Kaaka Movie : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ బాబి(Bobby) దర్శకత్వంలో “కాకా” (Kaaka)సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాని 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం చిత్ర నిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలకు సంబంధించి అధికారకంగా ప్రకటన కూడా వెలువడింది. సంక్రాంతి పండుగ సందర్భంగా 2027 జనవరి 13వ తేదీ ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.
ఇలా సంక్రాంతి సందర్భంగా చిరంజీవి సినిమా విడుదల కాబోతుందని అందరూ భావించారు కానీ అదే సమయంలో చిరంజీవి (Chiranjeevi)నటించిన విశ్వంభర(Vishwambhara) సినిమా కూడా వచ్చే యేడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీ విడుదల కాబోతుందని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో విడుదల విషయంలో అభిమానులు సందిగ్ధంలో పడ్డారు. తాజాగా కాకా సినిమా విడుదల గురించి నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించారు.
ఇన్ని రోజులపాటు ఈ సినిమా విడుదల గురించి వస్తున్నటువంటి వార్తలన్నింటినీ కొట్టి పారేస్తూ యధావిధిగా 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ “కాకా”రాబోతున్నారని క్లారిటీ ఇచ్చారు. ఇలా సంక్రాంతి రేస్ లో చిరంజీవి కాకా కన్ఫర్మ్ కావడంతో విశ్వంభర పరిస్థితి ఏంటి?అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కూడా యధావిధిగా జనవరి 9వ తేదీ విడుదల అవుతుందా? లేదంటే మరోసారి వెనకడుగు వేస్తుందా? అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక విశ్వంభర విడుదల గురించి ఇప్పటివరకు నిర్మాణ సంస్థ యు.వి ప్రొడక్షన్స్ ఎక్కడ స్పందించలేదు.
Putting all the speculation to rest, #KAAKA is releasing for Sankranthi 2027🔥
Our much anticipated film with Megastar @KChiruTweets Garu and @DirBobby will arrive in cinemas worldwide on JANUARY 13, 2027.
First Single Soon🕺🎶 #KAAKAOnJan13 #KVNProductions pic.twitter.com/0vAHB4ZVPy
— KVN Productions (@KvnProductions) September 17, 2026
డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వంభర సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఈ సినిమాకు సంబంధించి విఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం అయిన నేపథ్యంలో విడుదల కూడా ఆలస్యం అవుతూ వస్తుంది. ఇటీవలే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డీల్ కూడా పూర్తి అయిందని, త్వరలోనే విడుదలకు సంబంధించి అధికారక ప్రకటన రాబోతోందని సమాచారం. ఇక కాకా సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ బాబి డైరెక్షన్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాకా పై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఒక భారీ సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం.
Also Read: సెన్సార్ బోర్డు పునర్వ్యవస్థీకరణ.. CBFCలో చోటు దక్కించుకున్న సుప్రియ యార్లగడ్డ