AP Rainfall: ఏపీలో వర్షపాతం లెక్కలు చూస్తే పరిస్థితి అంత ఈజీగా కొట్టిపారేయలేనిదే. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఏపీలో సాధారణ వర్షపాతం 452.9 మిల్లీమీటర్లు కావాల్సి ఉండగా.. నమోదైంది కేవలం 203.9 మిల్లీమీటర్లు. అంటే ఏకంగా 55 శాతం లోటు. కొన్ని జిల్లాల్లో లోటు 60 నుంచి 70 శాతాన్ని దాటింది. ఇదే అంశాన్ని పట్టుకుని వైసీపీ కరువు ఎమర్జెన్సీ, ప్రత్యేక రైతు ప్యాకేజీ కోరుతోంది. 685 మండలాల్లో 653 మండలాలకు లోటు వర్షపాతం ఉందని అంటోంది. అయితే కూటమి మాత్రం ఎల్ నినో ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని.. వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోందని ఎదురుదాడి చేస్తోంది. అటు చంద్రబాబు హిట్-రన్-హైడ్ అంటూ వైసీపీపై ఫైర్ అయ్యారు. మరి కరువు చుట్టూ వైసీపీ పోరుబాట పెంచితే అధికార కూటమి పార్టీల వ్యూహం ఏంటన్నది చూడాలి.