E-Paper
Advertisement

Honour Killing : అనంత లో పరువుహత్య.. మరణశాసనమైన ప్రేమ

Honour Killing : అనంత లో పరువుహత్య.. మరణశాసనమైన ప్రేమ
Advertisement

Honour Killing : దేశంలో రోజురోజుకూ పరువుహత్యల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల తమిళనాడులో కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమపెళ్లి చేసుకుందన్న కోపంతో ఆమె తండ్రే.. ఆ నవదంపతులను పెళ్లైన మూడోరోజే దారుణంగా చంపించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనను మరువక ముందే.. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో మరో పరువుహత్య వెలుగుచూసింది.

తల్లిదండ్రులు చూసిన సంబంధం కాదని.. తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లిచేసుకుంటానని కూతురు ఎదురుచెప్పడంతో ఆగ్రహించిన తల్లి.. ఆమెను అతి దారుణంగా చంపేసింది. అందుకు ఆమె కుమారుడు కూడా సహాయం చేయడం గమనార్హం.గార్లదిన్నె మండలం కోటంకలో జరిగిన ఈ ఘటన తీవ్రకలకలం రేపింది. 17 ఏళ్ల యువతి గొంతుకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి హత్యచేశారు. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించడమే ఆమెపాలిట మరణశాసనమైంది. తల్లికూతుర్ల మధ్య తీవ్రమాటలయుద్ధం అనంతరం ఆమెను చంపి.. తల్లి, కొడుకు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Related News

బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే ఎక్కువ కాపు వస్తుందా? అసలు నిజమేంటో తేల్చేసిన సైంటిస్టులు!

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Big Stories

Advertisement
×