి రోజుల్లో ఏం అన్నాడంటే – ఉదయభాను

వేణుమాధవ్ తో నాకున్న బంధం అదే.. ఆఖరి రోజుల్లో ఏం అన్నాడంటే – ఉదయభాను
Advertisement

Udaya Bhanu:ఒకప్పుడు అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న యాంకర్ ఉదయభాను (Udayabhanu) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అప్పట్లో యాంకర్ అంటే ఉదయభాను పేరు ఎక్కువగా వినిపించేది. సినిమా ఈవెంట్ అయినా.. బుల్లితెర షో అయినా.. ఏదైనా సరే హ్యాండిల్ చేస్తూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది . ముఖ్యంగా కొన్ని కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు కూడా పోషించిన ఈమె.. సడన్గా ఇండస్ట్రీకి దూరమైంది. మధ్యలో అడపాదడపా కనిపించినా మళ్లీ మునుపటి వైభవాన్ని ఆమె అందుకోలేకపోయింది. దాంతో నటనకు గుడ్ బాయ్ చెప్పి కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఉదయభాను అనూహ్యంగా నిర్మాతగా మారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

వేణుమాధవ్ తో ప్రత్యేక అనుబంధం..

పంచనామా అనే వెబ్ సిరీస్ ను నిర్మించి, నిర్మాతగా తొలి ప్రయత్నం లోనే సక్సెస్ అయ్యింది ఉదయభాను. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ .. ఎన్నో విషయాలను పంచుకుంటున్న ఆమె అందులో భాగంగానే సహనటుడు వేణుమాధవ్ తో ఉన్న అనుబంధాన్ని చెబుతూనే.. మరొక పక్క దివంగత నటుడు వేణుమాధవ్ చివరి రోజుల్లో తనతో ఏం చెప్పారు అన్న విషయాలను కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. ఉదయభాను మాట్లాడుతూ..” వేణుమాధవ్ నన్ను చిన్నప్పటినుంచి చూసాడు. నా బలహీనతలు, భావోద్వేగాలు ఆయనకు బాగా తెలుసు. ఇతరులతో అల్లరిగా ఉన్నా.. నోటి దురుసుగా ప్రవర్తించినా.. నాతో మాత్రం ఎప్పుడు మర్యాదపూర్వకంగానే ప్రవర్తించేవాడు.

చెప్పిన మరుసటిరోజే మృతి..

Advertisement

మేమిద్దరం వన్స్ మోర్ ప్లీజ్ అనే కార్యక్రమం చేసాము. ఇక ఆ సమయంలో మా ఇద్దరి మధ్య స్నేహబంధం మరింత పెరిగింది. ఇక వేణుమాధవ్ ఆఖరి రోజుల్లో అనారోగ్యంతో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి.. అంతా అబద్ధం.. నేను ఆరోగ్యంగా ఉన్నాను.. దయచేసి నమ్మొద్దు అని చెప్పారు. అయినా సరే అతడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని దయచేసి ఆరోగ్యం కాపాడుకో అని చెప్పాను. ఆ మరుసటి రోజే వేణుమాధవ్ మరణ వార్త విని ఆశ్చర్యపోయాను. పరిశ్రమకు ఆయన మరణం తీరని లోటు” అంటూ ఉదయభాను ఎమోషనల్ అయ్యారు. ఇక ఉదయభాను చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ఒక గొప్ప హాస్యనటుడు నేడు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి.

ALSO READ: బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన ‘గబ్బర్ సింగ్’ రమేష్.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే?

మంచితనానికి కేరాఫ్ అడ్రస్ రాకేష్ మాస్టర్..

Advertisement

అలాగే దివంగత డాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ గురించి కూడా ఆమె ప్రస్తావించారు.” ఢీ డాన్స్ షో సమయంలో నేను చూసిన రాకేష్ మాస్టర్ మంచితనానికి , డాన్స్ కి కేరాఫ్ అడ్రస్. అయితే ఆ తర్వాత కాలంలో యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఆయన జీవితం వేరే మలుపు తీసుకుంది. ఆయన చాలా కష్టజీవి. తన దగ్గర ఏమీ లేకపోయినా ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి.. ఆస్తులు, సంపాదన అన్నీ కూడా ఇతరుల కోసమే ఖర్చు పెట్టారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆయన జీవితం మలుపులు తిరిగినప్పటికీ ఆయనలోని మంచితనం మారలేదు. అది ఆయన చివరి శ్వాస ఉన్నంతవరకు అలాగే కొనసాగింది అంటూ ఉదయభాను గుర్తు చేసుకుంది. మొత్తానికి అయితే ఒకప్పటి లెజెండ్రీ యాంకర్ ఇప్పుడు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. ఇలా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటోంది.

Related News

పొలిటికల్ ఎంట్రీ పై ఉదయభాను క్లారిటీ… పోరాటం చేయాల్సిందే అంటూ!

ఆ హీరోలకు, బాలయ్యకు మధ్య ఉన్న తేడా అదే – ఉదయభాను

నంది అవార్డుకు కులం అడ్డొచ్చిందా? ఇండస్ట్రీ పాలిటిక్స్ పై ఉదయభాను కామెంట్స్!

మహా నెలకు అంత సంపాదిస్తుందా..? సీరియల్ కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి వార్నింగ్.. శృతి ఫుల్ హ్యాపీ.. బాలుకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణను ఇంటికి రమ్మన్న కార్తీక్         

Podarillu Today Episode : చక్రీ రియల్లీ గ్రేట్.. డ్యాన్స్ తో రచ్చ.. పాపం పెద్దోడు..

Big Stories

Advertisement
×