E-Paper
Advertisement

 Anasuya Bharadwaj : పవర్ స్టార్ మూవీకి నో అన్న రంగమ్మ అత్త.. రీజన్ అదే

 Anasuya Bharadwaj : పవర్ స్టార్ మూవీకి నో అన్న రంగమ్మ అత్త.. రీజన్ అదే
Advertisement

Anasuya Bharadwaj : యాంకర్ గా బుల్లితెరపై తన కెరీర్ ను మొదలుపెట్టి క్రమంగా వెండితెర పై గ్లామర్ షో చేస్తున్న నటి అనసూయ. ఆమె చేసే మూవీస్ కంటే కూడా ఇన్స్టా లో పెట్టే పోస్టులతో అనసూయ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటుంది. సపోర్టింగ్ రోల్స్ లోనే కాకుండా విలన్ రోల్స్ కూడా అద్భుతంగా పోషించగలను అని పుష్ప.. దాక్షాయిని రూపంలో ప్రూవ్ చేసుకుంది. తాజాగా ఆమె యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన మరొక ఇంటర్వ్యూలో మాట్లాడిన కొన్ని మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనసూయ తన కెరీర్ ప్రారంభంలోనే పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది మూవీలో నటించే ఆఫర్ వచ్చిందని పేర్కొంది. అయితే ఆ ఆఫర్ ని అనసూయ రిజెక్ట్ చేసిందట. ఇక దీని కారణంగా సోషల్ మీడియాలో పెద్ద రచ్చ కూడా జరిగినట్టు చెప్పింది అనసూయ. పవన్ కళ్యాణ్ మూవీకి నో చెప్పడంతో పవర్ స్టార్ అభిమానులు ఆమెను బాగా ట్రోల్ చేశారట. అప్పుడే కొత్తగా ట్విట్టర్ లోకి ఎంటర్ అయిన అనసూయ పవన్ ఫ్యాన్స్ దాడికి బెంబేలెత్తిపోయింది. ఒక హీరోకి ఇంత ఫాన్ ఫాలోయింగ్ ఉంటుంది అని తెలుసుకొని అనసూయ ఆశ్చర్యపోయిందట.

Advertisement

ఇంతకీ అనసూయకు వచ్చిన ఆ ఆఫర్ దేనికో తెలుసా.. అత్తారింటికి దారేది మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేయడానికి అనసూయను అడిగారు. అయితే ఆ టైం కి అనసూయ ప్రెగ్నెంట్.. అయినా పర్లేదు పవర్ స్టార్ మూవీ కదా అనుకుంటే.. ఆ సాంగ్ లో అనసూయ తో పాటు ఇంకా చాలామంది ఉంటారని తెలిసిందట. ఫుల్ ఫోకస్ తన పైనే ఉండాలి అని కోరుకోవడం తో అనసూయ ఆ సాంగ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ ,త్రివిక్రమ్ మూవీ అనగానే చేద్దామనుకున్నాను ..కానీ గుంపులో ఒకరిగా ఉండడం నాకు ఇష్టం లేదు అనడంతో అసలు గొడవ మొదలైందని అనసూయ అంది.

అత్తారింటికి దారేది మూవీ చూసిన తర్వాత సోషల్ మీడియాలో అనసూయ పెట్టిన పోస్ట్ పెద్ద రచ్చకు దారి తీసింది. సినిమా చూసిన తర్వాత ఆ గుంపులో ఉండకపోవడమే బెటర్.. ఆఫర్ వదులుకొని మంచి పని చేశాను అని అనసూయ పెట్టిన ఆ సదరు పోస్ట్ పవర్ స్టార్ అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. దీంతో అనసూయని వాళ్ళు సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసారు. అయితే అప్పట్లో తాను ఎక్కువ ముక్కుసూటిగా మాట్లాడేదాన్ని..లౌక్యం పెద్దగా తెలియదని..ప్రస్తుతం ఎలా ఉండాలో నేర్చుకుంటున్నానని కూడా అనసూయ చెప్పుకొచ్చింది. ఇక వీటితో పాటు తనకు సంబంధించిన పలు విషయాల గురించి కూడా అనసూయ చర్చించింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×