Big Stories

Tillu Square: ‘టిల్లు స్క్వేర్‌’కు ఓటీటీ డిమాండ్‌.. భారీ మొత్తంలో నెట్‌ఫ్లిక్స్‌కు సొంతం

OTT demand for ‘Tillu Square’: సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఈ నేపథ్యంలోనే ఆయన ‘టిల్లు స్క్వేర్‌’లో నటిస్తున్నారు. హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌.. మల్లిక్‌రామ్‌ దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్‌ క్రైమ్‌ కామెడీ మూవీపైన అంచనాలు భారీగా ఉన్నాయి. చిత్రీకరణ పూర్తి చేసుకుని.. మార్చి 29న థీయేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

తాజాటా వ్యాలంటైన్స్‌ డే సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలై అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో అనుపమ చాలా గ్లామర్‌ లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు సంభందించి ఓటీటీ రైట్స్‌ కోసం డిమాండ్‌ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం సిర్మిస్తుంది.

- Advertisement -

Read More: హీరో నిఖిల్ తండ్రి అయ్యారు.. ఫొటో వైరల్

‘డీజే టిల్లు’ మార్చి 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దీనిని ఓటీటీ రైట్స్‌ కోసం నెట్‌ఫ్లిక్స్‌ భారీ మొత్తంతో దక్కించుకునట్లు సమాచారం. ఈ సినిమా కోసం నెట్‌ఫ్లిక్స్‌ దాదాపు రూ.35కోట్లకు తీసుకునట్లు సినిమా వర్గల్లో సమాచారం. ఇంత మొత్తం పెట్టి యువ హీరో సినిమా కోనడం వెనుక కారణలు ఏంటో అని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి.

అయితే సిద్ధు నటించిన ‘డీజే టిల్లు’ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. చిత్రంలో సిద్ధు నటన యువతను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో రాధికా అనే పేరు కూడా చాలా పారులర్‌ అయ్యింది. దీంతో ‘టిల్లు స్క్వేర్‌’పై అంచనాలు పేరిపోయాయి. ఈ అంచనాలతోనే నెట్‌ఫ్లక్స్‌ రూ.35కోట్లకు ఈ సినిమాని కొనట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News