Uddhav Thackeray Fires on BJP: శివసేన (యూటీబీ) నాయకుడు ఉద్దవ్ థాకరే తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. బుల్దానాలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు. తమ పార్టీని నకిలీ శివసేన అంటున్నారని, తన పార్టీ వారిలాగా నకిలీ డిగ్రీ లాంటిది కాదు అని.. తనది నిజమైన శివసేన అని ఆయన అన్నారు.
అంతేకాదు.. ఆ నిజమైన సేనే తన బలమెంటో వారికి చూపిస్తుందంటూ ఉద్దవ్ థాకరే మండిపడ్డారు. అంతేకాదు.. తనని పదే పదే రాజకీయంగా ఫినీష్ చేశామని చెప్పుకుంటున్న బీజేపీ… పదే పదే తన గురించే చర్చిస్తుందని… ప్రతిరోజూ తననే టార్గెట్ చేస్తున్నదని.. మరి తనని రాజకీయంగా ఫినీష్ చేసినంక ఇంకా అలా ఎందుకు చర్చిస్తున్నారని ఆయన బీజేపీని ప్రశ్నించారు. బీజేపీకి ప్రజలే గుణపాఠం చెబుతారని థాకరే అన్నారు.
Also Read: చేతులు జోడించి వేడుకుంటున్నా.. ప్లీజ్ అలా మాట్లాడొద్దు: భావోద్వేగంతో తేజస్వీ
అంతేకాదు.. కేంద్ర ప్రభుత్వ పనితీరును, పలు పథకాలపై కూడా ఆయన మాట్లాడుతూ మండిపడ్డారు. ఇప్పటికైనా బీజేపీ తన తీరును మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 300 సీట్లకు పైగా గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.