Madhuri Rathod: మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి ఇటీవల ఫోక్ సాంగ్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాట కంటే కూడా ప్రస్తుతం వీరిద్దరు వారి వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి ఒకే గదిలో ఉండడంతో రెడ్ హ్యాండెడ్ గా ఈశ్వరి భార్య వారిని గుర్తించి అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ మధ్య వివాదం చెలరేగడంతో మాధురి రాథోడ్ నార్సింగ్ పోలీసులను ఆశ్రయించి ఈశ్వర్ సాయిపై కేసు నమోదు చేశారు.
ఇలా మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి తనని మోసం చేశారని తన పట్ల చర్యలు తీసుకోవాలి అంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పోలీసులు ఈశ్వర్ సాయి పట్ల ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఆమె తీవ్ర నిరాశకు గురి అయ్యారు పోలీస్ తీరుపై మాధురి ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు నుంచి ఈశ్వర్ సాయిని తప్పించడం కోసం తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు కూడా తనకు సరైన న్యాయం చేయలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంలో మాధురి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఈ వ్యవహారంపై మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి పట్ల ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు చేసి దాదాపు 16 రోజులు అయినప్పటికీ ఈశ్వర్ సాయిని అరెస్టు చేయలేదు అంటూ ఈమె పోలీసులను ప్రశ్నించారు. వెంటనే ఈశ్వర్ సాయిని అదుపులోకి తీసుకోవాలని ఈమె పోలీసులను కోరడంతో పోలీసులు కూడా 24 గంటల్లో ఈశ్వర్ సాయిని అరెస్టు చేస్తామంటూ తెలియజేశారు. ఇక మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి భార్య శరణ్య సంధ్యారాణిపై కూడా కేసు నమోదు చేయబోతున్నారని సమాచారం. ఇలా ఈ కేసు విషయంలో ఈశ్వర్ సాయికు 24 డెడ్ లైన్ పెట్టినట్టు తెలుస్తుంది.
మాధురి రాథోడ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కారణంగా ఈశ్వర్ సాయి ఏ క్షణమైన అరెస్ట్ కావచ్చని తెలుస్తోంది. ఇక ఈ కేసు విషయంలో తనకు న్యాయం జరగలేదని మాధురి రాథోడ్ సూసైడ్ లెటర్ రాసి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసింది .అయితే ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు గది తలుపులు బద్దలు కొట్టి మాధురి రాథోడ్ ను కాపాడగలిగారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తనుకు న్యాయం జరగలేదంటూ ఆత్మహత్యకు పాల్పడిన ఈమెకు పోలీసులు న్యాయం చేస్తారా? ఈశ్వర్ సాయినీ అదుపులోకి తీసుకుంటారా అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మరి వీరి వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో తెలియాల్సి ఉంది.
Also Read: బిగ్ బాస్ 10 విన్నర్ ఎవరో చెప్పిన వర్షిణి…ఈ ఓవర్ కాన్ఫిడెంట్ ఎంటమ్మడు?