Big Stories

Pawan Kalyan : శ్రవణ్ కు పవన్ సపోర్ట్.. బీజేపీని ఉడికిస్తున్న జనసేనాని!

Pawan Kalyan : దాసోజు శ్రవణ్. బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. అనూహ్యంగా ఆయనకు పవన్ కల్యాణ్ విషెష్ చెప్పారు. అదేంటి. దాసోజుకు జనసేనానికి ఏంటి సంబంధం? ఈయన పార్టీ మారితే ఆయనెందుకు ఆల్ ది బెస్ట్ చెప్పారు? అందులోనూ జనసేన మిత్రపక్షమైన బీజేపీ నుంచి బలమైన నాయకుడు బయటకు వెళితే.. పవన్ సపోర్ట్ చేయడం వెనుక రాజకీయం ఉందా? అనేది ఆసక్తికరం.

- Advertisement -

దాసోజు శ్రవణ్, పవన్ కల్యాణ్ ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. విదేశాల నుంచి వచ్చిన దాసోజు.. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. వాళ్లిద్దరు ప్రజారాజ్యంలో కలిసి పని చేశారు. సబ్జెక్ట్ నాలెడ్జ్, మంచి వాగ్ధాటి ఉన్న శ్రవణ్ కు.. యువరాజ్యం బాధ్యతలు చూసిన పవన్ కల్యాణ్ కు మధ్య అనుబంధం ఉండేది. ఆ తర్వాత దాసోజు టీఆర్ఎస్ లో చేరడం.. అటునుంచి కాంగ్రెస్ లోకి.. ఇటీవల బీజేపీకి.. మళ్లీ ఇప్పుడు గులాబీ దళంలోకి.. ఇలా వరుసగా పార్టీలు మారుతున్నా వారి రిలేషన్ అలానే ఉంది. ఆ పాత పరిచయం, సాన్నిహిత్యంతోనే తాజాగా టీఆర్ఎస్ లో చేరిన శ్రవణ్.. డైనమిక్, విజనరీ లీడర్ అంటూ ట్వీట్ చేయడం ఆసక్తికరం.

- Advertisement -

అయితే, ఇందులోనూ రాజకీయం వెతుకుతున్నారు కొందరు. పవన్ కావాలనే.. బీజేపీని ఉడికించాలనే.. దాసోజు శ్రవణ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారని అంటున్నారు. లేదంటే, జనసేన మిత్రపక్షమైన బీజేపీ నుంచి ఓ కీలక నేత బయటకు వెళితే.. పవన్ ఆయన్ను ఎంకరేజ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రోడ్ మ్యాప్ ఇవ్వటం లేదంటూ, తమను పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేసిన పవన్.. ఇప్పుడిలా దాసోజుకు మద్దతుగా నిలవడం వెనుక బీజేపీని కార్నర్ చేసే స్కెచ్ ఉండి ఉంటుందని అంటున్నారు.

జనసేన వాదన మరోలా ఉంది. ఏపీలో మాత్రమే బీజేపీతో జనసేన పొత్తు ఉందని.. తెలంగాణ బీజేపీతో జనసేనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. దాసోజు శ్రవణ్ కు వ్యక్తిగతంగా మాత్రమే పవన్ విషెష్ చెప్పారని.. ఇందులో రాజకీయం ఏమీ లేదని వాదిస్తున్నారు. అసలు కారణం ఏదైనా.. శ్రవణ్ కు పవన్ ఆల్ ది బెస్ట్ చెప్పడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News