Tehran: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రమైంది. ఏ ఒక్కరూ వెనక్కి తగ్గలేదు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరింది. ఫలితం రాత్రి-పగలు తేడా లేకుండా బాంబులు, క్షిపణుల మోత మోగుతోంది. ఇజ్రాయెల్ ప్రయోగించిన ఓ క్షిపణి సరిగ్గా టెహ్రాన్‌లోని ప్రభుత్వ న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై పడింది. ఇంకేముంది.. లైవ్ ఉన్న యాంకర్ ఒక్కసారిగా పరుగులు పెట్టింది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నాలుగో రోజుకి చేరింది. ఇరుదేశాల మధ్య భీకరంగా యుద్ధం జరుగుతోంది. ప్రధాన నగరాలు డ్యామేజ్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ పైకి ఏకంగా వందకు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది ఇరాన్. దీంతో టెల్ అవీవ్‌తోపాటు పలు నగరాల్లో భారీ పేలుళ్లు జరిగాయి. పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన 8 మంది మరణించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఇక క్షతగాత్రుల సంఖ్య గురించి చెప్పనక్కర్లేదు. ఆ సంఖ్య వందల్లో ఉంది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ రెచ్చిపోయింది. అమ్ముల పొదలోవున్న అస్త్రాలను బయటకు తీసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సిటీపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు స్వైర విహారం చేశాయి. ఓ వైపు క్షిపణులు, మరోవైపు బాంబుల వర్షం కురిపించాయి.
అదే సమయంలో టెహ్రాన్‌లోని ప్రభుత్వ వార్తా చానల్ ఇరిన్ ప్రధాన కార్యాలయ భవనంపై క్షిపణి ప్రయోగించింది ఇజ్రాయెల్. దీని ధాటికి భవనం ధ్వంసమైంది. ఆ సమయంలో యాంకర్ లైవ్‌లో వార్తలు చదువుతోంది. వార్తలతోపాటు దాడితో సంభవించిన పేలుడు శబ్ధం సైతం టీవీలో వినిపించాయి. స్టూడియో మొత్తం భవనం శిధిలాల దుమ్ముతో నిండిపోయింది.
ALSO READ: నోట్ల కట్టను ఎత్తుకెళ్లిన కోతి, వైరల్ వీడియో
యాంకర్ వెనుకనున్న స్క్రీన్ తెగిపోయి కిందపడింది. భయపడిన యాంకర్ వెంటనే కెమెరాను ఆపేసి బయటకు పరుగులు పెట్టింది. కొద్దిసేపు వార్తల ప్రసారం నిలిచి పోయింది. కొద్దిసేపటి తర్వాత యాంకర్ సహర్, మరో యాంకర్‌తో కలిసి మరో స్టూడియోలో వెళ్లింది.
ప్రీ రికార్డెడ్ కార్యక్రమాలను కంటిన్యూ చేసింది ఆ ఛానెల్. పేలుడు కారణంగా ఆఫీసు అద్దాలు ధ్వంసమయ్యాయి. మిగతా ప్రాంతాల్లో చెలరేగిన మంటలతో కూడిన వీడియోలు ఆ ఛానెల్‌లో టెలికాస్ట్ అయ్యాయి. ప్రభుత్వ టీవీ ఛానెల్‌పై దాడికి గంట ముందు ఇజ్రాయెల్ ఆదేశాన్ని హెచ్చరించింది. ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించింది. అయినా ఇరాన్ ఆలస్యం చేసింది. ఫలితం చెల్లించుకుంది.
టెహ్రాన్ సిటీలోని ఓ ప్రాంతంలో పలు టీవీ, రేడియో చానెళ్లతోపాటు ఇరిన్ కార్యాలయం ఉంది. ఈ ప్రాంతంలో సుమారు 3 లక్షల మందికి పైగానే పని చేస్తుంటారు. దాడుల నేపథ్యంలో టెహ్రాన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని సాధారణ ప్రజలకు సూచించింది ఇజ్రాయెల్. గతంలో గాజా, లెబనాన్‌లో దాడులకు ముందు ఇజ్రాయెల్ సైన్యం ఈ విధంగానే హెచ్చరికలు జారీ చేసింది.
టెహ్రాన్ సిటీపై ఆధిపత్యం సాధించామన్నది ఇజ్రాయెల్ సైనికుల మాట. ఆదేశంలో ఉన్న అణు స్థావరాలను ధ్వంసం చేసి తీరుతామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ మరోసారి స్పష్టం చేశారు. ఇరాన్ సుప్రీం అయితొల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఓ బంకర్‌లో ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Israel struck the building of Iranian state television during a live broadcast, – writes Clash Report.
Smoke is now rising from the television building, and there is a fire.#IsraelIran #IranStateTV #Tehran #IsraeliStrike #MiddleEastConflict #WarEscalation #MediaTarget pic.twitter.com/2HV5DJgSBn
— Mr.Luminaris (@MrLuminaris) June 16, 2025