Viral Video: భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు పెనుభూతంగా మారాయి. భార్యని ప్రశ్నించిన పాపానికి అల్లుడ్ని చితకబాదారు. రాత్రి వేళ ఓ వీధిలోకి తీసుకెళ్లి కుమ్మేశారు. ఎంతలా అంటే కేవలం 25 సెకన్లలో 35 పంచ్‌లు విసిరారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.
యూపీలో బాగ్‌పత్ ప్రాంతంలోని డోలీ గ్రామంలో ఓ ఫ్యామిలీ ఉంటోంది. భార్యను ప్రశ్నించినందుకు బావని ఇద్దరు బావమరదులు చావబాదారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. బాధిత వ్యక్తి పేరు రోహిత్. విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు.
ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రోహిత్ ఇంటికి వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరని భార్యని ప్రశ్నించాడు. విచిత్రం ఏంటంటే రోహిత్ తన భార్యని ప్రశ్నించడం తప్పయ్యింది. డ్యూటీ నుంచి రోహిత్ ఇంటికి రాగానే భోజనం చేసిన తర్వాత చిన్న వీధిలోకి తీసుకెళ్లారు భార్య సోదరులు. ఆ తర్వాత చావబాదారు.
ఎంతలా అంటే కేవలం అర నిమిషంలో 35 పంచ్‌లు విసిరారు. ఈ తతంగాన్ని రోహిత్ మామ చూస్తూ ఉండిపోయాడు. గొడవను ఆపే ప్రయత్న చేయలేదు. చివరకు రోహిత్ ముఖం వెంబడి రక్తం కారేలా కొట్టారు. ఈ ఘటనను చూస్తూ ఉండపోయింది రోహిత్ భార్య. ఏమాత్రం జోక్యం చేసుకోలేదు.
ALSO READ: న్యూస్ చదువుతుండగా పడ్డ బాంబు.. లైవ్‌లో యాంకర్
స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు రోహిత్. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ కేసుకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ ఉన్నప్పటికీ పోలీసులు అరెస్టులు లేకపోవడాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు.
నిందితులను రక్షించడాన్ని పోలీసులు వ్యవహరిస్తున్నారనే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. దీనిపై చాలామంది సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు చర్య తీసుకోకపోతే సమాజానికి ఎలాంటి సందేశాన్ని పంపుతున్నారని ఇంకొందరి ప్రశ్న.
More than 35 punches in 25 seconds, in-laws beat son-in-law
◆ In Baghpat, in-laws beat son-in-law mercilessly
◆ When they were not satisfied, they grabbed son-in-law's feet and threw him on the ground#Baghpat #ViralVideo | Baghpat Viral Video pic.twitter.com/macC6wcpg1
— ShoneeKapoor (@ShoneeKapoor) June 16, 2025