BigTV English

Elon Musk : 5,500 మంది పొట్టకొట్టేందుకు రెడీ అయిన మస్క్…

Elon Musk : 5,500 మంది పొట్టకొట్టేందుకు రెడీ అయిన మస్క్…

Elon Musk : సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ట్విట్టర్ కొనుగోలులో ఇప్పటికే అనేక ట్విస్ట్ లు ఇచ్చిన ఎలాన్ మస్క్… ఎలాంటి దారుణ నిర్ణయాలకు సిద్ధపడ్డాడో తాజాగా బయపడింది. ట్విట్టర్ డీల్ పూర్తయ్యాక… నెల రోజుల్లోనే 75 శాతం మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపాలని మస్క్ నిర్ణయం తీసుకున్నాడని… వాషింగ్టన్ పోస్ట్ బయటపెట్టింది. ట్విట్టర్లో ప్రస్తుతం 7,500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 5,500 మంది ఉద్యోగాలను ఊడగొట్టి… కేవలం 2000 మందితో మాత్రమే ట్విట్టర్ ను నడిపేందుకు మస్క్ స్కెచ్చేశాడని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.


44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ డీల్ ను పూర్తి చేసి… 3 ఏళ్లలో ఆదాయాన్ని రెట్టింపు చేసే వ్యూహాలతో పాటు… కోతలకు కూడా మస్క్ ప్లాన్ చేశాడని అంతర్జాతీయ మీడియా ధృవీకరించింది. ట్విట్టర్‌ కొనేందుకు కావాల్సిన నిధుల సమీకరణ సమయంలోనే మస్క్ ఈ విషయాలన్నీ పెట్టుబడిదారులతో చెప్పారని వెల్లడించింది. అలా అయితేనే కంపెనీ ఆర్థికంగా బలీయంగా తయారవుతుందని మస్క్ వారికి హామీ ఇచ్చినట్లు బయటపెట్టింది. నిజానికి టిట్టర్ కూడా ఉద్యోగుల్ని తగ్గించుకోవాలన్న ఆలోచనతోనే ఉంది. అందుకే కొత్తగా ఎవర్నీ నియమించుకోవడం లేదు. కానీ… ప్రస్తుతానికి ఎవర్నీ తొలగించే ఆలోచన లేదని ఉద్యోగులకు హామీ ఇచ్చింది.

నకిలీ ఖాతాల అంశంలో ట్విట్టర్ తప్పుడు లెక్కలు చూపుతోందని ఆరోపిస్తూ డీల్ ను మస్క్ పెండింగ్ లో పెట్టడంతో… ఆ సంస్థ కోర్టుకెక్కింది. దాంతో… ఈ అక్టోబర్ 28లోపు రెండు వర్గాలు ఏదో ఒక నిర్ణయానికి రావాలంటూ… న్యాయమూర్తి గడువు ఇచ్చారు. అప్పటికీ ఓ నిర్ణయానికి రాలేకపోతే… నవంబర్ నుంచి విచారణ ప్రారంభిస్తామని చెప్పారు. మరి ట్విట్టర్ మస్క్ చేతుల్లోకి వస్తుందా? వస్తే ఎంతమంది ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతుంది? అనేది… భవిష్యత్తే చెప్పాలి.


Related News

Trump Statement: భారత్, పాక్ కి నేనే వార్నింగ్ ఇచ్చా.. మరింత గట్టిగా ట్రంప్ సెల్ఫ్ డబ్బా

Trump’s Tariff War: ట్రంప్ టారిఫ్ స్టార్ట్! భారత్‌కు కలిగే నష్టాలు ఇవే..

India Vs America: అమెరికాతో ఢీ అంటే ఢీ.. ట్రంప్ సుంకాల్ని వెనుక వ్యూహమేంటి?

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

Kim Jong Un: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. నమ్మండి ఇది నిజం

Donald Trump: మళ్లీ షాకిస్తున్న ట్రంప్.. ఇక అమెరికా గ్రీన్ కార్డు పొందడం కష్టమే..

Big Stories

×