E-Paper
Advertisement

Stock Market : లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. స్థిరంగా రూపాయి, బంగారం..

Stock Market : లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. స్థిరంగా రూపాయి, బంగారం..
Advertisement

Stock Market : భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో మొదలయ్యాయి. మధ్యాహ్నం సమయానికి 300 పాయింట్లకు పైగా లాభంలో ఉన్నాయి. నిన్న అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ సూచీల్లో ఇవాళ ఆచితూచి ట్రేడింగ్ జరుగుతోంది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్నా… నిన్న బ్రిటన్ ప్రధాని రాజీనామాతో యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆ ఎఫెక్ట్ తో మన మార్కెట్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. రూపాయి విలువ బలహీనంగా ఉండటం, చమురు ధరల్లో మళ్లీ పెరుగుదల తదితర అంశాలపై ఇన్వెస్టర్లు ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచారు.

Advertisement

సెన్సెక్స్ 30 సూచీలోని కంపెనీల్లో… యాక్సిస్‌ బ్యాంక్‌, టైటన్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్‌, ఎస్‌బీఐ, మారుతీ, నెస్లే ఇండియా, ఎల్అండ్‌టీ, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ఉండగా… బజాజ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు… ఇవాళ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అంబుజా సిమెంట్స్‌, ఐడీబీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హిందూస్థాన్‌ జింక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు… సెకండ్ క్వార్టర్ ఫలితాలు ప్రకటించనున్నాయి.

మరోవైపు రూపాయి మారకం విలువ డాలర్ తో పోలిస్తే 6 పైసలు బలపడి… 82 రూపాయలా 85 పైసల దగ్గర ట్రేడవుతోంది. ఇక బంగారం ధరలు హైదరాబాద్ లో స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 10 రూపాయలు తగ్గి… 4,625 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర 11 రూపాయలు తగ్గి… 5,056 రూపాయల దగ్గర ఉంది. వెండి ధర కిలోకు 500 రూపాయలు పెరిగి… రూ.61,500కు చేరింది.

Related News

బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే ఎక్కువ కాపు వస్తుందా? అసలు నిజమేంటో తేల్చేసిన సైంటిస్టులు!

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Big Stories

Advertisement
×