Nindu Nurella Savasam: ప్రముఖ తెలుగు ఛానల్ జీ తెలుగులో సీరియల్స్ కి కొదవలేదు. ఒక దానిని మించిన స్టోరీ తో మరొకటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మిగతా చానల్స్ లలో పోలిస్తే ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న సీరియల్స్ కు గ్రాఫిక్స్ తో పాటు అదిరిపోయే స్టోరీ కూడా ఉండడంతో ఎక్కువమంది ఈ స్టోరీలను చూసేందుకు ఆసక్తి కనబరిస్తున్నారు. సినిమాలను మించిన లెవల్లో ఇందులో ప్రతి సీరియల్ స్టోరీ ఉంటుంది. జీ తెలుగులో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో నిండు నూరేళ్ల సహవాసం ఒకటి. ఈ సీరియల్లో ఆరు పాత్ర ప్రముఖమైనది.. ఈ పాత్రలో పల్లవి గౌడ నటించింది. ఈమె సీరియల్ లో చనిపోయిన సరే తన ఆత్మ తన వాళ్ళని కాపాడుకోవడానికి ఆ ఇంటిలోనే ఉంటుంది. ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న అంశం. పల్లవి గౌడ రియల్ లైఫ్ విషయానికి వస్తే ఎన్నో సీరియల్స్లలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈమె ఒక్కో సీరియల్కు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసుకుందాం..
మేజర్ అమర్ భార్య అరుంధతి పాత్రలో పల్లవి గౌడ నటించింది. మరణం తరువాత మేజర్ అమర్ ఒంటరివాడైపోతాడు. పిల్లలతో సహా కొడైకెనాల్ నుండి సికింద్రాబాదుకు చేరిన అమర్, స్నేహితురాలు మనోహరి సాయంతో పిల్లల్ని చూసుకుంటాడు.. మనోహరి మంచిది కాదు అని తెలుసుకొని తన పిల్లల్ని కాపాడుకోవడానికి ఆత్మగా ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది.. ఈ సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో నటించిన పల్లవి గౌడ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. గతంలో ఎన్నో సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది.. అయితే సీరియల్స్ కి కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్న ఈమె ఇప్పుడు మళ్లీ వరుసగా సీరియల్స్లలో బిజీ అవుతుంది.. ప్రస్తుతం పల్లవి ఒక్కో సీరియల్ కి 35000 వసూల్ చేస్తుందని టాక్.. ఈ లెక్కను చూస్తే నెలకు బాగానే సంపాదిస్తుంది..
పల్లవి గౌడ హీరోయిన్ లా బాగా అందంగా ఉంటుంది. కానీ బుల్లితెరకు మాత్రమే పరిచయం అయ్యింది. బుల్లితెరపై ప్రసారమైన సక్సెస్ఫుల్ సీరియల్ పసుపు కుంకుమ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సీరియల్ ప్రేక్షకధారణ పొంది 500 ఎపిసోడ్ లకు పైగా ప్రసారమైంది. ఇందులో ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత పల్లవి బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ కొన్ని కారణాలవల్ల బుల్లితెర ఇండస్ట్రీకి దూరమైంది. మళ్లీ ఇప్పుడు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తో రియంట్రీ ఇచ్చింది. ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌లో పల్లవి గౌడ అరుంధతి మరియు అనూషిక అనే రెండు పాత్రలను పోషించారు.. ఈ సీరియల్ ద్వారా మరోసారి తన టాలెంట్ నిరూపించుకుంది. ఆమె పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇకపోతే తెలుగు తో పాటు పల్లవి కన్నడ మరియు తమిళ భాషల్లో కూడా పలు సీరియల్స్‌లో నటించారు.. ఈమధ్య బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ ఈవెంట్లో కూడా ఈమెయిల్ సందడి చేస్తూ వస్తుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.