E-Paper
Advertisement

iPhone 18 Proలో లేనివి ఫోల్డబుల్‌లో ఎందుకు? యాపిల్ చేసిన ఈ 5 ప్రయోగాలు మైండ్ బ్లోయింగ్!

iPhone 18 Proలో లేనివి ఫోల్డబుల్‌లో ఎందుకు? యాపిల్ చేసిన ఈ 5 ప్రయోగాలు మైండ్ బ్లోయింగ్!
Advertisement

Apple iPhone Duo: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ తొలిసారి ఫోల్డబుల్ ఐఫోన్‌ను ఆవిష్కరించింది. iPhone Duo పేరుతో వచ్చిన ఈ ఫోన్‌.. సాధారణ ఐఫోన్‌కు భిన్నంగా మడిచే డిజైన్‌తో పాటు పెద్ద స్క్రీన్ అనుభవాన్ని అందిస్తుంది. మడిచినప్పుడు ఫోన్‌లా.. పూర్తిగా తెరిచినప్పుడు చిన్న టాబ్లెట్‌లా ఉపయోగించుకోవచ్చు. 7.6 అంగుళాల లోపలి డిస్‌ప్లేతో వచ్చిన ఈ ఫోన్‌లో iPhone 18 Proలో లేని కొన్ని ప్రత్యేక ఫీచర్లు కూడా ఉన్నాయి.

మడిచే డిజైన్..

iPhone Duo పుస్తకం మాదిరిగా మధ్యలో మడుచుకునేలా రూపొందించారు. టైటానియం బాడీ, కొత్త హింజ్‌తో నిర్మాణం బలంగా ఉండేలా చేశారు. స్క్రీన్‌పై మడత కనిపించే ప్రభావాన్ని కూడా తగ్గించారు. దీనికి IP68 రేటింగ్ ఉండటంతో దుమ్ము, నీటి నుంచి రక్షణ లభిస్తుంది. ఫోన్‌ను మడిచినప్పుడు ఒక స్క్రీన్‌లోని యాప్ మరో స్క్రీన్‌కు స్మూత్‌గా మారే యానిమేషన్లు కూడా ఆకట్టుకుంటాయి.

క్లియర్ స్క్రీన్..

Advertisement

లోపలి డిస్‌ప్లేలో ప్రత్యేకమైన మ్యాట్ ఫినిష్ అందించారు. దీని వల్ల బయట ఎక్కువ వెలుతురు ఉన్నప్పటికీ గ్లేర్ తగ్గుతుంది. స్క్రీన్‌పై మడత కూడా తక్కువగా కనిపించేలా ఇది సహాయపడుతుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. లోపలి FaceTime కెమెరాను స్క్రీన్ కింద పెట్టారు. దీంతో నాచ్ లేదా ప్రత్యేక కెమెరా కటౌట్ లేకుండా డిస్‌ప్లే క్లీన్‌గా కనిపిస్తుంది.

Also Read: కీప్యాడ్ ఫోన్‌లో ఇలాంటి ఫీచర్లు అరుదే.. 2500mAh బ్యాటరీతో iTel Music 450L లాంచ్!

కొత్తగా iOS..

Advertisement

పెద్ద స్క్రీన్‌కు అనుగుణంగా iOS అనుభవాన్ని కూడా మార్చారు. ఒకేసారి రెండు యాప్‌లను పక్కపక్కనే ఉపయోగించుకోవచ్చు. ఫోన్‌ను సగం మడిచి స్టాండ్‌లా పెట్టి వీడియోలు చూడటం వంటి పనులు కూడా చేయొచ్చు. Apple Pencil సపోర్ట్ కూడా అందుబాటులోకి రానుంది. ఫోన్‌ను ఏ పొజిషన్‌లో ఉపయోగిస్తున్నామో దానికి అనుగుణంగా యాప్‌ల లేఅవుట్ మారుతుంది.

కెమెరా ఫీచర్లు..

కెమెరా విషయంలోనూ iPhone Duoలో కొన్ని కొత్త ఫీచర్లు ఉన్నాయి. Smart Take ద్వారా టైమర్ అవసరం లేకుండా పోజ్‌ను గుర్తించి ఫొటో తీయొచ్చు. Duo Previewతో ఫొటో తీసుకునే ముందు ఫ్రేమ్‌ను బయట స్క్రీన్‌పై చూడవచ్చు. పిల్లలు కెమెరా వైపు చూసేలా Kid Cue యానిమేషన్లు ఉపయోగపడతాయి.

వీడియో కాల్స్ అనుభవం..

Duo FaceTimeతో బయట స్క్రీన్‌ను ఉపయోగించి వీడియో కాల్ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుకోవచ్చు. మొత్తంగా ఐఫోన్ డ్యూయో కేవలం మడిచే ఐఫోన్ మాత్రమే కాదు. పెద్ద స్క్రీన్, కొత్త iOS అనుభవం, ఫోల్డబుల్ డిజైన్‌కు అనుగుణంగా రూపొందించిన కెమెరా ఫీచర్లతో ఇది కొత్త తరహా ఐఫోన్ అనుభవాన్ని అందించేలా ఉంది. భారత్‌లో అక్టోబర్ 23 నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.

Also Read: బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు.. Moto Buds 2 Fusion ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు!

Tags

Related News

టైటాన్ మీదకు మీ పేరు.. నాసా నుంచి బోర్డింగ్ పాస్ కూడా, ఈ ఛాన్స్ మిస్ కావద్దు!

జియో సెన్సేషనల్ ప్లాన్.. జస్ట్ రూ.84తో నెల మొత్తం సిమ్ యాక్టివ్.. బడ్జెట్ సేవ్ చేసుకోండిలా!

వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్..నంబర్,తేదీపై ట్యాప్ చేస్తే చాలు షార్ట్‌కట్లు ఓపెన్!

కళ్లు చెదిరే ఫీచర్లతో..కొత్త గోబోల్ట్ ఇయర్ బడ్స్ లాంచ్

ప్రీమియం లెదర్ లుక్‌తో నాయిస్ బడ్స్..ఫీచర్లకు ఫిదా అవ్వాల్సిందే!

వాచ్‌తో ECG తీసి డాక్టర్‌కు రిపోర్ట్ పంపొచ్చు.. భారత్‌లోకి వచ్చిన గార్మిన్ కొత్త ఫీచర్ ఇదే!

బోట్ నుంచి అదిరిపోయే పవర్ బ్యాంక్ లాంచ్..ఒకే సారి 4 గాడ్జెట్లకు ఛార్జింగ్

Jio vs Airtel.. కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లలో దేనివి బెస్ట్? సూటిగా సుత్తిలేకుండా!

Big Stories

Advertisement
×