Gundeninda GudiGantalu Today episode October 26 th: నిన్నటి ఎపిసోడ్ లో.. అందరూ బాలుని అనడంతో బాలు కన్నీళ్లు పెట్టుకుంటాడు.. శృతి బెడ్ రూమ్ లోకి వెళ్ళగానే రవితో గొడవ పెట్టుకుంటుంది. మీ అన్నయ్య ఎలా మాట్లాడాడో చూసావా. మా అమ్మకి కనీసం మర్యాద కూడా ఇవ్వలేదు. అసలు మీ అన్నయ్య గురించి నీకు తెలుసు కదా ఎలా మాట్లాడుతున్నాడో. అంటూ సీరియస్ గా బాలుని తిడుతూ ఉంటుంది. దానికి రవి మన ఇంట్లో విషయాలు మీ అమ్మకు ఎందుకు చెప్తున్నావ్ ఏదైనా చెప్పేదానికి రవి మన ఇంట్లో విషయాలు మీ అమ్మకు ఎందుకు చెప్తున్నావ్ ఏదైనా చెప్పే ముందు ఆలోచించాలి అని నీకు అర్థం కాదా అని రవి శృతి పై సీరియస్ అవుతాడు.
మీనా బాలుని అందరు అనడంతో బాధపడుతూ ఉంటుంది.. ఆయన నోటికి అదుపు లేదు అందరూ తలా ఒక మాట అనేసారని మీనా ఏడుస్తూ ఉంటుంది.. మీనా దగ్గరికి వెళ్లిన సత్యం వాడు ఎక్కడికెళ్లాడమ్మా వాడిని నేను కావాలని కొట్టలేదు. ఎక్కడ గొడవ పెట్టుకుని అనంతపని చేస్తాడు అని కొట్టాను అని మీనాతో నిజం చెప్పేస్తాడు.. వాడి మనసేంటో నాకు తెలుసు నా మీద ఈగ పడిన వాడు తట్టుకోలేడు అని సత్యం అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. తన తండ్రిని తక్కువ చేసి మాట్లాడినందుకు శృతి వాళ్ళ అమ్మని కొట్టాలని అంత కోపం ఉందంటూ బాలు రాజేష్తో అంటాడు.. నేను ఈ బాధను భరించలేకపోతున్నాను రా ఖచ్చితంగా మందు తాగాల్సిందే అని ఇద్దరు కలిసి మందు తాగుతారు. అక్కడ ఆవిడ అన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నా సరే ఎవరు ఏమి అనలేదు. మా నాన్నని అనే లోపల నేను అస్సలు ఊరుకోలేకపోయాను. కోపంతో అన్నాను సరే నన్ను అందరూ అర్థం చేసుకోకుండా అంటారేంటి అని బాలు కన్నీళ్లు పెట్టుకుంటాడు. వాళ్లందరూ అన్నందుకు నాకు బాధ లేదురా మా నాన్న నన్ను అర్థం చేసుకోకుండా కొట్టినందుకు నాకు బాధగా ఉంది తట్టుకోలేకపోతున్నాను అని బాలు మందు తాగుతాడు.
మందు అయిపోయింది ఇంకొక బాటిల్ తీసుకురారా అని బాలు అంటాడు. ఇలా తాగుతూ వెళ్తే డ్రైవింగ్ ఎవరు చేస్తారు అని రాజేష్ ఇంక చాలు రాని అంటాడు.. రాజేష్ బాలుని ఇంటిదగ్గర దిగబెడతాడు. మీనా బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తాగొచ్చారా ఆకలేస్తుంది అనుకుంటా అన్నం పెడతాను రండి అని అంటుంది. మిమ్మల్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు కానీ మీరు మాత్రం అందరినీ అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మీకు లేని దురద ఉంది కాబట్టే అన్నిట్లోనూ వేలు పెడతారు ఆవిడన్న మాటలకి నాకు కూడా కోపం వచ్చింది అని మీనా అనగానే బాలు ఈ ఇంట్లో నన్ను ఒక్కదానివే అర్థం చేసుకున్నావు.. అందుకే మీనా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని బాలు అంటాడు.
Also Read:బిగ్ బాస్ లోకి వాళ్లు రీ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ బాబోయ్..!
సరే మీరు అన్నం తిన్నారా లేదో నేను వెళ్లి మీకు అన్నం తీసుకుని వస్తానని మీనా లోపలికి వెళ్ళగానే.. బాలు పడిపోతూ ఉంటే సత్యం వచ్చి పట్టుకుంటాడు. ఏంట్రా తాగొచ్చావా అని అంటాడు. నేను బాధతోనే తాగానని చెప్పు మీనా.. కావాలని తాగలేదు అని బాలు మీనాతో అంటాడు. ఎందుకురా ఇలా చిన్న విషయాలని పట్టించుకోని నీలో నువ్వే మదన పడిపోతూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు అని సత్యం అంటాడు. అప్పుడే వీళ్లిద్దరి మాటలు విన్న ఇంట్లోని వాళ్ళందరూ కిందకి వస్తారు. మళ్లీ బాలు తాగొచ్చాడు అని అనగానే మీనా పెద్ద క్లాస్ పీకుతుంది. శృతి తో పాటుగా ప్రభావతి అందరు ఒక్కసారి షాక్ అవుతారు.. మీనా తన భర్తకు సపోర్ట్ చేస్తూ అందరిని కడిగి పడేస్తుంది. అక్కడితో ప్రోమో పూర్తి అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…