Big Stories

KS Eshwarappa Comments: బీజేపీ రెబల్ అభ్యర్థి షాకింగ్ కామెంట్స్..

Eshwarappa Sensational Comments on BJP: బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప షాకింగ్ కామెంట్స్ చేశారు. తన నిర్ణయం విషంలో వెనక్కి తగ్గేదేలే అంటూ ఆయన పేర్కొన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని గట్టిగా తాను నిర్ణయించుకున్నట్లు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఈశ్వరప్ప నిర్ణయం తీసుకోవడంతో ఆయనను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది.

- Advertisement -

పార్టీ క్రమశిక్షణా నియమావళికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు ఆయనను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను బీజేపీ ఎదుగుదలకు ఎంతో కష్టపడ్డానని, ఇంకా తనకు పార్టీపైన నమ్మకం ఉందని, అయితే, తాను మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. అంతేకాదు.. పోటీ చేసి గెలిచి, మళ్లీ బీజేపీలోకే తిరిగి వెళ్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Also Read: నన్ను రాజకీయంగా ఫినీష్ చేశామన్నారు.. మళ్లీ నా గురించే ఎందుకు చర్చా..?

డెబ్బై ఐదేళ్లు ఉన్న ఈశ్వరప్ప పోటీ చేయాలనే నిర్ణయంలో స్థిరంగా ఉండడంతో ఆయనను శాంతింపజేసుందుకు పార్టీ నాయకులు ప్రయత్నాలు చేశారు. కానీ, ఆయన వారి ప్రయత్నాలను తిరస్కరించారు. దీంతో ఆయనను పార్టీ నుంచి ఆరేళ్లపాటు సస్పెండ్ చేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, బీజేపీ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కూడా ఈశ్వరప్ప పని చేశారు. అయితే, తన కుమారుడికి ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

యడియూరప్ప, హెచ్ ఎన్ అనంత్ కుమార్ లతో కలిసి ఆయన కర్ణాటకలో అట్టడుగు స్థాయిలో బీజేపీని నిర్మించడంలో చాలా కీలకంగా పని చేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని బీజేపీ పార్టీలో కొంత హడావుడీ వాతావరణం నెలకొని ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News