Udayabhanu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యాంకర్ అంటే ఒకానొక సమయంలో ఉదయభాను పేరు గుర్తుకు వచ్చేది. ఈమె గతంలో బుల్లితెరపై ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలకు యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే కొన్ని కారణాల వల్ల అవకాశాలను క్రమక్రమంగా కోల్పోతూ వచ్చారు. ఇలా ఉదయభాను కేవలం యాంకర్ గా మాత్రమే కాకుండా నటిగా పలు సినిమాలలో నటించి సందడి చేశారు. ఇలా ఇండస్ట్రీకి ఇటీవల కొంత గ్యాప్ ఇచ్చిన ఈమె తాజాగా నిర్మాతగా రీఎంట్రీ ఇచ్చారు.
ఉదయభాను ప్రొడక్షన్ హౌస్ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తన నిర్మాణ సంస్థలో ఈమె పంచనామ(Panchanaama) అనే వెబ్ సిరీస్ ను నిర్మించారు. ఇటీవల ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఉదయభాను వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఏ విషయం గురించి అయినా నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్నటువంటి ఉదయభాను రాజకీయాలలో(Politics)కి వస్తున్నారా అనే ప్రశ్న ఎదురయింది.
ఇలా పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రశ్నలు ఎదురవడంతో ఉదయభాను ఈ విషయంపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. తనకు గతంలోనే ఒక పార్టీ నుంచి బిగ్ ఆఫర్ వచ్చిందని తెలిపారు. రాజకీయాలలోకి రమ్మని మీకు ఏ నియోజకవర్గంలో కావాలంటే అక్కడ టికెట్ ఇస్తామని చెప్పారు కానీ నా ముందు ఒక నెంబర్ పెట్టి అంత డబ్బు మీ దగ్గర ఉంటేనే మీరు ఎక్కడ కోరితే అక్కడ టికెట్ ఇస్తామని, మరి ఆ డబ్బును ఏడాదిన్నరలోపు మీరు సంపాదించుకోవచ్చు అంటూ తనకు ఆఫర్ ఇచ్చినట్లు ఉదయభాను తెలిపారు. అయితే ఆ పార్టీ ఏది అనే విషయాన్ని మాత్రం ఈమె వెల్లడించలేదు.
ఇలా తన ముందు 100 కోట్లకు పైగా డబ్బు ఉంటేనే టికెట్ ఇస్తామని చెప్పగానే నేను షాక్ అయ్యానని అంత డబ్బు నా దగ్గర లేదు కానీ నేను నిజాయితీగా ఏ నియోజకవర్గంలో అయినా మీకు మద్దతు తెలపమంటే తెలుపుతానని చెప్పానని ఈమె గుర్తు చేసుకున్నారు. ఇలా ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ సాధించాలి అంటే 100 కోట్లు ఉండాల్సిందేనని ఇది బేసిక్ మాత్రమే అని ఉదయభాను తెలిపారు. అయితే భవిష్యత్తులో అయినా తాను రాజకీయాలలోకి వస్తానని అయితే ఏ పార్టీ తరపున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి యుద్ధం చేయాలని ఉంది కచ్చితంగా కొత్త వాళ్ళు రాజకీయాలలోకి వచ్చి పోరాటం చేయాల్సిందేనని ఉదయభాను ఈ సందర్భంగా పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడారు. మరి ఈమె నిజంగానే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారా? లేకపోతే నిర్మాతగానే ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: నంది అవార్డుకు కులం అడ్డొచ్చిందా? ఇండస్ట్రీ పాలిటిక్స్ పై ఉదయభాను కామెంట్స్!