BigTV English

Nikhil Become a Father: హీరో నిఖిల్ తండ్రి అయ్యారు.. ఫొటో వైరల్

Nikhil Become a Father: హీరో నిఖిల్ తండ్రి అయ్యారు.. ఫొటో వైరల్

Tollywood Hero Nikhil Become a Father: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తండ్రి అయ్యారు. ఈరోజు ఉదయం నిఖిల్ భార్య పల్లవి పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిఖిల్ సోషల్ మీడియాలో ఓ ఫొటోను తమ అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ కాగా.. నిఖిల్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ మేరకు నిఖిల్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


ఇక నిఖిల్‌ సినీ కెరీర్‌ విషయాకొస్తే.. హ్యాపీ డేస్ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నిఖిల్. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పటికీ ఈ మూవీ సాంగ్ బాగా ట్రెండ్ అవుతూ ఉంటాయి.

ఇక ఈ మూవీ తర్వాత నిఖిల్ పలు సినిమాలు నటించి మెప్పించాడు. కార్తికేయ, స్వామిరారా సినిమాలతో సూపర్ హిట్స్ అందుకొని అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. ఇటీవలే కార్తికేయ 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు.


READ MORE: ఏఐ టెక్నాలజీతో ఎస్‌పీ బాలు వాయిస్.. తరుణ్ భాస్కర్‌పై రూ.కోటి డిమాండ్..!

ఈ సినిమాతోనే నిఖిల్ పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. ముఖ్యంగా ఈ సినిమాలోని థ్రిల్లింగ్ ఎలివేషన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టి నిర్మాతలకు లాభాల పంట పండించింది. ఇక ఈ సినిమా తర్వాత నిఖిల్ ‘స్పై’ మూవీ తీశాడు.

భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫల్ అయింది. దీంతో నిఖిల్ తన తదుపరి ప్రాజెక్ట్‌లపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఈ సారి మరింత డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నాడు.

ఇందులో భాగంగానే ఇప్పుడు మరో పాన్‌ ఇండియా మూవీ చేస్తున్నాడు. ‘స్వయంభూ’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో నిఖిల్ యోధుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. దీనికోసం నిఖిల్ కఠోర శిక్షణ తీసుకుంటున్నాడు.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

×