Naga Chaitanya – Sobhita Dhulipala Vacation Together: అక్కినేని నాగ చైతన్య.. సమంతతో విడిపోయాక కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నాడు. వరుస సినిమాలతో బిజీగా మారాడు. పాన్ ఇండియా లెవెల్లో ఎదగడానికి కష్టపడుతున్నాడు. ఇక ఇంకోపక్క ఈ కుర్ర హీరో.. హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నాడు. ఈ జంట ఎక్కడికి వెళ్లినా కలిసివెళ్తున్నారట.. కెమెరా కంటికి మాత్రం చిక్కడం లేదంతే.
విదేశాల్లో వీరిద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించిన విషయం తెల్సిందే. అయితే తమ మధ్య ఏమి లేదని శోభితా ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చింది కానీ, చై మాత్రం ఈ విషయమై ఎక్కడా నోరు విప్పింది లేదు. ఇక ఈ మధ్యకాలంలో ఈ జంట కలిసి కనిపించకపోయేసరికి ఇవన్నీ పుకార్లేమో అనుకున్నారు. కానీ, మరోసారి ఈ జంట అడ్డంగా దొరికిపోయారు. ప్రస్తుతం చై వెకేషన్ లో ఉన్న విషయం తెల్సిందే. మొన్న వైల్డ్ లైఫ్ సఫారీలో సూర్యస్తమయాన్ని చూస్తూ కూల్ గా ఉన్న చై ఫోటో షేర్ చేశాడు.
Also Read: #PawanKalyanWinningPithapuram: ‘ఎక్స్’ ను షేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఇదెక్కడి మాస్ రా మావా..!
ఇక తాజాగా శోభితా కూడా అదే వైల్డ్ లైఫ్ సఫారీలో ఉన్నట్లు ఫోటోలు షేర్ చేసింది. అంతేనా చై దిగిన సూర్యాస్తమయం ఫోటో శోభిత షేర్ చేసిన ఫోటోల్లో కూడా ఉంది. దీంతో ఈ జంట కలిసే వెకేషన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. లొకేషన్ కరెక్ట్ గా సెట్ అవ్వడంతో కన్ఫర్మ్ వీరిరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే శోభితను చై వివాహాం చేసుకోనున్నట్లు మళ్లీ రూమర్స్ మొదలయ్యాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఇక శోభిత అచ్చతెలుగందం అని అందరికి తెల్సిందే. తెనాలిలో ఆమె పుట్టి పెరిగింది. మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకొని ఇప్పుడు హాలీవుడ్ లో పాగా వేయడానికి రెడీ అవుతుంది.