Hostel Safety: ఢిల్లీలోని సత్యనికేతన్‌లో విద్యార్థులు ఉంటున్న ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన పెను సంచలనం సృష్టించింది. మృతుల సంఖ్య పెరుగుతోంది. శిథిలాల కింద మరికొందరి కోసం గాలింపు జరుగుతోంది. దర్యాప్తులో భవనం వయసు, అదనపు నిర్మాణాలు, బేస్‌మెంట్‌లో జరుగుతున్న పనులు, నీరు చేరడం, ఎమర్జెన్సీ సేఫ్టీ ఏర్పాట్ల లోపాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. ఇది ఢిల్లీకే పరిమితమైన సమస్య కాదు. హైదరాబాద్ మాదాపూర్‌లోనూ ఏడు అంతస్తుల నిర్మాణం కూలి ఇద్దరు చనిపోయారు. రద్దీ ప్రాంతాల్లో విద్యార్థుల డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటూ.. భవనం బలంగా ఉందా? అనుమతులున్నాయా? ఫైర్ సేఫ్టీ ఉందా? ఇలాంటివేమీ చూడకుండా హాస్టళ్లు నడిపిస్తే.. ప్రమాదం జరిగిన తర్వాత బాధ్యులను వెతకడం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా?