Big Stories

AP Police Smuggling : స్మగ్లర్ల అవతారం ఎత్తిన ఏపీ పోలీసులు.. తెలంగాణ పోలీసులకు దొరికిపోయిన వైనం

AP police Ganja Smuggling

- Advertisement -

AP Police Smuggling : గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన పోలీసులు.. మీరు చదివేది నిజమే. గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులే పట్టుబడ్డారు. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇది నిజమే. పైగా ఆంధ్ర పోలీసులు స్మగ్లింగ్ చేస్తే.. తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. స్మగ్లర్లను అరెస్ట్ చేయాల్సిన పోలీసులే.. స్మగ్లింగ్ కు పాల్పడటం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం బాచుపల్లిలో ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారని SOT బాలానగర్ పోలీసులకు సమాచారం వచ్చింది.

- Advertisement -

దీంతో.. ఓ మారుతీ కారును పట్టుకుని పరిశీలించగా 11 పాకెట్స్‌లో 22 కేజీల గంజాయి దొరికింది. ఆ వాహనంలో ఉన్న వ్యక్తులను విచారించగా కాకినాడలోని మూడవ బెటాలియన్ APSP చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ అని తెలిసింది. గంజాయి స్మగ్లింగ్‌లో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చనే ఆశతో ఈ అవతారం ఎత్తారు. డ్యూటీకి సిక్ లీవ్స్ తీసుకొని గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. బాచుపల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

“గంజాయికి అడ్డాగా ఏపీ.. విశాఖ మన్యంలో గంజాయి సాగు..” ఇలాంటి వార్తలు రెండేళ్ల క్రితం జాతీయ మీడియాలో కూడా హల్ చల్ చేశాయి. అయితే.. ఏపీ ప్రభుత్వం, పోలీసులు ఆ వార్తలను కొట్టి పారేశాయి. కానీ.. ఈ రోజు వచ్చిన వార్తలను చూస్తే జాతీయ మీడియాలో వచ్చిన కథనాలకు మరింత బలం చేకూరుతోంది. గతంలో కూడా గంజాయి విషయంలో తెలంగాణ, ఏపీ పోలీసులు మధ్య కాల్పులు కూడా జరిగాయి. తాజాగా ఏపీ పోలీసులే స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారన్న వార్తలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. నేరస్తులను పట్టుకోవాల్సిన పోలీసులే స్మగ్లర్ల అవతారం ఎత్తడం ఏంటన్న చర్చ మొదలైంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News