E-Paper
Advertisement

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి
Advertisement

Raghavender Reddy: బిగ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానెల్స్ ఛైర్మన్ వెన్నం విజయ్ కాంత్ రెడ్డి తండ్రి వెన్నం రాఘవేందర్ రెడ్డి (79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాఘవేందర్ రెడ్డి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ.. జిల్లా సంవిధాన్ బచావో కమిటీ సభ్యులుగా సేవలు అందించారు.

ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సంతాపం తెలిపారు. రాఘవేందర్ రెడ్డి మరణం వారి కుటుంబానికి తీరని లోటని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నివాళులర్పించారు.

Advertisement

మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ.. విజయ్ రెడ్డి కుటుంబానికి ఈ కష్ట సమయంలో దేవుడు మనోబలాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. పాత్రికేయ లోకం సైతం బిగ్ టీవీ చైర్మన్ కుటుంబానికి అండగా నిలుస్తూ శ్రద్ధాంజలి ఘటించింది.

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×