BigTV English
Advertisement

Ind vs AFG Match : ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ పోరులో బలాబలాలు ఎవరి పక్క ఉన్నాయి

Ind vs AFG Match  : ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ పోరులో బలాబలాలు ఎవరి పక్క ఉన్నాయి
Ind vs AFG Match

Ind vs AFG Match : ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈరోజు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఫేవరెట్ టీం ఇండియా అయినప్పటికీ ఆఫ్గనిస్తాన్ ని తక్కువ అంచనా వేయడానికి ఏమాత్రం వీల్లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆఫ్గన్ టీం లోనూ మ్యాచ్ విన్నర్లు చాలామంది ఉన్నారు. పైగా బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. లాస్ట్ వరల్డ్ కప్ లో ఆఫ్గన్ సేన మన టీం ఇండియన్ 250 పరుగులు కూడా చేయకుండా కట్టడి చేయగలిగింది. మరోపక్క ఇండియా టీం లో కూడా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు.


వరుస విజయాలతో ముందుకు దూసుకు వెళ్తున్న టీం ఇండియా కు ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ టీం ఎంత వరకు పోటీ నిలబడుతుంది అనేది తెలియాల్సి ఉంది. మొన్న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ ఓడిపోయింది. అయితే ఈరోజు జరగబోయే మ్యాచ్ కి సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.

క్రికెట్ అభిమానులకు అరుణ్ జెట్లీ స్టేడియం గురించి అవగాహన ఉండే ఉంటుంది. ఇంతకుముందు ఐపీఎల్ లో ఆడినప్పుడు ఈ పిచ్చిపై ఎక్కువ స్పిన్ బౌలింగ్ కు అనుకూలంగా ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో దీన్ని కాస్త రీమోడిఫై చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం ఈ పిచ్చిపై బౌలింగ్ కంటే కూడా బ్యాటింగ్ కి ఎక్కువ అనుకూలత ఉంటుంది. అందుకే మొన్న జరిగిన శ్రీలంక సౌతాఫ్రికా మ్యాచ్ లో పరుగులు వరదై పారాయి.


నిజానికి ఈ పిచ్చి పై స్పిన్ బౌలింగ్ కి అనుకూలం ఉన్నట్లయితే ఎక్కువ వికెట్లు పడి రన్స్ చేయడం చాలా కష్టం అయ్యేది. కానీ మొన్న జరిగిన శ్రీలంక సౌతాఫ్రికా మ్యాచ్లో రెండు టీములు పోటీపడి మరి పరుగులు చేశాయి. దీంతో ప్రస్తుతం ఈ పిచ్చికి హై స్కోర్ గేమ్ అనుకూలిస్తుంది అని అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు జరగబోయే మ్యాచ్ కూడా మంచి స్కోరింగ్ గేమ్ అవుతుంది అని అభిమానులు ఆశిస్తున్నారు.

అయితే ఇది ఇంతకుముందు జరిగిన మ్యాచ్ పరిస్థితి.. అయితే ఈరోజు జరగబోయే మ్యాచ్లో పిచ్ ఎవరికి అనుకూలిస్తుందో ఎవరికి తెలియదు…కాబట్టి మ్యాచ్ ఏ విధంగా ఉంటుంది అనే విషయం పై స్పష్టత లేదు. మరోపక్క ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్లలో ఇండియా రెండు మ్యాచ్ లలో గెలవగా, ఒక మ్యాచ్ టై అయింది. అంటే గణాంకాలు బట్టి ఆఫ్ఘనిస్తాన్ టీం పై ఇండియా టీం భారీగానే ఉంది. ఇక అరుణ్ జెట్లీ స్టేడియంలో ఈ పిచ్ పై టీమిండియా ఇప్పటివరకు ఆడిన 20 మ్యాచ్లలో 13 మ్యాచ్ లు గెలిచింది. అంటే ఈ రికార్డు ప్రకారం తీసుకున్న విన్నింగ్ ఛాన్స్ టీమ్ ఇండియాకి ఎక్కువ ఉంది.

  ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆఫ్గన్ టీం బౌల్లెర్స్ మనల్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కానీ పేస్ బౌలింగ్ లో మాత్రం టీం ఇండియా బ్యాటర్లను ఎదుర్కొనే సత్తా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ టీం కు లేదు. ఒక్కసారి పేస్ బౌలింగ్లో చెలరేగారు అంటే ఇక టీం ఇండియా ప్లేయర్స్ ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించడం కన్ఫర్మ్. పైగా కింగ్ కోహ్లీ సొంత గడ్డ ఢిల్లీలో జరిగే ఆట…దీంతో కింగ్ పర్ఫామెన్స్ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొని ఉన్నాయి.ఇక మన బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా మేజిక్ , రవీంద్ర జడేజా స్పీడ్ వర్క్ ఔట్ అయితేఇక మ్యాచ్ రిజల్ట్ వేరే రకంగా ఉంటుంది. రెండు గంటలకు ఢిల్లీ అరుణ్ జెట్లీ స్టేడియంలో స్టార్ట్ కానున్న మ్యాచ్ కోసం అందరూ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు .

Related News

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Big Stories

×