BigTV English

A Blow To Google’s Supremacy:- గూగుల్ ఆధిపత్యానికి గట్టి దెబ్బ.. బింగ్‌కు మాత్రమే అవకాశం ఇస్తామంటున్న శాంసంగ్

A Blow To Google’s Supremacy:- గూగుల్ ఆధిపత్యానికి గట్టి దెబ్బ.. బింగ్‌కు మాత్రమే అవకాశం ఇస్తామంటున్న శాంసంగ్

A Blow To Google’s Supremacy:- గూగుల్ తల్లి గురించి చెప్పాల్సిన పని లేదు. ఏం తెలియకపోయినా ఫస్ట్ సెర్చ్ చేసేది గూగుల్‌‌లోనే. కాని, ఇకపై ఈ పొజిషన్ బింగ్ ఆక్రమించబోతోంది. ఆస్క్ బింగ్ అని అందరూ మాట్లాడుకునే రోజులు రాబోతున్నాయి. దీనంతటికీ కారణం చాట్ జీపీటీనే. మైక్రోసాఫ్ట్ తయారుచేసిన బింగ్.. చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రాబోతోంది. గూగుల్ కూడా ఏఐ విషయంలో బాగానే రీసెర్చ్ చేస్తోంది. చాట్ బార్డ్ పేరుతో మొన్న కొన్ని ప్రయోగాలు కూడా చేశారు. కాని, ఏం చేసినా మైక్రోసాఫ్ట్ చాట్ జీపీటీతో మాత్రం.. గూగుల్ చాట్ బార్డ్ పోటీ పడలేకపోతోంది. చాటా జీపీటీ స్థాయికి చేరుకోవాలంటే.. గూగుల్‌కు చాలా సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.


కస్టమర్లను రిటైన్ చేసుకోడానికి మొబైల్ ఫోన్ కంపెనీలు కాంప్రమైజ్ కావడం లేదు. ఇంకా సెర్చ్ ఇంజిన్ గా గూగుల్‌నే పెడితే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా వెనకబడిపోతామన్న భావనలో ఉన్నాయి కంపెనీలు. అందుకే, గూగుల్‌ను తీసేసి, మైక్రోసాఫ్ట్ బింగ్‌ను ప్రవేశపెట్టాలనుకుంటున్నాయి. ఈ రేసులో శాంసంగ్ ఫస్ట్ స్టెప్ తీసుకోబోతోంది. యాపిల్ కంపెనీ కూడా ఇదే దారిలో నడుస్తోంది.

కొన్ని కంపెనీలు సైతం తమ ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో గూగుల్‌ స్థానంలో మైక్రోసాఫ్ట్‌కు చెందిన సెర్చింజన్‌ బింగ్‌ ప్రవేశపెట్టాలని చూస్తున్నాయి. ఇదే జరిగితే గూగుల్ ఆధిపత్యానికి చెక్ పడినట్టే. అంతేకాదు.. గూగుల్‌కు వేల కోట్ల రూపాయల నష్టం తప్పదు.


ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ ప్రకారం.. 2022లో శాంసంగ్‌ 26.1 కోట్ల స్మార్ట్‌ఫోన్లను సరఫరా చేసింది. ఇవన్నీ గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా పనిచేస్తాయి. ఇప్పుడు బింగ్‌ ను డిఫాల్ట్‌ సెర్చింజన్‌గా ఇవ్వడంపై ప్రస్తుతం చర్చలు జరుపుతోంది. ఒకవేళ శాంసంగ్ గనక గూగుల్ వదిలేసి మైక్రోసాఫ్ట్ బింగ్ కు వెళ్లాలని నిర్ణయించుకుంటే.. గుగూల్‌కు 23 బిలియన్ డాలర్ల నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. 

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Big Stories

×